April 24, 2024

తలరాత మార్చిన క్షణాలు

రచన: G.V.L. నరసింహం ఆ ఊరి పేరు కొత్తపేట. ఎంత కొత్తదో తెలియదు కాని, ఆ ఊళ్లోని ఇళ్లన్నీ, తాతలనాటి పాతవే. ఆలా అని, చిన్న చూపు చూడకండి. ఆ గ్రామానికున్న కట్టుదిట్టమయిన భద్రతా ఏర్పాట్లు తెలుసుకొంటే, మీరే ఆశ్చర్యపోతారు. అందులోనూ విశేషమేమిటంటే, అంత అభేద్యమయిన భద్రతకు, గ్రామవాసులు ఒక చిల్లిగవ్వ కూడా ఖర్చు చేయలేదు. ప్రభుత్వం భరించిందనుకొంటున్నారా. అది కలలో మాట. నిజానికి ప్రభుత్వం, ఆ ఏర్పాట్లను నాశనం చేసే దిక్కుగా, అడుగులేస్తోంది. ఆ భద్రతా […]

అపాత్రదానం

రచన: ప్రభావతి పూసపాటి “మీ బామ్మకి రాను రాను చాదస్తం ఎక్కువైపోతోంది.. ఎవెరెలా పొతే మనకేంటి అని అనుకోకుండా. సమాజసేవ, మంచి, మానవతా విలువలు అంటూసైదమ్మకి చెప్పాలని చూసారు. విసురుగా అంటూ టేబుల్ మీద గిన్నెలు తీసి సింకులో పడేయడానికి వెళ్ళింది. శ్వేత. “ఏమి? ఏమైంది ఈ రోజు కూడా సైదమ్మ పనిలోకి రాలేదా ??” తన ప్లేట్ కూడా తీసి సింక్ లో వేస్తూ అడిగాడు సిద్దు. “మీ బామ్మసుభాషితాలు విన్నాక ఎటువంటి వారైనా ఇల్లాంటి […]

మాటే మంత్రము

రచన: ప్రభాప్రసాద్ “రేపే మనం వూరు వెళుతున్నమ్మోయ్” ఆఫీస్ నుండి వస్తూనే అరిచినట్టుగా చెపుతూ చిన్నపిల్లాడిలా సంతోషపడిపోతు సురేంద్ర సోఫా లో కూర్చుండిపోయాడు. భర్త సంతోషం చూసి తను కూడా ఆనంద పడుతూ కాఫీ చేతికి ఇచ్చి “ఇంత సంతోషం గా వున్నారు. శంకరం మాస్టారిగారి గురించి ఏమైనా తెలిసిందా “అడుగుతూ సోఫా లో కూర్చుంది . “అవును సుధా! ఈ రోజు నా చిన్ననాటి స్నేహితుడు గిరీశం కలిసాడు. శంకరం మాస్టారు ఈ నెలాఖరున అంటే […]

భయం

రచన: రాజ్యలక్ష్మి. బి అరుణకు యేమి చెయ్యాలో అర్ధం కావడం లేదు. నిజం . ఏదో ఒకరోజు బయటపడి తీరుతుంది. మరి తనేం చెయ్యాలి యిప్పుడు ? ఆ ప్రశ్నకు సమాధానం దొరకక తికమక పడుతున్నది. ఏ వుపాయము తట్టడం లేదు.. యిప్పుడు యేమి చేసినా చిక్కే ! చెయ్యకపోయినా చిక్కే ! అసలే పల్లెటూరు !చిన్న విషయం నిమిషాల్లో గుప్పుమంటుంది. పోనీ తన స్నేహితురాళ్లను అడుగుదామనుకుంటే వాళ్ళు తనని వేళాకోళం పట్టిస్తారేమోనని భయం !పోనీ జరిగినది […]

జీవితమంటే..

రచన: విజయలక్ష్మీ పండిట్ ఉదయం ఐదు గంటలకే లేచి మిద్దె పైన వాకింగ్ చేస్తున్నాను. రోజు తూర్పున ఇంటిముందు మెల్లమెల్లగా తన ప్రత్యూష కిరణాలు సంధించి చీకట్లను పరుగులు పెట్టిస్తూ ఎఱ్ఱని బంతిలా ఆకాశం పొత్తిళ్ళలో వెలిగిపోయే ఉదయించే బాలభానుడి అందాలను తిలకిస్తూ నడవడం నా కెంతో ఇష్టం. ఇంటి చుట్టూ ఎత్తుగా పెరిగిన చెట్ల కొమ్మలనుండి వీచే చల్లని గాలి ఒకవైపు శరీరాన్ని మృదువుగా తాకుతూంటే, ఆదిత్యుని లేత కిరణాల స్పర్శతో శరీరానికి మనసుకు చెప్పలేని […]

తేనె మనసులు

రచన: పరేష్ బాబు ఎన్నో వ్యాపారాలు చేసి నష్టపోయి ఆఖరి ప్రయత్నంగా శంకర్ విలాస్ భోజన హోటల్ ప్రారంభించాడు శంకరరావు. హోటల్ కు వచ్చే కస్టమర్ల కోసం ఆయన భార్య అన్నపూర్ణమ్మ వంటలు చేసేది. సరిగ్గా హోటల్ ప్రారంభం రోజే ఎక్కడినుంచి వచ్చాడో ఒక యువకుడు వచ్చి శంకర్రావును కలిసాడు ‘సార్. నా పేరు సుందరం. నాకు మీ హోటల్లో సర్వర్ ఉద్యోగం ఇవ్వండి సార్. నమ్మకంగా పనిచేసుకుంటా’. అడిగాడు ‘చూడు బాబూ. నేను నా భార్య […]

ఋణం

రచన: దొడ్డపనేని అఖిలాండేశ్వరి “గుల్లూ ఏం డిసైడ్ చేసావ్? తోడు నీడవై జీవితాంతం నాతో కలిసి నడుస్తావనే ఆశ నెరవేరుతుందను కొంటున్నా, మరి నీతీర్పు ఏవిటో!” ఉత్సుకత నిండిన స్వరంతో ప్రశ్నించాడు కృష్ణవంశీ. కృష్ణవంశీ మోకాలుమీద తన గడ్డం ఆన్చుకుని కూర్చుని అతని మొహంలోకి తదేకంగా చూస్తున్న గుల్షాద్ కళ్ళల్లో నీళ్ళు చిప్పిలి ముత్యాల సరాలయ్యాయి చెంపలమీద. తన చేత్తో బుగ్గల మీది కన్నీటిని తుడుస్తూ ” ఛ!ఛ! కన్నీళ్ళెందుకు నీకు యిష్టమైతే అవునను లేదంటే లేదు, […]

కానుక

రచన: ప్రభావతి పూసపాటి “లంచ్ అయ్యిందా?” అంటూ చొరవగా తలుపు తీసుకొని రాఘవరావు గారి రూమ్ లోకి ప్రవేశించారు ప్రకాష్ రావు. రాఘవరావుగారు కుర్చీలో వెనక్కివాలి కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నారు. ప్రకాశరావు ,  రాఘవరావు ఇద్దరు చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు . ఒకే గవర్నమెంట్ ఆఫీస్ లో చాలా కాలంగా కలిసి పని చేస్తున్నారు. రాఘవరావు గారు చాలా కష్టపడి , నిజాయతి తో పని చేసి ప్రమోషన్స్ తో త్వర త్వరగా పైకి  వచ్చి పెద్ద […]

కంభంపాటి కథలు – ప్రయాణం

రచన: కంభంపాటి రవీంద్ర భ్రమరకి ఒకటే భయంగా ఉంది .. ఊరంతా కరోనా అట .. ఊరంతా ఏమిటీ ..రాష్టం , దేశం ప్రపంచం .. అంతా కరోనా ! తనుండే కాకినాడలో అయితే జనాలు విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు … బయటకి వెళ్ళాలన్నా .. ఇంట్లోకి ఎవరినన్నా రానివ్వాలన్నా చాలా భయంగా ఉంది ! పని పిల్లని, పేపర్ వాడిని మానిపించేసింది.. అపార్ట్మెంట్ లో ఇరుగు, పొరుగు ఎవరి తలుపులు వారు మూసుక్కూచున్నారు.. మనిషన్న వాడి మొహాన […]

భవ( బాల) సాగరాలు

రచన: గిరిజారాణి కలవల ” సుధీర్! బబ్లూ ఇంకా ఇంటికి రాలేదు! స్కూల్ వదిలి చాలా సేపయింది. వచ్చి ఫ్రెష్ అయి ఐఐటి కోచింగ్ క్లాస్ కి వెళ్ళాలి. టైమయిపోతోంది” అంటూ నీలిమ కంగారుగా భర్త కి ఫోన్ చేసింది. ఆఫీసులో తలమునకలయే పనిలో కూరుకునిపోయి ఉన్న సుధీర్ కి, నీలిమ దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో చిర్రెత్తిపోయాడు. అసలే , తను చేసిన ఫైల్ లో తప్పులు తడకలు ఉన్నాయని, సాయంత్రం ఎంత […]