March 29, 2024

వెన్నెల జాము

రచన: డా. బాలాజీ దీక్షితులు పి వి వెన్నముద్ద తినిపిస్తుంది కన్నె చందమామ కన్నుల పూసిన కలువలు గండె గూటికి చేరుస్తుంది వెన్నెల హంస మధుర మధురామృత మధువును త్రాగిస్తుంది వలపుల పందేరం పరిమళ సుధాసుగంధంతో అప్సర మధనం చేస్తుంది చిరు వయ్యారం ప్రేమ నెమిలిక నెయ్యంతో నిలువెళ్ళా పూస్తుంది వన్నెల సోయగం పదునైన పైయెదల పరువపు శూలాలతో దాడి చేస్తుంది కన్నె తనం స్వప్నం నుండి లేవగానే వెన్నెల జాము మల్లెల వర్షంలో భావుక తపస్సుచేసే […]

మౌనం.

రచన: విజయలక్ష్మి కొఠారి.   రూపు లేని నేను, రూపము లోని స్పందనను. అనుభవములోని అనుభూతిని, అవగాహా న్ని, అతీతాన్ని, జీవములోని చలనాన్ని. భాష లేని నేను భాష లోని భావాన్ని. సహనాన్ని నేను,  మౌనాన్ని నేను. నీ చుట్టూ నేనే, నీ తోడు నేనే. నీ రూపు నిశ్చలమై, చివరకు చేరేను … నాలో మౌనాన్ని నేను. మౌనాన్ని నేను, నీలో, నీ చుట్టూ మౌనాన్ని నేను, మౌనం ఎంత మనోహరమో, మౌనం ఎంత కర్కశమో, […]

బడికి పండగొచ్చింది..!!

రచన: అమ్ము బమ్మిడి పది నెలలుగా భయపడుతూ బయటకు కనపడని బడి ఇయ్యాల కాస్త ధైర్యం తెచ్చుకుంది.. మహమ్మారి కోరలకు బలికాకుండా తాళం వేసుకున్న బడి ఇయ్యాల మళ్ళీ తెరుచుకుంది.. ఏడాదిగా ఎవరినీ రానివ్వకుండా తల్లడిల్లిన బడి ముంగిట్లో చిన్నారులను ఇయ్యాల ముద్దుచేసి ఆహ్వానిస్తోంది..!! ఇన్నాళ్లుగా చీకట్లో మగ్గిన గది తలుపులు తీయగానే ఇయ్యాల మళ్ళీ ఊపిరి తీసుకుంది..!! నెలల తరబడి బోసిపోయిన బడి చిన్నారుల నవ్వులు చేరగానే ఇయ్యాల మళ్ళీ కళకళలాడుతోంది..!! ఒంటరిగా మూగబోయిన గంట […]

కన్నీటిచుక్కలు

రచన: శుభశ్రీ రాజన్ కన్నీటిచుక్కలు ఒకదానితో ఒకటి ఇలా మాట్లాడుకున్నాయి…. జీవితాన్ని బలపరిచే ఆలోచనలతో వచ్చే కన్నీటిచుక్కలు పునాదులవుతాయి.. ఊహించని సంతోషంతో వచ్చే కన్నీటిచుక్కలు ఆనందబాష్పాలవుతాయి.. మనసు బద్దలవడంతో వచ్చే కన్నీటిచుక్కలు మోసపోకు అని అప్రమత్తం చేస్తాయి.. కలయికతో వచ్చే కన్నీటిచుక్కలు కొత్త ఉత్తేజానికి దోహదపడతాయి.. కలలతో వచ్చే కన్నీటిచుక్కలు కాలంలో విజయాన్ని దాచిపెడతాయి.. కోల్పోవడాలతో వచ్చే కన్నీటిచుక్కలు జీవిత మార్గాన్ని సరి చేసి చూపిస్తాయి.. కఠోర శ్రమతో వచ్చే కన్నీటిచుక్కలు ఉన్నతి దిశలోకి తీసుకుపోతాయి.. జవాబులు […]

నేటి యువత

రచన: కొత్తపల్లి మంత్రినాథరాజు సాప్ట్ వేర్ యుగంలో యువతంతా కంప్యూటర్లోకి జారిపోయి డాలర్లకు వ్రేలాడుతూ మానవ సంబంధాలకు యాంత్రికత వేపు పరుగులు పెట్టిస్తూ పులుముకున్న నవ్వులు మలుపుకున్న మాటలు సహజత్వాన్ని మ్రింగేస్తూ అన్న వస్త్ర సాంప్రదాయాలను ఫాస్ట్ పుడ్డులకు గాజు గదులకు అంకితమిస్తూ పల్లెలకు పిల్లల్లా కాక బొమ్మల్లా వస్తూ, పోతూ కాలువ గట్లనూ ఏటి గుట్టలనూ ఆస్వాదించ లేకపోతూ పొలం పనిముట్ల హార్డు వేరునూ పలకరించలేని తనంతో అన్నం పెడుతున్న రైతు వేర్లను పలకరించే తీరిక […]

నేను నిత్యాన్వేషిని!

రచన: వసంతరావు నాగులవంచ గుళ్ళు గోపురాలు దండిగా దర్శించాను మసీదులు చర్చ్ లలో ప్రార్థనలు చేశాను తీర్థ యాత్రలు చేసి తిప్పలెన్నో పడ్డాను నాకు దేవుడెక్కడా మచ్చుకు కన్పించలేదు! నోములు వ్రతాలు చాన్నాళ్ళుగా ఆచరించాను ముడుపులెన్నో కట్టి మొక్కు చెల్లించాను నిలువు దోపిడీ యిచ్చి నిండా మునిగాను దేవుడెందుకో నాకు కన్పించనేలేదు! గుట్టలు పుట్టలు పిచ్చిగా వెదికాను కొండ గుహల్లోకి అత్యాశగా తొంగిచూశాను హిమాలయాలలో మౌనంగా ధ్యానం చేశాను మరెందుకో దైవం జాడ నాకు తెలియనేలేదు! గురువులు […]

దీపపు వ్యక్తిత్వం

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు. దీపపు దివ్యవ్యక్తిత్వం కొడిగడుతోంది దీపం దైవపుఒడి చేరుతోంది,పాపం. వేకువతో సమానంగా వెలుగులను పంచాలనే ప్రయత్నంలోనే ప్రతిక్షణం జీవించి, చీకటితెరలను తన శాయశక్తులా తెంచివేయాలనే తాపత్రయాన్నిశ్వాసించిన ఈదీపం, పాపం,తన చివరిక్షణాలను ఎదుర్కొంటోంది. చీకటితెరలు తనని కప్పేస్తున్నా, వెలుగురేఖలు తననివీడి వెళిపోతున్నా, ధైన్యం లేకుండానే వెలుగుతోంది, నిర్వికారంగానే మలుగుతోంది. తన ఆఖరిశ్వాసను కూడా వెలుగును పంచుతూనే వదులుతోంది. తనను వెలిగించిన వారికి కృతజ్ఞతను అలా తెలుపుకుంటోంది. తను పోతేనేం? మరోదీపం వెలిగించబడుతుందని తెలుసు, తను […]

కాలంపై నా కలం.

రచన: మణి కాలమా ! ఓ గమనమా!! అలసట, ఆకలి ఎరుగని, వార్దక్యం లేని ఓ సొగసరి, వివిధ ప్రమాణాలు ఉన్నా, నీ ప్రయాణంలో ఏ మార్పూ ఉండదు. విశ్వ విజేతలను అలఓకగా ఓడించగల ధీశాలి, తారతమ్యభేదాలు, భేషజాలు తెలియని భాగ్యశీలి. ప్రవాహ ఝరీ వేగాన్ని ఆవలీలగా జేయించగల నీవు, కాంతి వేగాన్ని సైతం క్షణిక లో కమ్మేయ్యగలవు జననానికి నీవు, మరణానికి నీవు, జీవన స్రవంతికి నీవు చరిత్రకు సాక్షి నీవు, భవిష్యత్తుకు భరోసా నీవు […]

జీవిత గమనం

రచన: చందు కె శేఖర్ నిదుర పోదామంటే నిదుర రాదాయే తెల్లవారిందంటే టెన్షన్ మొదలాయే వ్యాయామానికి వేళ సరిపోదాయే పూజకు సమయంలేక దండమాయే ఆఫిసుకి ఉరుకులు పరుగులాయే ఎంత పరుగెడినా ఆఫీసుకి లేటాయే లేటుకి కాటు శాలరీ కట్ ఆయే ఎంత పని చేసినా గుర్తింపు లేదాయే పనికి తగ్గ ప్రతిఫలం లేదాయే మన పని చాలక ఇతరుల పని కూడాయే సాయంత్రం ఆరైనా పని తెగదాయే ఆరు ఎనిమిదాయె, తొమ్మిదాయే మల్లి ఉరుకులు పరుగులతో ఇంటికి […]

నిశా సుందరి ….. నా ప్రియ సఖి ….

రచన: భావన పాంచజన్య నీడైనా నన్ను వీడిపోతుంది కానీ… నా ఈ ప్రియ సఖి నన్ను ఎన్నటికీ వీడిపోదు.. వీడిపోలేదు డస్సిన మేనికి శీతల వింజామరలతో ఒడిన సేద దీర్చేను ఈ నిశా మాత …. ప్రియుని రాకకై చుక్కల చీర కట్టి చలి వెన్నెల తడిసి విరహాగ్నితో నిరీక్షించే విరహిణి ఈ ఇందుకాంత శశాంకుని తన వాలుజడన తురిమి వయ్యారామొలికించు ఈ చంద్ర కాంత చుక్కల హారాలు గళసీమ కైసేయు సింగారాల బంగారి ఈ తారాభూషిణి […]