April 24, 2024

గిలకమ్మ కతలు – మరేమో..! అమ్మా..నీకో ?

రచన: కన్నెగంటి అనసూయ బోగుల్లోరి దొడ్లో   నందొర్ధనం పూల్లాగా తెల్లగా తెల్లారి పోయి సేలా సేపైపోయిందేవో..ఊరు..ఊరంతా ఒకటే మసాలా కంపు గుమగుమాలాడిపోతంది… అయ్యాల ఆదోరం… ఆ ఈధిలో  పెతాదారం  కోణ్ణి కోసి పోగులేసమ్మే శీలచ్వి  దగ్గర  కోడిమాసం కొని   పొయ్యెక్కిచ్చినోళ్ళు కొందరైతే  పాటి మీద సెర్లో సేపలడతన్నారని సాటింపేత్తే..పందుమ్ముల నోట్లో నవుల్తానే  గేలం మీద సేపకోసవని రెండు మూడు గంటలు పడిగాపులుగాసి మరీ తెచ్చుకున్నోళ్ళు మరికొందరు. నీసుకూరేదైనా తగ్గ మసలా పడాపోతే ..మడుసులేగాదు..కుక్క గూడా మూతెట్తదని, మూతి […]

గిలకమ్మ కతలు – “సారె పంచుడూ..వీపు దంచుడూ!”

రచన: కన్నెగంటి అనసూయ “గిలకా ..! ఒసేయ్ గిలకా ..! తలుపుల్తీసే ఉన్నాయ్. ఏ కుక్కాన్నా వత్తేనో? మీకసల బయమెట్లేదేటే దేవుడు..? ఏ కుక్కన్నా వత్తేనో..” దగ్గిరికేసున్న తలుపుల్ని తోసుకుని లోనికొత్తానే అరిగి, మట్టిగొట్టుకుపోయి తేగతొక్కల్లా ఏల్లాడతన్న అవాయి సెప్పుల్ని మూలకంటా ఇడుత్తా సరోజ్నీ ఎన్నిసార్లరిసినా ఎక్కడా అజాపజాలేదు గిలక. “ ఎక్కడేం పుణుక్కుంటందో? ఇదో పెద్ద ముదిపేరక్క. ఎప్పుడూ..ఏదో ఒహటి పుణుక్కుంటానే ఉంటాది..ముసల్దాన్లాగ. నాయనమ్మ బుద్ధులు మరి. ఎక్కడికి పోతయ్..ఎతుక్కునెతుక్కుని మరీ వతనుగా వత్తయ్..” అని […]

గిలకమ్మ కతలు – గిలకమ్మా.. మజాకా…

రచన: కన్నెగంటి అనసూయ   “ ఇత్తెలిసిందేటే సరోజ్నే….” నిలువునా పరిసిన గోనుసంచి మీద దోసిలితో దోసెడు  తొక్కి , కడిగి ఆరబెట్టిన నూగింజలు పోసి మడిగాళ్లేసుకుని మరీ బత్తాకేసి పావుతా పిన్నత్త కూతురు సూరయ్యమ్మన్న మాటలకి .. అలా బత్తాగుడ్దకేసి  పావిన నూగింజల్నల్లా  సేట్లో పోసుకుని పొట్టు సెరిగేత్తన్న సరోజ్ని సెరిగే సెరిగే సేట్ని ఆమట్నే ఆపేసి దాన్ని మడిసిన  కాళ్ల మీదెట్టి  కళ్ళు సికిలిచ్చి మరీ  సూరయ్యమ్మకేసే అదోలా సూత్తా..”ఏటది..? “ అంది  ఇంత […]

గిలకమ్మ కతలు – అద్దీ.. లెక్క! కుదిరిందా.. తిక్క?

రచన: కన్నెగంటి అనసూయ మజ్జానం బడి వదిలే ఏలయ్యింది. పొద్దున్ననగా పెరుగన్నం తినెల్లినోళ్ళు ఆకలితో నకనకలాడతా ఇంటికొత్తారని.., ఆళ్లకి అన్నాలు పెట్టి తను తినొచ్చులే అని పనంతా అయ్యాకా నీళ్ళోసుకుని ఈధి తలుపులు దగ్గరకేసి వసారా మీద గోడకి నిలబెట్టున్న నులక మంచాన్ని వాల్చి దుప్పటీ, తలగడీ లేకుండా ఆమట్నే ఇలా నడుం వాల్సిందో లేదో సేస్సేసున్న ఒల్లేవో..ఇట్టే కునుకట్తేసింది సరోజ్నికి. అంతలోనే తలుపు మీదెవరో “మేడంగారా..మేడంగారా..” అంటా సేత్తో కొట్టిన సప్పుడై సటుక్కున లేసి కూకుంది […]

గిలకమ్మ కతలు .. గిలకమ్మ..ఆర్నెల్ల ముందే పెద్దదైపోయిందంటల్లా..!

“ఎవర్నీ కొట్టగూడదు..అర్ధవయ్యిందా..?” పాయల్ని బలం కొద్దీ గట్టిగా లాగి జడల్లుతా సరోజ్నంది. “పలకలు పగలగొట్తేవంటే ఈపు ఇమానం మోతెక్కుద్ది ఏవనుకున్నావో..కణికిలసలే తినగూడదు..” మాట్టాళ్ళేదు గిలక. ఊకొట్టిందంతే.. “ ..ఎవర్నీ గిల్లగూడదు..గిచ్చగూడదు..ముక్కూడొచ్చేతట్టు నోటితో కొరెకెయ్యగూడదు…యే ఇనపడతందా..మూగెద్దులా మాట్తాడవే..” చేతిలో ఉన్న జుట్టలాపట్టుకునే ఒక్క గుంజు గుంజింది సరోజ్ని కూతుర్ని.. “ ఊ..అన్నాను గదా..నీకినపడాపోతే నేనేంజెయ్యనూ..” తల్లి విదిలింపులతో అసలే విసిగెత్తిపోయి ఉందేమో..అంతకంటె గట్టిగా ఇసుక్కుంది గిలక ఆళ్లమ్మ మీద. “ నువ్ నోట్టో..నోట్టో..అనుకుంటే నాకినపడద్దా..? గట్టిగా అను. నోరు […]

గిలకమ్మ కతలు – నందినోర్రావుడు ఈడేరిందంటల్లా..!

“ లచ్చివొదినే.. ఇనపళ్ళేదా? ఏంజేత్నా..వంటవ్వలేదా ఏటి..ఇటో అడుగెయ్..?” బాగ్గెలచ్వి ఇంటి ఈధరగు మీదున్న తంబానికి నడుంజేరేత్తానే గుమ్మాలోంచి లోనకంటా సూత్తా సూరయ్యమ్మన్న మాటకి సుట్టింట్లో పప్పు గుత్తితో ముద్దపప్పు మెదాయిత్తన్న ఆ ఇంటావిడికి పేనాల్లేచొచ్చినట్తయ్యి దాన్నామట్నే వొదిలేసి సెయ్యి కడుక్కుని సెంగుకి తుడ్సుకుంటా..బేటికొచ్చి “ఏదీ కానేల గేదీన్నట్టు ..ఇయ్యాల్టప్పుడు ఇలాగొచ్చేవేటి..? ముంతెట్టేసేవేటి “ ఈపుని గోడకి జేరేసి కూకుంటా అంది. “ బియ్యం కడిగి నానబెట్టిటొచ్చేను ..సేలో మందేత్తాకి ఇయ్యాల తెల్లారగట్తే ఎల్లేరు. పాలెర్నంపుతారంట ముంతకి. అయ్యి […]

గిలకమ్మ కతలు – ఎదరంతా … ఎదురీతే !

రచన: కన్నెగంటి అనసూయ “ ఎన్నోత్తా? కుంచుడు నానబోత్తావా.. ..” సీతమ్మంది బియ్యవొంక అదే పనిగా సూత్తా.. అలా సూత్తా సూత్తానే బత్తాలోంచి గుప్పెడు గింజల్దీసి కళ్లకాడికంటా తెచ్చుకుని కళ్ళింతంత సేసి మరీ సూత్తా “ఏటీ..ఇయ్యి పాత బియ్యవేనా? అలా కనిపిత్తాలేదు..” “ అయ్యా..నీతో నేనాపద్దాలాడతానేటే పిన్నే. ఆడితే నాకేగాని నీగ్గాదని నాకు దెల్దా? “ అన్నాకా నిముషమాగి.. “ ఇంకా నిరుటి బియ్యవే తింటన్నాం. అయ్యయిపోతేనేగాని పొణక్కి సిల్లెట్తం. పాత బియ్యవైతే పిండురువవ్వుద్దని , అరిసిలికి […]