March 28, 2024

అమ్మమ్మ – 31

రచన: గిరిజ పీసపాటి     బైపాస్ సర్జరీ కోసం ఒక పార్టనర్ డబ్బు వెనక్కి తీసుకున్నా, మిగిలిన పార్టనర్స్ పెట్టుబడి తో  షాప్ బాగానే నడుస్తోంది. ఒక రోజు వీళ్ళచేత షాప్ కి పెట్టుబడి పెట్టించిన బంధువు మళ్ళీ వీరి ఇంటికొచ్చి నాగతో “చెల్లీ! నేను బయట పనులు, రిప్రజెంటెటివ్స్ ని మోటివేట్ చెయ్యడం, వాళ్ళ MD లు వస్తే వాళ్ళతో కలిసి డాక్టర్స్ ని విజిట్ చెయ్యడం వంటి బిజినెస్ ప్రమోషన్ కి సంబంధించిన […]

అమ్మమ్మ – 30

రచన: గిరిజ పీసపాటి బిఎడి లో మంచి రాంక్ రావడంతో “టీచర్ ట్రైనింగ్ కోసం విజయనగరం వెళ్ళి జాయిన్ అవనా?!” అని నాగ అడగగానే “ఇక్కడ నన్ను, పిల్లల్ని వదిలేసి నువ్వు విజయనగరం వెళిపోతే ఎలా?” అంటూ ఎదురు ప్రశ్న వేసాడు పెదబాబు. “సీజన్ పాస్ తీసుకుని, రోజూ ఉదయం వెళ్ళి, సాయంత్రానికల్లా వచ్చేస్తానండీ. ఎలాగూ వసంత, గిరిజ ఉదయం ఏడు గంటలకే కాలేజ్ కి వెళిపోతున్నారు. మీరు నాని కూడా తొమ్మిది గంటలకల్లా వెళిపోతారు.” “మీరందరూ […]

అమ్మమ్మ – 29

రచన: గిరిజ పీసపాటి సాధారణంగా ఒకసారి హాస్పిటల్ లో అడ్మిట్ అయితే డిస్చార్జ్ చేసేవరకు పేషెంట్ ని బయటకు పంపరు. కానీ, వసంత డాక్టర్ ని అడిగి, ఆయన ఒప్పుకోకపోతే అలిగి మరీ ఒకరోజు ఇంటికి వచ్చి, తలంటి పోసుకుని, తరువాత శ్రీదేవి – అనిల్ కపూర్ జంటగా నటించిన ‘మిస్టర్ ఇండియా’ సినిమా మేట్నీ షో చూసి, ఆ సాయంత్రం బీచ్ కి వెళ్ళి, తరువాత తిరిగి హాస్పిటల్ కి వెళ్ళింది. గిరిజకు జ్వరం ఒకరోజు […]

అమ్మమ్మ – 28.

రచన: గిరిజ పీసపాటి నాగ అలా అడగడానికి కారణం చిన్నప్పటి నుండి గిరిజ పెద్దగా నడవలేదు. కాస్త దూరం నడిచినా మనిషి నీరసించిపోతుంది. కానీ పరిస్థితిలే ఆరిందాతనాన్ని ఇస్తాయేమో. అందుకే “అదేం లేదమ్మా. కానీ కేరేజీ లోపలకి తీసుకురావాలంటే డబ్బు కట్టాలని కింద గేట్ దగ్గర వాచ్ మేన్ ఆపేస్తున్నాడమ్మా!” అంది. “ఎంత అడిగాడు” అనడిగిన తల్లితో “ఇరవై రూపాయలు” అంది. “సరే. రేపు ఉదయం ఈ పది రూపాయలు ఇవ్వు. మిగిలిన డబ్బులు తరువాత మా […]

అమ్మమ్మ – 28.

రచన: గిరిజ పీసపాటి ఆ సాయంత్రం నుండి తుఫాను వల్ల ఒకటే ఈదరు గాలులతో కూడిన వర్షం కుండపోతగా కురుస్తోంది. గిరిజ, నాని కూడా నిద్ర పోకుండా అక్కనే చూస్తున్నారు. అర్ధరాత్రి దాటినా ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉండడంతో ఎదురింటి ఆర్టీసీ కండక్టర్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చి, భార్యతో “ఏంటి? వసంత వాళ్ళింట్లో ఇంకా లైట్లు వెలుగుతున్నాయి” అని అడిగాడు. ఆవిడ “అవునా! వసంతకెలా ఉందో ఏమిటో!? పదండి చూద్దాం” అంటూ ఇద్దరూ వచ్చారు. వస్తూనే […]

అమ్మమ్మ – 26

రచన: గిరిజ పీసపాటి విశ్రాంతి తీసుకుంటూ, శేష జీవితం గడపవలసిన వయసులో కూడా గరిటె పట్టుకుని ఆ ఇంటా, ఈ ఇంటా వంటలు చేస్తూ సంపాదిస్తున్న తల్లిని డబ్బు అడగడానికి మనసొప్పకపోయినా, తనకు చదువు అంటే ఉన్న ఇష్టం, అంతంత మాత్రంగా ఉన్న తమ ఆర్ధిక పరిస్థితి కారణంగా తల్లికి విషయం వివరిస్తూ ఉత్తరం రాయక తప్పలేదు నాగకి. వారం రోజులలోనే ఆవిడ దగ్గర నుండి ”తప్పకుండా డబ్బు పంపుతాననీ, ఎంత అవసరమౌతుందో తెలియజేయమ’ని జవాబు వచ్చింది. […]

అమ్మమ్మ – 25

రచన: గిరిజ పీసపాటి అల్లుడు వైజాగ్ వెళ్ళాక, ఊరిలో ఉన్న బంధువుల ఇళ్ళకీ, నాగ స్నేహితురాళ్ళ ఇళ్ళకీ వెళ్ళడం, వాళ్ళతో కలిసి విందు భోజనాలు, సినిమాలతో రోజులు త్వరగా గడిచిపోసాగాయి. నెలరోజుల తరువాత అల్లుడు తిరిగి వచ్చి “వారం రోజులు సెలవు పెట్టాననీ, మీరు చెప్పిన బంధువుల ఇళ్ళకు వెళ్ళి, అటునుండి వైజాగ్ వెళిపోతామని” చెప్పడంతో సరేనంది అమ్మమ్మ. గుంటూరు, విజయవాడ, పొందూరు మొదలైన ఊర్లలో ఉన్న బంధువుల ఇళ్ళకు వెళ్ళి, అక్కడి దేవాలయాల సందర్శనం చేసుకుని, […]

అమ్మమ్మ – 23

రచన: గిరిజ పీసపాటి ‘పున్నామ నరకం నుండి తప్పించేవాడు కొడుకు మాత్రమే’ అనుకునే రోజులవి. తనకు కొడుకు పుట్టినా దక్కలేదు. కనుక, వియ్యంకుడికైనా మనవడు పుడితే బాగుండునని అమ్మమ్మ ఆరాటం. అంతే తప్ప ఆడపిల్లల పట్ల చిన్నచూపు ఎంత మాత్రమూ కాదు. నాగ తోడికోడలికి కూతురు పుట్టిన ఏడు నెలలకు నాగ మళ్ళీ గర్భవతి అయిందని వియ్యంకుడి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అమ్మమ్మకి. మళ్ళీ అమ్మమ్మకి హడావుడి మొదలైంది. ఈసారి తొమ్మిదవ నెలలో రాముడువలస వెళ్ళి, […]

అమ్మమ్మ – 20

రచన: గిరిజ పీసపాటి తెనాలిలో పది రోజుల పాటు కష్టపడినా రాని సొమ్ము హైదరాబాదులో ఒక్కరోజు వంట చేస్తే వచ్చింది. అదే అమ్మమ్మకి చాలా అబ్బురంగా అనిపించింది. “రాజేశ్వరమ్మా! వాళ్ళు పొరపాటున ఎక్కువ ఇచ్చినట్లున్నారు. ఒక్కసారి ఫోన్ చేసి వాళ్ళకు ఎక్కువ ఇచ్చారని చెప్తాను” అన్న అమ్మమ్మను ఆపేసారు రాజేశ్వరమ్మ గారు. “ఈ ఊరిలో వంట చేసేవారు ముఖ్యంగా మన గుంటూరు వంట చేసే బ్రాహ్మణ స్త్రీలు దొరకడం కష్టం. అందుకే వాళ్ళు మీ పని మెచ్చుకుని […]

అమ్మమ్మ – 19

రచన: గిరిజ పీసపాటి అమ్మమ్మ, డా పురుషోత్తంగారు మాట్లాడుకుంటూ ఉండగానే కారు పురుషోత్తం గారి ఇంటికి చేరింది. ఆయన నేరుగా ఇంట్లోకి వెళిపోయినా, అమ్మమ్మ మాత్రం బయట కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుని ఒకసారి లలితా పరమేశ్వకి మనసులోనే నమస్కరించుకుని, లోపలికి అడుగు పెట్టింది. రాజేశ్వరమ్మ గారు ఎదురు వచ్చి ఆప్యాయంగా పలకరించి, కాఫీ తెమ్మని వంట మనిషికి పురమాయించారు. కానీ అమ్మమ్మ ఆవిడను వారించి, స్నానం, జపం పూర్తి కానిదే తాగనని చెప్పి నేరుగా పెరట్లోకి […]