April 19, 2024

గోపమ్మ కథ – 4

రచన: గిరిజారాణి కలవల నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా, గోపమ్మ … లక్ష్మి రెక్క పట్టుకుని ముందుకి లాగి, “చెప్పవే! అమ్మగారు అడుగుతున్నారుగా! చెప్పూ!” అంది కోపంగా. ఏం జరుగుతుందో నాకు అర్ధం కాలేదు. ఉదయం నుంచి నేను పడుతున్న ఆదుర్దా అయితే, లక్ష్మిని చూడగానే తీరింది కానీ, హైదరాబాద్ నుంచి ఇక్కడకి ఈ పిల్ల ఎలా రాగలిగిందా? అనే సందేహం వచ్చింది. “ఉండు, గోపమ్మా! దాన్నేం అనకు. నేను కనుక్కుంటాను” అన్నాను. “ఏంటమ్మా! కనుక్కునేది ? […]

గోపమ్మ కథ – 3

రచన: గిరిజారాణి కలవల ఆ రోజు మా ఇంట్లో పనికి గోపమ్మ రాను అని కబురు చేసింది కాబట్టి… నాకు ఆలోచించుకుందుకి కాస్త సమయం దొరికింది. లక్ష్మి దొరికిన పిల్లే అయినా తన స్వంత కూతురులాగే పెంచింది గోపమ్మ. ఏదో డబ్బు వస్తుందన్న ఆశతో, నా మాట మీద నమ్మకంతో హైదరాబాద్ పంపింది. ఇప్పుడు లక్ష్మి కనపడ్డం లేదంటే ఎలాంటి గొడవ చేస్తుందో అని నాకు ఆందోళన కలిగింది. ఇందులో నా తప్పు లేదు.. హైదరాబాద్ లోని […]

భవ( బాల) సాగరాలు

రచన: గిరిజారాణి కలవల ” సుధీర్! బబ్లూ ఇంకా ఇంటికి రాలేదు! స్కూల్ వదిలి చాలా సేపయింది. వచ్చి ఫ్రెష్ అయి ఐఐటి కోచింగ్ క్లాస్ కి వెళ్ళాలి. టైమయిపోతోంది” అంటూ నీలిమ కంగారుగా భర్త కి ఫోన్ చేసింది. ఆఫీసులో తలమునకలయే పనిలో కూరుకునిపోయి ఉన్న సుధీర్ కి, నీలిమ దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో చిర్రెత్తిపోయాడు. అసలే , తను చేసిన ఫైల్ లో తప్పులు తడకలు ఉన్నాయని, సాయంత్రం ఎంత […]

మీలాంటివాడే చెపితే వినడు, కొడితే ఏడుస్తాడట

రచన: గిరిజరాణి కలవల “మండోదరరావు మూర్ఖత్వం “ “మీలాంటివాడే చెపితే వినడు, కొడితే ఏడుస్తాడట.. చస్తున్నా మీతో.. “ పెనం మీద అట్టు తిరగేస్తూ అంది రావణి. “ఏంటోయ్! ఇప్పుడు నేనేం చేసానూ? నామీద ఎగురుతున్నావు”అన్నాడు మండోదరరావు. “ఏం చేయలేదు అని అనండి… ఏం చేసినా, ఏం చెప్పినా రెట్టమతమే మీరు. ఫలానాది తీసుకురండి అని ప్రత్యేకంగా చెపితే, అది తప్ప మిగతావన్నీ తెస్తారు. తేవద్దు అని ఏదైనా చెపితే అదే విపరీతంగా తెచ్చి పడేస్తారు. అయోమయం […]

” ఇస్పేటు రాజు ❤ ఆఠీను రాణి”

రచన: గిరిజారాణి కలవల ” కంచం ముందు కూర్చుని ఏం ఆలోచిస్తున్నావురా ? నెయ్యి వేసాను, ముక్కలు కలుపు” అంటూ కొడుకుని గదిమింది సావిత్రి. ” ఏంటీ ముక్కలు వేసావా? కోసిందెవరూ? జోకరేంటీ ? ” అన్నాడు రాజు. ” ఏడిసినట్టే ఉంది నీ జోకు.. జోకరట, జోకరు, పొద్దస్తమానం ఆ పేకముక్కల్లో పడి దొర్లుతూంటే, కంచంలో వేసినవి కూరముక్కలని కూడా తెలీకుండా ఉంది నీ బుర్రకి. నా ఖర్మ కొద్దీ దొరికారు ఆ తండ్రీ, ఈ […]

హరిలో రంగ హరీ.. జలజం పని హరీ

రచన: గిరిజారాణి కలవల ” ఇదిగో.. చెపుతున్నది కాస్త ఓ చెవిన పడేసుకోండి.. ఆనక మళ్లీ.. నాకు ఎప్పుడు చెప్పావు అంటే ఊరుకోను” .. అంది జలజం . ” అసలు నువ్వు ఏం చెప్పాలనుకున్నావో చెప్పకుండా ఈ నిందా స్తుతేంటే.. ఏం కావాలో చెప్పు.. ఒక్క చెవిలో ఏం ఖర్మ.. రెండు చెవుల్లోనూ గరాటు వేసుకుని మరీ పడేసుకుంటా.. ” అన్నాడు జలజాపతి . ” అబ్బో, మీ ఎకసెక్కాలు చాల్లెండి.. మొన్న కొన్న పుస్తకాల […]

రేపటి వట వృక్షాలు.

రచన: గిరిజారాణి కలవల మాదాపూర్ లో అదొక గేటెడ్ కమ్యూనిటీ…రో హౌసెస్.. అన్నీ ఒకేలా తీర్చిదిద్దినట్లుండే ఎనభై డ్యూ ప్లెక్స్ విల్లాలు అవి. అక్కడ నివసించే వారు బాగా ధనవంతులూ.. ఉన్నత స్థాయి కుటుంబాలవారే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులూ, డాక్టర్లు, పెద్ద వ్యాపారస్ధులే. ఇంకా కొందరి పిల్లలు ఫారిన్ కంట్రీలలో స్ధిరపడిపోతే.. పేరెంట్స్ ఇక్కడ ఇళ్లు కొనుక్కుని ఉంటున్నారు. ఎక్కడక్కడ సెక్యూరిటీ గార్డులు ఉండడంతో సేఫ్టీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉంటున్నారు. ఈ ఇళ్ల లో వారందరూ […]

జలజాక్షి.. మధుమే( మో) హం

రచన: గిరిజారాణి కలవల “వదినా! ఓ పంకజం వదినా!” అంటూ వీధంత గొంతేసుకుని కేకేస్తూ వచ్చింది జలజాక్షి . ఆ కేక వినపడగానే.. మళ్లీ తెల్లారిందీ దీనికి.. ఈ పూట ఏ అప్పుకోసమో…తెచ్చిన నెల వెచ్చాలు అన్నీ ఈ జలజానికి చేబదుళ్ళు ఇవ్వడానికే సరిపోతున్నాయి.. ముదురుపాకం పట్టిన బెల్లప్పచ్చులా పట్టుకుంటే వదలదు.. అని మనసులో అనుకుంటూ.. పైకి చిరునవ్వు చిలికిస్తూ..”ఏంటి ? జలజం వదినా.. పొద్దున్నే నీ దర్శనం అవందే నాకు తెల్లారదనుకో.. నీ పిలుపే నాకు […]

జలజం.. కరోనా – “కరో”నా.. క”రోనా”

రచన: గిరిజారాణి కలవల ” జలజం.. ఏమోయ్. జలజం.. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయే. వంటింట్లోంచి చుయ్ చుయ్ లు వినపడ్డం లేదూ! ఇంకా వంట మొదలెట్టలేదా?” జలజాపతి పొట్ట నిమురుకుంటూ హాల్లో నుంచి బెడ్ రూమ్ లోకి వచ్చాడు. బెడ్ షీట్లు మారుస్తున్న జలజం. దుప్పటి అక్కడ విసిరికొట్టి ఒక్కసారిగా గయ్ మంది.” చుయ్ చుయ్ లు వినపడ్డం లేదా? ఇప్పుడు టైమింకా పదయిందంతే.. గంట కితమేగా పొట్ట నిండుగా కట్టుపొంగలి లాగించారు.. అప్పుడే ఎలకలు పరిగెడుతున్నాయా? […]

జలజం టీవీ వంట.

రచన: గిరిజరాణి కలవల ” ఆహా.. నా వంటా…ఓహో..నే..తింటా” టివీ షో వారిని ఎప్పుడో.. మన జూలీ తన ఇంటికి రమ్మని పెట్టుకున్న పిలుపు.. ఈనాటికి వాళ్ళు కరుణించి.. ఫలానా రోజున మీ ఇంటికి వస్తాము.. మంచి వంట చేయండి.. రికార్డు చేస్తామని కబురు చేసారు. ఇక మన జూలీ మొహం చూడాలి.. ఆనందంతో తబ్బిబ్బు అయిపోయింది.. వీధి మొత్తం టాంటాం టముకు వేసి చెప్పింది. మూతి ముఫ్ఫై సార్లు తిప్పుకున్నవారు కొందరైతే.. ఆ.. ఇంతే.. ఇలాగే […]