“స్వచ్ఛ” తరం

రచన: జ్యోతి వలబోజు

“విజయా!! విజయా!” గట్టిగా అరుస్తూ ఇంట్లోకొచ్చాడు నరహరి.
భర్త కోసం ఎదురుచూస్తూ టీవీ సీరియల్ చూస్తున్న విజయ గభాల్న లేచి వచ్చింది.
“ఏంటీ పెద్దమనిషి? ఎప్పుడు లేనిది ఇవాళ చాలా కోపంగా ఉన్నట్టున్నాడు” అనుకుంది.
గట్టిగా చప్పుడొచ్చేలా అడుగులేస్తూ హాల్లోకి వచ్చి కోపంగా చూసాడు భార్యను.
“ఏమైందండి? ఎందుకలా కోపంగా ఉన్నారు? మీ స్నేహితులతో పార్టీ అని వెళ్లారుగా? అక్కడ ఏదైనా గొడవ జరిగిందా?”
“ఫ్రెండ్స్ కాదు నీ పిల్లలే .. వాళ్లకు ఎంత ధైర్యం? నాకు చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా? ఇక్కడి వ్యవహారాలన్నీ చూసుకుంటున్న నాకే ఏ సంగతి చెప్పకుండా అమెరికానుండే నిర్ణయాలు తీసేసుకునేంత పెద్దవాళ్లైపోయారా?” ఆవేశం, కోపంతో రొప్పసాగాడు నరహరి.
“ముందు మీరు స్తిమితంగా కూర్చోండి. ఈ నీళ్ళు తాగండి. తర్వాత మాట్లాడదాం” అంటూ మంచినీళ్ల గ్లాసు అందించింది విజయ.
నీళ్లు తాగినా కోపం చల్లారలేదు. మౌనంగానే ఉన్నా ఆవేశం తగ్గడం లేదు.
పది నిమిషాల తర్వాత “ఏవండి.. అసలేం జరిగింది. బయటకెళ్లేవరకు బానే ఉన్నారు కదా. మన వ్యాపారంలో ఏదైనా గొడవ జరిగిందా. ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చిందా. అమెరికాలో ఉన్న పిల్లలేం చేసారసలు?” విజయ మెల్లిగా అడిగింది.
పదినిమిషాలు మౌనంగా కూర్చున్నారిద్దరూ. నరహరి కోపం కూడ చాలావరకు తగ్గినట్టుగానే ఉన్నాడు.
“ఏం జరిగిందండి? ఎందుకలా పిల్లలమీద కోపంగా ఉన్నారు?” అడిగింది విజయ.
“మన ఊర్లో ఆ రమణయ్య పొలం, అతని చుట్టుపక్కలవారి పొలాలన్నీ కొందామని మార్కెట్ ధర కంటే తక్కువకు బేరం చేసి, పిల్లలు రాగానే డబ్బులిచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం. ఆ స్థలంలో డిల్లీ నుండి వచ్చిన ఒక కంపెనీ వారితో కలిసి ఫాక్టరీ కట్టాలని నిర్ణయం జరిగింది కదా. దీనికి పిల్లలు కూడా ఒప్పుకున్నారు. కాని ఇప్పుడు నాకు చెప్పకుండా ఆ పొలాలను కొనడం లేదని ఆ రైతులందరికీ చెప్పాడంట నీ సుపుత్రుడు.” ఆవేశంగా అన్నాడు నరహరి.
“అవునా! ఇంత పెద్ద నిర్ణయం మీకు చెప్పకుండా తీసుకున్నారా? అసలు వాళ్లు ఇలా ఎందుకు చేసారు? అది కనుక్కున్నారా? రేపు ఆదివారం కదా కాల్ చేసి మాట్లాడండి అబ్బాయితో” అనునయిస్తూ చెప్పింది విజయ.

******
తెల్లారి ఆదివారం తొమ్మిదిగంటల సమయంలో నరహరి, విజయలు టిఫిన్ చేసి కాపీ తాగుతుండగా అమెరికా నుండి వాళ్లబ్బాయి శ్రీనివాస్ కాల్ చేసాడు.
కొడుకే కాల్ చేస్తాడని తెలిసిన నరహరి ఫోన్ తీసుకోలేదు. తల్లి తీసుకుని మాట్లాడింది.
“అమ్మా! ఫోన్ స్పీకర్ లో పెట్టు. నాన్నకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.”అన్నాడు శ్రీనివాస్.
“నాన్నా! కోపం తెచ్చుకోకుండా నా మాట విను. పొలాలు కొనడం లేదని నువ్వు కోపంగా ఉన్నావని తెలుసు. కాని దానికి కారణం కూడా చాలా ముఖ్యమైనది. మేము ఇక్కడ కష్టపడి సంపాదించింది మన ఊర్లోనే పెట్టుబడి పెట్టాలని నువ్వంటే సరే అని ఒప్పుకున్నాం. కాని వారం క్రితం జరిగిన సంఘటన మా ఆలోచన పూర్తిగా మార్చేసింది”.
“ఏం జరిగింది వాసూ” ఆత్రుతగా అడిగింది విజయ. నరహరి కూడా ఏం జరిగిందో అని వినడానికి రెడీ అయ్యాడు.
******
శ్రీనివాస్ ఆఫీసులో చాలా బిజీగా ఉన్నాడు. ఇయర్ ఎండింగ్ కావడంత తను పని చేస్తున్న ప్రాజెక్టు చివరి దశకు వచ్చింది. చాలా జాగ్రత్తగా టీమ్ ని నడిపించాలి. ఏమాత్రం తేడా వచ్చినా కోట్లలో నష్టం వస్తుంది. అందుకే టెన్షన్ గా కూడా ఉన్నాడు.
ఇంతలో అతని మొబైల్ మ్రోగింది. ఇండియా నుండి కాల్..
“హలో!” కంప్యూటర్ మీద పని చేస్తూ అన్నాడు శ్రీనివాస్.
“ఒరేయ్ వాసూ! నేను శ్యామ్ ని. మన ఊరినుండి మాట్లాడుతున్నాను. చాలా దారుణం జరిగిపోయిందిరా!” చాలా ఆందోళనగా మాట్లాడుతున్నాడు.
“అయ్యో! ఏమైందిరా? అంతా బానే కదా. మనం పొలాలు కొందామని బేరం పెట్టాం. రైతులేదన్నా గొడవ పెడుతున్నారా? డబ్బులు ఎక్కువ అడుగుతున్నారా లేక సర్పంచ్ ఏదైనా లిటిగేషన్ పెట్టాడా?? ఊరి పొలాలు వాడికి దక్కకుండా మన యువకులం కలిసి సేకరిస్తున్నామని మండిపోతున్నాడు కదా..” అన్నాడు వాసు.
“అది కాదురా? ఇటీవల కురిసిన వానలకు మన ఊళ్లోని బడి కూలిపోయింది. ఇద్దరు పిల్లలు చనిపోయారు. మరో పదిమందికి బాగా దెబ్బలు తాకాయిరా. ఆసుపత్రి కూడా అప్పుడో ఇప్పుడో కూలిపోతుందన్నట్టుగా ఉంది. లోపలికి వెళ్లాలంటే అందరూ భయపడుతున్నారు. ఇదే భయంతో ఆసుపత్రికి డాక్టరు రావడం ఎప్పుడో మానేసాడు. కాంపౌండరే చిన్న చిన్న సుస్తీలకు ఆదుకుంటున్నాడు.”
“అయ్యో! ఇంత ఘోరమా? ఊర్లో ఇంతమంది ఉన్నారు. బడిగురించి, ఆసుపత్రి గురించి ఎవ్వరూ పట్టించుకోలేదా? సరే ఇప్పుడేం చేద్దామంటావ్ శ్యామ్?” బాధగా అడిగాడు వాసు.
“నాది, మన ఫ్రెంఢ్స్ ఆలోచించిన తర్వాత అనుకున్న ఆలోచన ఇది. నువ్వు, అక్క కూడా ఆలోచించంఢి. మీరు అమెరికాలో సంపాదించింది ఊర్లో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలనుకున్నారు. దానివల్ల ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. కాని మీరు సంపాదించింది మొత్తం కాకున్నా కొంచెమైనా వ్యాపారం బదులు సాయం చేయగలరా? ఈ బడి, ఆసుపత్రి బాగోగులు మనమే చూసుకుంటే మంచిది కదా. ప్రతీదానికి ప్రభుత్వం అని కూర్చుంటే ఎప్పటికయ్యేను? ఆలోచించి ఏ సంగతి చెప్పండి. మన ఫ్రెంఢ్స్ అందరం ఎదురు చూస్తుంటాం.” అని ఫోన్ పెట్టేసాడు .
*****
“అదీ నాన్నా జరిగింది. మాకోసం నువ్వు బానే సంపాదించావు. నేను అక్క కూడా మంచి ఉద్యోగాలలో ఉన్నాము. అంతా మాకోసం , మా కుటుంబం కోసమే అనుకోకుండా మన పల్లెటూరికి కూడా కాస్త సాయం, సేవ చేయాలనుకున్నాం. వ్యాపారం పెట్టి దాన్ని అభివృద్ధి చేసేబదులు గ్రామంలో కావలసిన సదుపాయాలను ఎందుకు ఏర్పాటు చేయకూడదు అనిపించింది. దీనివల్ల మాకు లాభం డబ్బు రూపేనా అందదు కాని ఎందరికో సాయం అందుతుంది. ఉపాధి కూడా లభిస్తుంది. ఏమంటావు?” అన్నాడు శ్రీనివాస్.
అంతలో వాళ్ల కూతురు స్వప్న కూడా గ్రూప్ కాలింగ్ లో వచ్చింది.
“నాన్నా! రెండు వారాల్లో నేను, తమ్ముడు ఇండియా వస్తున్నాం. అందరం మన ఊరెళదాం. రెడీగా ఉండండి.” అని చెప్పింది.
నరహరి కోపమంతా పోయి ఆలోచనలో పడ్డాడు. ఈ పిల్లలు చేస్తున్నది ఎంతవరకు కరెక్టు. కష్టపడి సంపాదించినదంతా ఇలా ధారపోయడం అవసరమా?? అనుకున్నాడు.

*****

నెల రోజుల తర్వాత రామాపురంలో కోలాహలంగా ఉంది. కూలిపోయిన బడి దగ్గర పెద్ద షామియానా వేసారు. కుర్చీలు వేసారు. గ్రామ యువత చాలా హడావిడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఊరిపెద్దలంతా అక్కడే ఉన్నారు.
ఇంతలో ఆ జిల్లా కలెక్టర్ వంశీమోహన్ ని తీసుకుని నరహరి, విజయ దంపతులు, వాళ్ల పిల్లలు తమ కుటుంబాలతో, మరి కొందరు స్నేహితులందరూ నాలుగైదు కార్లలో వచ్చారు.
గ్రామప్రజలంతా కలెక్టరుగారికి, యువతకు స్వాగతం పలికారు.
ముఖ్యులైన వారు స్టేజ్ మీద కూర్చున్నారు. మిగతావారు స్టేజ్ ముందు షామియానాలో కూర్చున్నారు.
శ్రీనివాస్ లేచి అందరికీ నమస్కరించాడు. “నేను పుట్టింది ఇక్కడే అయినా, పెరిగింది, చదువుకుని ఎదిగింది అంతా పట్టణంలోనే. కాని నా మూలాలు ఇక్కడే అని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. కొంతకాలంగా నేను , మా అక్క, కొందరు అమెరికాలోని స్నేహితులు, ఇక్కడి మిత్రులం కలిసి మన ఊరికి ఏదైనా చేయాలనే కోరికతో మా డబ్బులను ఇక్కడ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి ఉపాధి కల్పిద్దామనుకున్నాము. కాని దానికంటే ముఖ్యమైనవి చాలా ఉన్నయని అర్ధమయ్యాక మా ఆలోచనను కాస్త మార్చుకున్నాము. మా ఆలోచనలు, ప్రణాళికలను కలెక్టర్ గారు మీకు వివరిస్తారు” అని కూర్చున్నాడు.
కలెక్టర్ వంశీమోహన్ లేచి ప్రజలందిరికీ నమస్కరించాడు. “ సాంకేతికత పెరుగుతన్నది. సంపాదన పెరుగుతున్నది. సంపాదించాలనే కోరిక కూడా ఈనాటి యువతలో చాలా హెచ్చుగా ఉన్నది. చదువులన్నీ సంపాదనకొరకే.. వారికి తమ పల్లెటూరు, మాతృభూమి మీద మమకారం అంతగా లేదు. విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిపోతున్నారు అని చాలామంది అనుకుంటారు. ఇది నిజమే కావొచ్చు కాని నేటి తరం మారుతున్నది. వారి ఆలోచనలు మారుతున్నాయి. డబ్బే వారి సర్వస్వం కాదు. ఏదైనా సాధించాలి. కష్టపడాలి. సంపాదించాలి. తమ కుటుంబం కోసమే కాక సమాజం కోసం కూడా తమ వంతు సేవ, సాయం చేయాలనే యువత ముందుకొస్తున్నది. వీరు విదేశాలలో ఉన్నా తమ మాతృభూమిలో ఎటువంటి అవసరం అయినా చేయడానికి ముందుకొస్తున్నారు. కొందరు తమ ఉద్యోగాలను, వ్యాపారాలను కూడా వదిలి తమ స్వస్థలానికి వచ్చి తమతో పాటు ఇతరులకు కూడా ఉపయోగపడే పనులను చేస్తున్నారు. ఇది చాలా సంతోషదాయకం.
మన గ్రామ యువత కూడా తమవంతు సాయంగా కాదు ఒక బాధ్యతగా ఈ ఊరి అభివృద్ధి కోసం ఒక్కటై పని చేయాలని నిర్ణయించుకున్నారు. వారినందరినీ అభినందిస్తున్నాను. ముందుగా బడిని, ఆసుపత్రిని బాగు చేయాలని. పాత బిల్డింగులను తీసేసి కొత్తగా నిర్మించాలని ఆలోచన. దీనికి కావలసిన సొమ్ము అమెరికానుండి పంపిస్తే ఇక్కడి యువత దాన్ని ఈ కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఇదంతా నిస్వార్ధ సేవ. ఇందులో ఎవరి జోక్యము, ఆటంకము ఉండకూడదు. ప్రభుత్వం తరఫున మా పూర్తి సహకారం ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను” అని కూర్చున్నారు.
స్వప్న ముందుకు వచ్చి మైకు అందుకుని “ఈ ఊరిలో గర్భవతులకు, బాలింతలకు, పసిపిల్లలకు సరైనసదుపాయాలు లేవని తెలిసింది. నేను , నాకు తెలిసిన మిత్రులం కలిసి ఈ విషయంలో అతి త్వరలో ఒక బృహత్తరమైన ఆలోచన చేస్తున్నాము. గ్రామంలోని మహిళలకు సరైన వైద్య సదుపాయం అందేలా మావంతు కృషి మేము చేస్తాము. దీనికి ఇక్కడి యువత మాకు అండదండగా ఉన్నారు.”
ఈ మాటలు విన్న రామాపురం యువత మేమున్నాం అంటూ గట్టిగా అరిచారు.
“చూసారా! నిన్నటి మనకంటే నేటి తరం ఎంత స్వచ్ఛమైనదో.. “అంటూ సంతోషంగా భర్త చేతులు పట్టుకుంది విజయ. అవునంటూ చెమర్చిన కళ్లను తుడుచుకున్నాడు నరహరి..

******

మాలిక పత్రిక మే 2019 సంచికకు స్వాగతం

 

Jyothivalaboju

Chief Editor and Content Head

ప్రియ పాఠకులు, మిత్రులు, రచయితలకు వేసవి శుభాకాంక్షలు. మండుతున్న రోజులకు కూడా శుభాకాంక్షలు చెప్పాలా అంటారా? ఏం చేస్తాం. ఈ రోజుల్లో ఏదో ఒక దినం వస్తోంది,  ఏదో ఒక పండగ వస్తోంది. శుభాకాంక్షలు చెప్పడం అలవాటైపోయింది.  ఆగండాగండి.. కోపం తెచ్చుకోవద్దు. వేసవి మండే ఎండలే కాదు.. సువాసనలు వెదజల్లే మల్లెపూలు, ముంజెలు, రకరకాల ఆవకాయలకోసం మరెన్నో రకాల మామిడికాయలు, తర్వాత వచ్చే తియ్యని మామిడిపళ్లు… పిల్లల పరీక్షలయ్యాక కాస్త రిలాక్స్ అనుకునే రోజులు పోయాయి. ఇంట్లో అల్లరి చేయకుండా ఉంటారని వాళ్లకు ఏదో ఒక కోర్సులో చేర్పించడం. ఇలా కొత్తరకం బిజీ అయిపోతారు అమ్మలు, నాన్నలు.. అదన్నమాట సంగతి..

మాలిక కోసం మీ రచనలను maalikapatrika@gmail.com కి పంపించండి.

ఇక ఈ మాసపు విశేషాలు చూద్దాం..

1. ఇండియా ట్రిప్
2. చీకటి మూసిన ఏకాంతం 1
3. గిలకమ్మ కతలు 11
4.  కంభంపాటి కథలు – పని మనిషి
5.  కౌండిన్య హాస్యకథలు – శఠగోపురం
6.  అరుంధతి… అటుకుల చంద్రహారం.
7. ఎడం
8.  మానవత్వమే మనిషితనానికి దిక్సూచి అని చెప్పిన కథలు – మాయ జలతారు
9.  అమ్మమ్మ -2
10.  హృదయ బాంధవ్యం
11.  కాంతం వర్సెస్ కనకం
12.  సుఖాంతం!
13.  తపస్సు – లేలేత స్వప్నం
14.  కార్టూన్స్.. జెఎన్నెమ్
15.  అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 37
16.  శ్రీ జిడ్డు కృష్ణమూర్తిగారి కొన్ని ఆలోచనలు
17.  తేనెలొలుకు తెలుగు. .
18. నాకు నచ్చిన కధ -కేతు విశ్వనాధ రెడ్డిగారి కథ- రెక్కలు
19.  నా శివుడు
20.  గజల్
21.  నిజాలు
22.  అనిపించింది

23.మనసును విను

మాలిక పత్రిక ఏప్రిల్ 2019 సంచికకు స్వాగతం

 

 

Jyothivalaboju

Chief Editor and Content Head

మా పాఠకులు, రచయితలు, మిత్రులందరికీ వికార నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు..

షడ్రుచుల సమ్మేళనం – తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని  అందించే యుగాది సందేశంతో మరో కొత్త సంవత్సరంలోకి అడుగిడదాం. ఈ సంవత్సరంలో మీకందరికీ శుభాలు కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

ప్రతీ నెల మీరు చదువుతున్న కథలు, కవితలు, వ్యాసాలతొ పాటుగా ఈ మాసం ఒక ప్రత్యేకమైన విందును అందిస్తున్నాము. సాహిత్యం, సాంకేతికను జోడించి ఎన్ని అద్భుతాలనైనా సృష్టించవచ్చు. అలాటి కొన్ని ప్రయోగాలను మాలిక పత్రిక ప్రయత్నించి దిగ్విజయంగా పూర్తి చేసింది. అదే విధంగా గొలుసుకథలాంటి మరో ప్రయోగం. నవరసాలను కథలరూపంలో అందించాలని కొందరు మహిళా రచయిత్రులతో  సంప్రదించి, ఆచరణలో పెట్టగా అందమైన కథలు వెలుగులోకి వచ్చాయి. అందరినీ అలరించాయి. ఆ తొమ్మిదిమంది రచయిత్రులు రాసిన నవరసాల సమ్మిళితమైన నవ కథలను మాలిక పత్రిక మీ అందరికోసం అందిస్తోంది. ఈ కథలన్నీ నవరసాలు..నవకథలు అన్న టాగ్ లో భద్రంగా ఉంటాయి. ఎప్పుడైనా ఆ లంకెలో చదువుకోవచ్చు. ఇక ఈ మాసపు విశేషాలు మీకోసం..

 1. నవరసాలు..నవకథలు.. అద్భుతం
2. నవరసాలు..నవకథలు.. భీభత్సం
 3. నవరసాలు..నవకథలు.. రౌద్రం
4. నవరసాలు..నవకథలు.. శాంతం
 5. నవరసాలు..నవకథలు.. హాస్యం
 6. నవరసాలు..నవకథలు.. వీర
 7. నవరసాలు..నవకథలు.. కరుణ
 8. నవరసాలు..నవకథలు.. భయానకం
 9. నవరసాలు..నవకథలు.. శృంగారం
10. ఇల్లాలు
11. అమలిన శృంగారం
12. ఆసరా
13. చెక్కిన చిత్ర శిల్పం
14. హాలోవిన్
15. వేకువలో.. చీకటిలో
16. అమ్మమ్మ 1
17. Some బంధం
18. కాసాబ్లాంకా
19. కార్టూన్స్. జెఎన్నెమ్
20. మధ్యమహేశ్వర్
21. తేనెలొలుకు తెలుగు
22. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి
23. మహాకవి శ్రీశ్రీ గురించి కొందరు ప్రముఖులు
24. కాముని పున్నమి
25. భూమి ద్వారం మూసుకుపోతుంది
26. యోగాసనం 2
27. అంబ – శిఖండి వృత్తాంతం
28. విశ్వనాథవారి భ్రమరవాసిని
29. కవితా నీరాజనమైన నివేదన
30. మార్మిక శూన్యం
31. దేనికి..?
32. ఆడంబరపు కోరికలు
33. బొటన వేళ్లు

నవరసాలు..నవకథలు.. వీర 4

రచన: జ్యోతి వలబోజు

ధైర్యం.

రాత్రి తొమ్మిదిన్నర అవుతోంది. భాస్కర్ తన దుకాణం మూసేసి ఇంటికి వచ్చాడు.
ఇంట్లోకి రాగానే కూతుళ్లిద్దరూ మొహాలు మాడ్చుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటూ కనపడ్డారు.
అమ్మానాన్నలు అప్పుటికే నిద్రపోయినట్టున్నారు. వాళ్ల రూమ్ తలుపు దగ్గరగా వేసుంది.
చెప్పులు విప్పి తన రూమ్ లోకి వెళ్తున్న భాస్కర్ ని చూసి “నాన్నా!” అరిచినట్టుగా పిలిచారు పిల్లలిద్దరూ.
“ఏంట్రా బంగారం? తినండి. నేను స్నానం చేసి వస్తాను.” అన్నాడు ప్రేమగా.
“అదంతా మాకు తెలీదు. ముందిలా రండి.” అని గట్టిగా అరిచారు.
ఇదేదో చాలా సీరియస్ వ్యవహారంగా ఉందని వెళ్లి వాళ్లకెదురు కుర్చీలో కూర్చున్నాడు భాస్కర్.
“నాన్నా!.. అమ్మ చూసావా.. నాలుగు రోజులనుండి అమ్మ టమాట తప్ప వేరే వండడం లేదు. టమాటా పప్పు, టమాటా చారు, టమాటా చట్నీ.. వేరే కూరగాయలు చేయమంటే లేవంటుంది. ఆమ్లెట్ వేయమంటే ఎగ్స్ లేవంటోంది. నాన్నగారు తెచ్చాక అన్నీ వండిపెడతా అంటోంది” అని కోపంగా , ఉక్రోషంతో చెప్పారు.
“అవునా అమ్మలూ.. శ్యామలా ఇలా రా. ఏం జరిగింది? పిల్లలు అడిగినవి ఎందుకు చేయడం లేదు. కూరగాయలు తెచ్చిపెట్టా కదా!” కాస్త గట్టిగానే అడిగాడు వంటింట్లోనుండి వచ్చిన భార్యని.
“చాలా ఖరీదున్నాయని మీరే కదా రెండు రకాల కూరగాయలు, చవగ్గా ఉన్నాయని రెండు కిలోల టమాటాలు తెచ్చారు. గుడ్లు కూడా అయిపోయాయి. రెండు రోజులనుండి మీతో చెప్తూనే ఉన్నాను. మీరేమో లేటుగా వస్తున్నారు. ఎవరు తెస్తారు మరి. నేనేం చేయను?”
“ఏం చేయను అంటే అన్నీ నేనే తేవాలా? ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు. బయటకు వెళ్లి కావలసినవి తెచ్చుకోవచ్చుగా. ఆమాత్రం తెలివితేటలు లేవా? ఎప్పుడు చూసినా ఇంట్లోనే పడుంటావు. అన్నీ తెచ్చి పెడితే వంట చేస్తానంటావు. ఒక్కటీ సొంతంగా చేయలేవు. తెలీదు. భయం అంటావు. ఎలా చచ్చేది నీతో? తల పట్టుకున్నాడు భాస్కర్.
శ్యామలకి ఏం చెప్పాలో తెలీక భయంగా, మౌనంగా నిలబడింది.
ఇందులో తన తప్పేమీ లేదు. ఒక్కతే కూతురని, ఆడపిల్ల అని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు తల్లిదండ్రులు. ఆడపిల్లలు బయటకు వెళ్లరాదు. సేఫ్ కాదు అని అడగకుండానే అన్నీ అమర్చేవాడు తండ్రి. బయట పని ఏదున్నా కొడుకులను పంపించేవాడు. అలా ఇంటిని దాటి బయటకు వెళ్లడం అలవాటు లేదు. ఏదైనా కావాలంటే తల్లిని వెంట తీసుకుని వెళ్లడమే.
పెళ్లయ్యాక కూడా తను మారలేదు. భర్త కూడా ఆమెని అలాగే వుండనిచ్చాడు. ఇంట్లోకి కావలసిన సామాన్లు, బట్టలు కూడా తనే తీసుకొచ్చేవాడు. లేదా అందరూ కలిసి వెళ్లి షాపింగ్ చేసేవాళ్లు. ఎప్పుడూ ఒంటరిగా బయటకు వెళ్లలేదు. అలా వెళ్లాలంటే కూడా భయం ఆమెకు.
ఆడపిల్లలు కాస్త పెద్దయ్యారు కాబట్టి తమకు కావలసినవి తెచ్చుకునేవారు కాని ఇంటికి సంబంధించిన పనులు మాత్రం భాస్కరే చేయాల్సి వచ్చేది. తండ్రి కూడా పెద్దవాడయ్యాడు కాబట్టి ఆయనను బయటకు పంపలేడు.
అప్పుడప్పుడు ఇలా అవస్ధలు పడ్డా కూడా శ్యామల తన భయాన్ని పిరికితనాన్ని వీడలేదు. తనకు ఇంటిపని, వంటపని , పిల్లలు, భర్త , అత్తమామలకు కావలసినవి చేసిపెట్టడం మాత్రం వస్తే చాలనుకునేది. ఇంటర్ వరకు చదివినా కూడా వంటరిగా ఇంటిగడప దాటలేదు. ఇంటి పనయ్యాక ఇంట్లోవాళ్లు తినడానికి ఏదైనా చేసిపెట్టడం, ఇళ్లు శుభ్రంగా ఉంచుకోవడం మొదలైన పనులతో ఎప్పుడూ ఖాళీగా ఉండేది కాదు.

******

ఆ రోజు ఆదివారం. సాయంత్రం ఏడు గంటలైంది.
భాస్కర్ హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ టీవీ చూస్తున్నాడు.
పిల్లలు తమ గదిలో చదువుకుంటున్నారు. వాళ్లకు పరీక్షలు జరుగుతున్నాయి.
తల్లిదండ్రులిద్దరూ తమ గదిలోనే ఉన్నారు.
శ్యామల రాత్రి భోజనాలకోసం వంటింట్లో బిజీగా ఉంది. అరగంటలో వంట పూర్తవుతుంది.
డోర్ బెల్ వినపడింది. భాస్కర్ వెళ్లి తలుపు తీసాడు.
వంటపనిలో నిమగ్నమై ఉన్న శ్యామల ఏదో గొడవలా వినిపించి హాల్లోకి తొంగి చూసింది.
హల్లో టీవీ నడుస్తోంది. భర్త కనపడలేదు. మరి ఈ గొడవ, ఈ శబ్దం ఎక్కడినుండి వచ్చిందని వంటింటి తలుపు దాటి వచ్చింది.
అక్కడినుండి హాలు ముందుగదిలోకి చూడగానే శ్యామల గుండె ఝల్లుమంది.
ముందుగదిలో ఇధ్దరు దొంగలు భర్తను బెదిరిస్తున్నారు. ఒకడు చేతిలో కత్తి చూపిస్తూ ఏధో అంటున్నాడు. టీవీలో వస్తోన్న సినిమా శబ్దంలో సరిగ్గా వినపడలేదు.
శ్యామల వెంటనే తేరుకుంది. మెల్లిగా శబ్దం రాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ అత్తామామల రూమ్, పిల్లల రూమ్ లకు బయటనుండి గొళ్లెం పెట్టింది.
తర్వాత వంటింట్లోకి వెళ్లి అటు ఇటూ చూసింది. ఏం చేయాలో ఆలోచించసాగింది.
తన కుటుంబాన్ని కాపాడుకోవాలి అన్న ఆలోచన తప్ప ఆ సమయంలో ఆమెలో భయం తాలూకు ఛాయలు అస్సలు కనపడలేదు.
ముందుగా గాస్ ఆఫ్ చేసింది. చీర చెంగును నడుముకు దోపింది. పక్కనే ఉన్న కారం పొడి డబ్బా నుండి రెండు పిడికిళ్లలో కారం పొడి తీసుకుని వెనకాల పెట్టుకుని “ఏవండి! ఏం చేస్తున్నారు. వంట పూర్తయింది. భోజనానికి రండి”అంటూ హాల్లోనుండి ముందు రూమ్ లోకి రాబోయింది.
అప్పుడే ఆ దొంగలిద్దరు భాస్కర్ ను తోసేసి హాల్లోకి వచ్చారు. ఇద్దరి చేతుల్లోనూ కత్తులున్నాయి. నల్ల తుమ్మ మొద్దుల్లా చూస్తేనే భయపడేలా ఉన్నారు.
భాస్కర్ భయపడ్డాడు, ఏం చేయాలో కూడా ఆలోచించే పరిస్థితిలో లేడు. కాని శ్యామల తన భయాన్ని మొహంలో కనపడనీయలేదు.
ఆ దొంగలిద్దరూ హాల్లోకి రాగానే కారంపొడి వాళ్ల కళ్లల్లో పడేలా చల్లింది. భాస్కర్ ముందుగదిలోనే పడిపోయాడు కాబట్టి అతనికి ఏం కాలేదు.
ఆ వెంటనే శ్యామల హాల్లో సోఫా పక్కన ఉన్న మామగారి చేతికర్ర తీసుకుని వాళ్లను చంపేయాలన్నంత కోపంగా, గట్టిగా అరుస్తూ చాలా ఆవేశంగా బాదసాగింది.
ఒకవైపు కళ్లల్లో మంటలు. ఒకవైపు దెబ్బలతో దొంగల ఒళ్లు హూనమవ్వసాగింది.
ఇంట్లోకి కావలసిన వస్తువులకోసం ఎంత అవసరమైనా కూడా బయటకు వెళ్లని పిరికిదైన భార్య ఇంత వీరావేశంతో ఆ దొంగలను అరుస్తూ, కొడుతూ ఉంటే కొద్దిసేపు బిత్తరపోయి చూసాడు భాస్కర్.
వెంటనే తేరుకుని కింద పడిపోయిన దొంగల కత్తులను తీసి పక్కన పెట్టి తాడు తెచ్చి శ్యామల గట్టిగా కొట్టిన దెబ్బలకు తల్లడిల్లిపోతున్న దొంగలను కట్టేసాడు.
ఇంకా ఆవేశంగా కొడుతున్న భార్యని “ఇక చాలు. శాంతించు శ్యామల” అంటూ ఒడిసి పట్టుకున్నాడు.
శ్యామల అరుపులు, దొంగల కేకలు విన్న భాస్కర్ తల్లిదండ్రులు, పిల్లలు కంగారుగా తలుపులు బాదసాగారు. కాని అవి బయటనుండి గొళ్లెం పెట్టి ఉన్నాయి.
అది విన్న భాస్కర్ వెళ్లి తలుపు తెరిచాడు.
చూస్తుండమని చెప్పి బయటకు వెళ్లి కాలనీ వాచ్ మెన్ ను, ఇరుగు పొరుగు వారిని పిల్చుకొచ్చాడు.
కళ్లనిండా కారం పడ్డ దొంగలు మంటలు భరించలేక విలవిలలాడారు. దానితోపాటు శ్యామల ఆవేశంగా, గట్టిగా కొట్టిన దెబ్బల మంటలు వేరే.
ఇల్లంతా కారం. చేతిలో కర్రతో ఆవేశంగా రొప్పుతున్న శ్యామలను చూసి పిల్లలు, అత్తామామలు హతాశులయ్యారు.
నిజంగా తమ తల్లేనా అని నమ్మలేకుండా ఉన్నారు పిల్లలు. దొంగలను పోలీసులు పట్టుకెళ్లారు. తర్వాత తెలిసిందేంటంటే వాళ్లు పాత దొంగలు, హంతకులు కూడా అని. వాళ్లని పట్టిస్తే బహుమతి ఇస్తామని ప్రకటించారంట. అది శ్యామలకే అందిస్తామని పోలీసులు చెప్పి వెళ్లారు.
ఆ తర్వాత భాస్కర్ ఇంటిపనులు, బయటపనులు కూడా శ్యామలే ఒంటరిగా చేసుకునేలా వెంట తిప్పి, చూపించి అన్నీ నేర్పించాడు.

ఆడది ఎంత పిరికిదైనా, భయం ఉన్నా, ఏమీ తెలీకున్నా తన కుటుంబానికి, పిల్లలకు ఆపద వస్తే మాత్రం అమ్మోరు తల్లే అవుతుంది.

మాలిక పత్రిక అక్టోబర్ సంచికకు స్వాగతం

 

Jyothivalaboju

Chief Editor and Content Head

ప్రియమైన పాఠకులకు, రచయితలకు, మిత్రులందరికీ ముందుగా దసరా పండగ శుభాకాంక్షలు. రాబోయే పండగలు మీకందరికీ శుభాలు కలుగజేయాలని మనసారా కోరుకుంటూ ఈ మాసపు మాలిక పత్రికను మీకు నచ్చిన, మీరు మెచ్చిన శీర్షికలు, కథలు, కవితలు, కార్టూన్స్, సీరియల్స్ మరియు వ్యాసాలతో  తీర్చిదిద్దడం జరిగింది.

మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

మరి ఈ మాసపు విశేషాలను తెలుసుకుందాం.

1.గిలకమ్మ కథలు – పెత్తాట్టెంక, సింతాట్టెంక
2.  బ్రహ్మలిఖితం 21
3. రెండో జీవితం 10
4. విశ్వపుత్రిక వీక్షణం – “రహస్య స్నేహితులు”
5.చేసిన పుణ్యం
6.కౌండిన్య హాస్యకథలు – చెరగని మచ్చ
7.కలం స్నేహం.
8.గతం గతః
9. తొలివలపు
10.నూటికొక్కరు
11.శ్రమజీవన సౌందర్యం
12.తేనెలొలుకు తెలుగు – 5
13. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 30
14.ఐఐటి(లెక్కల) రామయ్యగారు
15.తపస్సు – మొదటి సమిధ
16. అంతర్యుద్ధం
17. ఎల్. జి. బి. టి.
18. కార్టూన్స్ .. టి.ఆర్.బాబు
19. కార్టూన్స్ . జె.నరసింహమూర్తి

మాలిక పత్రిక ఆగస్టు 2018 సంచికకు స్వాగతం

 

Jyothivalaboju

Chief Editor and Content Head

పాఠక మిత్రులకు, రచయితలకు, రచయిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభకాంక్షలు..   పేదా, గొప్ప, చిన్నా పెద్దా, జూనియర్, సీనియర్ అన్న బేధాలు లేకుండా అందరికీ కలిపేది అక్షరమే. ఈ అక్షరాల సాక్షిగా మనమందరం తరచూ కలుస్తున్నాము. మన భావాలు, ఆలోచనలు, ఆవేదనలు, సంఘర్షణలను పంచుకుంటున్నాము. చర్చిస్తున్నాము. ఇది ఒక ఆరోగ్యకరమైన భావము, భావన కూడా.

మాలిక పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మనఃపూర్వక ధన్యవాదములు.  వచ్చే నెలలో ఇద్దరు ప్రముఖులు భువనచంద్రగారి మాయానగరం, మంథా భానుమతిగారి  కలియుగ వామనుడు సీరియళ్లు ముగియబోతున్నాయి. కొంతకాలంగా ఈ సీరియళ్ల చదవడమే కాక అందులోని పాత్రలతో పరిచయాలు  ఏర్పడ్డాయి. కాని ఏ కథైనా ముగింపుకు రాక తప్పదు. ఈ రెండు సీరియళ్లను క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నవారికి నిరాశే..

మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

ఈ సంచికలోని  రచనలు:

1. మాయానగరం . 49
2. తపస్సు – తపోముద్రల వెనుక
3. గిలకమ్మ కథలు – 4 ..కణిక్కి.. సింతకాయ
4. బ్రహ్మలిఖితం – 20
5. రెండో జీవితం – 6
6. కంభంపాటి కథలు – జానకి ఫోన్ తీసింది
7. కలియుగ వామనుడు –  8
8. ఆచరణ కావాలి
9. ఎన్నెన్నో జన్మల బంధం
10. కౌండిన్య హాస్యకథలు – కథ కంచికి, ప్రేక్షకులు ఇంటికి
11. మార్నింగ్ వాక్
12. నాకు నచ్చిన కథ
13. తేనెలొలుకు తెలుగు – 4
14. ఒద్దిరాజు అపూర్వ సోదరులు
15. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 29
16. కార్టూన్స్… జె.ఎన్నెమ్
17. కార్టూన్స్ – టి.ఆర్.బాబు
18. విశ్వపుత్రిక వీక్షణం –  ప్రేమరేఖలు
19. బాల్యం – ఓ అద్భుత లోకం
20. జీవితపుటంచులు

మాలిక పత్రిక సెప్టెంబర్ 2017 సంచికకు స్వాగతం

Jyothivalaboju

Chief Editor and Content Head

 

పండగ రోజులు మొదలయ్యాయి కదా. వినాయకుడు నవరాత్రులు కొలువుదీరి తిరిగి వెళ్లిపోతున్నాడు. తర్వాత బతుకమ్మ పండగ, దసరా, దీపావళి వరుసగా రాబోతున్నాయి.  మాలిక పత్రిక పాఠకులకు, రచయితలకు పండగల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మాసపు విశేషాలను అందిస్తున్నాము. ఎప్పటిలాగే మీరు నచ్చే, మీరు మెచ్చే కవితలు, వ్యాసాలు, కథలు, సీరియళ్లు, ఉన్నాయి. ఈ నెలనుండి శ్రీమతి అంగులూరి అంజనీదేవిగారి మూడవ సీరియల్ “కొత్త జీవితం” ప్రారంభమవుతోంది. మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాము.

మీ రచనలు పంపవలసిన చిరునామా: jyothivalaboju@gmail.com

సెప్టెంబర్ సంచిక విశేషాలు:

0. ఎందరో మహానుభావులు 1- రావు బాలసరస్వతి
1. రెండో జీవితం – 1
2. మాయానగరం – 39
3. బ్రహ్మలిఖితం – 11
4. ఎగిసే కెరటాలు – 14
5. మనుగడ కోసం
6. కథ చెప్పిన కథ
7. కృషితో నాస్తి దుర్భిక్షం
8. ఫ్యామిలీ ఫోటో
9. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి -19
10. అంతర్వాణి – సమీక్ష
11. కాఫీ విత్ కామేశ్వరి – సమీక్ష
12. కొత్త కధలు – సమీక్ష
13. చిరు చిరు మొగ్గల
14. వికటకవి 2
15. యక్ష ప్రశ్నలు
16. అతను – ఇతను
17. జైన మతము
18. బాషను ప్రేమించరా

మాలిక పత్రిక ఆగస్ట్ 2017 సంచికకు స్వాగతం

Jyothivalaboju

Chief Editor and Content Head

పాఠక మహాశయులకు, రచయిత మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవం, రక్షాబంధన పండగ శుభాకాంక్షలు..  ఈ జీవితం చాలా చిన్నది. ఆ కొద్ది సమయంలో ఎందుకీ కలతలు, కలహాలు, అపార్ధాలు, గొడవలు. ఒకరిమీద ఒకరికి స్నేహభావం ఉంటే ఎటువంటి అపార్ధాలకు తావుండదు. కలిసిమెలసి సంతోషంగా ఉందాం. హాయిగా నచ్చినది చదువుకుంటూ, ఇష్టమైన పనులు చేసుకుంటూ కాలం గడిపేద్దాం.

మాలిక పత్రికలో వస్తోన్న సీరియల్స్, కథలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, కొత్తగా మొదలుపెట్టిన వీడియో రచనలకు మంచి స్పందన లభిస్తోంది. మీకు ఏదేని కొత్తగా రాయాలని ఉందా? రాసి పంపండి.. ఆడియో, వీడియో రచనలు కూడా పంపవచ్చు. లేదా ఏదైనా ప్రయోగం చేద్దామంటారా? తప్పకుండా చేద్దాం. మీ ఆలోచనలు పంపండి..

మీ రచనలు పంపవలసిన చిరునామా: jyothivalaboju@gmail.com

ఈ మాసపు ప్రత్యేక అంశాలు:

1. సామాజిక స్ఫృహ నేపద్యము
2. మాయానగరం 38
3. బ్రహ్మలిఖితం 10
4. జీవితం ఇలా కూడా ఉంటుందా? 12
5. Gausips – ఎగిసే కెరటాలు 13
6. స్త్రీ ఎందుకు బానిసైంది
7. జీవన వారధులు
8. మా వదిన మంచితనం – నా మెతకతనం
9. రక్షా బంధనం
10. 21వ శతాబ్దంలో వికటకవి
11. అత్తాకోడళ్ల సంవాదం –  వామ్మో
12. నాకు నచ్చిన నా కథ
13. ఆకుదొక కథ
14. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి 18
15. ఇస్లాం మతం

బోనాలు

రచన: జ్యోతి వలబోజు
ఆడియో: డా.శ్రీసత్య గౌతమి

బోనాలు ఆడియో ఈ లంకెలో వినండి.. BONALU

భారతావనిలో పండగలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పండగ వెనుక ఓ ప్రాముఖ్యత ఉంటుంది. పండగలు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబిస్తాయి. వీటిని ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అటువంటి ఒక ముఖ్యమైన పంఢగ బోనాలు. తెలుగువారి ముఖ్యంగా తెలంగాణా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకునే పండగ బోనాల పండగ. బోనాల పండగ అనగానే కోలాహలం, ఉరకలెత్తే సంతోషం, కొత్తబట్టలు, పసుపు కుంకుమలు, వేపాకు తోరణాలు . ప్రతీ వీధిలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఎవరికి వారు ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు అందరూ కలిసి గుడికి వెళతారు. బోనాల పండగరోజు ఆలయాల దగ్గర వినిపించే తెలంగాణ జానపద పాటలుకూడా అమ్మను స్తుతిస్తూ ఉత్తేజపరిచేలా ఉంటాయి. ఆ పాటలకు తాళం వేస్తూ చిందులు వేయక తప్పదు. ఎటువంటి అరమరికలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండగ ఇది.

అమ్మ తన బిడ్డలందరినీ ఎంతో ప్రేమగా చూస్తుంది. అలాగే తప్పు చేస్తే మందలిస్తుంది. అయినా సరే వినకుంటే దండిస్తుంది. అప్పుడు ఆ బిడ్డ తన తప్పు తెలుసుకుని సరియైన మార్గంలో పయనిస్తాడు. అదే అమ్మకు పిల్లలకు ఉన్న అనుబంధం. అదే విధంగా ప్రకృతిమాత లేదా ఆ అమ్మలగన్నయమ్మకు కోపం వస్తే కూడా మనని దండిస్తుంది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది. ఎన్నో అనర్ధాలు జరుగుతాయి. అంటురోగాలు ప్రబలుతాయి. 1869 సంవత్సరంలో హైదరాబాదు, సికిందరాబాదు జంటనగరాలలో ఇలాగే మలేరియా వ్యాధి ప్రబలి తీవ్ర జననష్టం జరిగింది. అమ్మకు కోపం వచ్చిందని భావించిన ప్రజలు ఆమెను ప్రసన్నపరచడానికి ఉత్సవాలు , జాతర జరిపించాలని నిర్ణయించారు. అదే బోనాలు. ఈ పండగను ఆషాడ మాసంలో జరుపుకుంటారు. హైదరాబాదు, సికిందరాబాదులోనే కాక మరికొన్ని తెలంగాణా ప్రాంతాలలో ఈ పండగ చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగ ముఖ్య ఉద్ధేశ్యం కలరా, ప్లేగు, మశూచి వంటి అంటు వ్యాధులు ప్రబలకుండా, ప్రకృతి బీభత్సాలు జరగకుండా, పాడిపంటలను, తప పిల్లలను చల్లగా చూడమని ఆమెకు బోనం సమర్పిస్తారు. ఉగాది తర్వాత చాలా రొజులకు వచ్చే మొదటిపండగ ఇదే.

బోనం అంటే భోజనం. శుచిగా అన్నం వండుకుని దానిని ఘటంలో అంటే మట్టికుంఢ లేదా ఇత్తడి గుండిగలో వుంచి దానికి పసుపు, కుంకుమలతో అలంకరించి, వేపాకు తోరణాలు కడతారు. అన్నంలో పసుపు లేదా పాలు చక్కెర కలిపి నైవేద్యం తయారు చేస్తారు. ఆ పాత్ర పైన ఒక ప్రమిదలో దీపం పెట్టి ఇంటి ఇల్లాలు లేదా ఆడపడుచు పట్టుబట్టలు కట్టుకుని, పూలు,నగలు అలంకరించుకుని సంతోషంగా ఆ బోనాన్ని తమ తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలు, డప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. ఈ ఊరేగింపులో సంప్రదాయిక నృత్యాలు చేస్తారు. ప్రతీ సమూహం వెదురుబద్దలు, రంగు కాగితాలతో తయారుచెసిన తొట్టేలను(ఊయల) కూడా అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మకు బోనాలు, తొట్టెల సమర్పించి కల్లుతో సాక పెడితే అమ్మ శాంతించి తమను, తమ పిల్లలను చల్లగా చూస్తుందని అందరి నమ్మకం. ఎందుకంటే అప్పుడే వానాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణ మార్పు వల్ల కూడా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఎలాగూ ఉంటుంది.

బోనాన్ని తలకెత్తుకున్న మహిళలు ఆ అమ్మయొక్క శక్తి , అంశ అని గౌరవిస్తూ ప్రజలు ఆ మహిళ కాళ్ల మీద నీళ్లు పోస్తారు. అలా చేస్తే అమ్మవారు శాంతిస్తుందని వాళ్ల నమ్మకం.

అదే కాక మరో నమ్మకం కూడా ఉంది. ఆషాడ మాసంలో అమ్మ తన పుట్టింటికి వస్తుంది. తమ కూతుళ్లు పుట్టింటికి వస్తే ప్రత్యేకంగా చూసుకున్నట్టే ప్రజలందరూ వెళ్లి ఆమెను దర్శించి ప్రేమగా భోజనం పెడతారు. తెలంగాణా ప్రజలు అమ్మవారిని తమ తల్లిగా, ఇంటి ఆడపడుచుగా భావించి పూజిస్తారు.

అమ్మవారి సోదరుడైన పోతరాజుది ఈ సంబరాలలో ముఖ్య పాత్ర. బలిష్టుడైన వ్యక్తి ఒళ్లంతా పసుపు రాసుకుని , వేపాకు మండలు కట్టుకుని , నుడుత కుంకుమ బొట్టుతో , కాలికి గజ్జెలతో కొరడా ఝలిపిస్తూ పూనకం వచ్చినట్టు ఆడుతూ ఉంటాడు. అమ్మవారికి సమర్పించే పలహారపు బళ్ళను అతనే ముందుండి నడిపిస్తాడు.

హైదరాబాదు, సికిందరాబాదులో ఈ పండగా వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు రోజులలో జరుగుతుంది. బోనాల పండగ ఆషాడ మాసంలోని ఆదివారం రోజే జరుపుకుంటారు. ఈ పండగ ఆషాడ మాసం మొదటి ఆదివారం రోజు గోల్కొండ కోటలోని జగదంబ ఆలయంలో మొదలవుతుంది. నిజాం నవాబుల కాలం నుండి ఈ ఆనవాయితి కొనసాగుతూ వస్తుంది. రెండో ఆదివారం సికిందరాబాదులోని ఉజ్జయినీ మహంకాళీ మందిరంలో జరుగుతుంది. అప్పుడు సికిందరబాదు వాసులందరూ ఈ పండగ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. మూడవ ఆదివారం హైదరాబాదులోని అన్ని ప్రాంతాలలో ఈ పండగ ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతీ వీధి కళకళ లాడిపోతుంది. చివరి ఆదివారం గన్ ఫౌండ్రిలో ఈ పండగ జరుపుకుంటారు. దీనితో బోనాల పండగకు తెర పడుతుంది. ఏ పండగైనా ప్రజలంతా ఒకేరోజు జరుపుకుంటారు. కాని బోనాల పండగను మాత్రం వారానికో ప్రాంతంలో నెలంతా కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు.

అమ్మవారిని ఎన్నో పేర్లతో కొలుస్తారు. మైసమ్మ, పోచమ్మ, యెల్లమ్మ, పెద్దమ్మ, డొక్కలమ్మ, అంకాలమ్మా, పోలేరమ్మ, మారెమ్మ, యెల్లమ్మ .. అమ్మే కదా యే పేరుతో పిలిచినా పలుకుతుంది , తమని ఆదుకుంటుంది అని ప్రజల ప్రగాఢ విశ్వాసం.. ఆదివారం బోనాలు సమర్పిస్తారు. ఇంతటితో పండగ ఐపోలేదు. మరునాడు ఉదయం రంగం అనే కార్యక్రమం ఉంటుంది. రంగం చెప్పడమంటే అమ్మవారు ఒక అవివాహిత శరీరాన్ని ఆవహించి ఆమె ద్వారా నగర ప్రజలకు రాబోయే ఏడాదిలో జరగబోయే మంచిచెడులను చెబుతుంది. రంగం చెప్పే మహిళ గర్భాలయం ముందు ఒక పచ్చికుండపై నిలబడి, పూనకంతో ఊగిపోతూ భవిష్యత్తు చెబుతుంది. అలాగే ప్రజలు అడిగే ప్రశ్నలకు కూడా జవాబిస్తుంది. వేలాదిమంది భక్తులు ఈ భవిష్యవాణి వినడానికి గుంపు కడతారు.

బోనాల సంబరాలలో చివరి అంకం ఘటం ఊరేగింపు. రంగం తర్వాత సాయంత్రం ప్రతీ ప్రాంతం నుండి వేర్వేరు ఘటాల ఊరేగింపు ప్రారంభమవుతుంది . హైదరాబాదులోని పాతబస్తీలో వీధులన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. అలంకరించిన వాహనాలపై అమ్మవారిని ఘటం రూపంలో ఉంచుతారు. ఊరేగింపుగా వెళ్తారు. ఒక్కటొక్కటిగా అన్ని ఘటాల ఊరేగింపులు కలిసిపోయి ఒక్కటిగా సాగుతాయి. ఈ ఊరేగింపులో వివిధ వేషధారణలు, పాటలు, నాట్యాలు, గుర్రాలు కూడా కోలాహలం సృష్టిస్తాయి. ఈ రెండు రోజులు ఎంతో సందడిగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ జానపద గీతాలు ప్రముఖమైనవి. విన్నవారందరిని చిందులేయించే పాటలు ఎన్నో . డప్పుల దరువుతో సాగిపోయే కోడిబాయె లచ్చమ్మదీ, చుట్టూ చుక్కల చూడు, అమ్మ బయలెల్లినాదే… ఆటపాటలతో సాగిపోయిని ఈ ఘటాలన్నింటిని నయాపుల్ లోని మూసీ నదిలో నిమజ్జనం చేయడంతో బోనాల పండగ సంబరం ముగుస్తుంది. ఇక సంవత్సరమంతా తమ పంటలను , పిల్లలను చల్లగా ఆ అమ్మ చల్లగా చూసుకుంటుంది అని నిశ్చింతగా ఇళ్లకు తిరిగి వెళతారు భక్తులు..