April 25, 2024

తపస్సు – ఆఖరి మెట్టు పైనుండి..

రచన: రామా చంద్రమౌళి   ఇక్కడనుండి చూడు.. ఈ ఆఖరి మెట్టు పైనుండి ముషాయిరా.. రాత్రిని కాల్చేస్తూ కాల్చేస్తూ ఎలుగెత్తిన స్వరాలను మోసుకుంటూ గాలిలో .. ఒక దుఃఖజీర ప్రక్కనే నిరంతరమై ప్రవహిస్తూ.. నది.. నిశ్శబ్దంగా – ఔనూ.. శరీరంలోని ప్రాణం శబ్దిస్తుందా పాదాలు ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు అందుకోవాలని అలలు పడే యాతన.. ఒక వియోగ జీవక్షోభ గజల్‌ గాయని  ఒక్కో వాక్యకణికను యజ్ఞంలోకి సమిధగా అర్పిస్తున్నపుడు అక్షరాలు.. అగ్నిబిందువులై తేలి వస్తూంటాయి గాలిలో సముద్ర […]

మార్మిక శూన్యం

రచన: రామా చంద్రమౌళి నిజానికి చాలాసార్లు మనకు  ఏమి కావాలో మనకు తెలియదు ఖాళీ గ్లాస్‌ వంటిది జీవితం అని ఒక ఉవాచ గ్లాస్‌ సగం నిండి ఉందా.. సగం ఖాళీగా ఉందా అని  ఒక చతురుడి  ప్రశ్న అసలు ఈ ‘ ఖాళీ ’ ఏమిటి  లోపల .. ఆత్మలో అని ఒక మీమాంస ఇక అన్వేషణ మొదలౌతుంది అప్పుడు ఏదో అభౌతిక ప్రతిద్రవ్యం ( anti matter ) దేహమంతా విసరిస్తూ మనిషి  ఒక […]

తపస్సు – హింస

రచన: రామా చంద్రమౌళి ఆ ముస్లిం మాతృమూర్తి గత ఏడేళ్ళుగా జైల్లో ఉంది యుద్ధఖైదీగా అప్పుడామె ఎడారులూ, కీకారణ్యాలో ఎక్కడో బయట ఉండవనీ అవన్నీ మనుషుల హృదయాల్లోనే రహస్యంగా ఉంటాయనీ గ్రహించింది ఏడేళ్ళుగా జైలు అధికారులను వేడుకుంటోందామె తన ఏడేళ్ళ ఒక్కగానొక్క కొడుకును ఒక్కసారి చూడాలని- ఆ రోజు అనుమతి లభించిందామెకు వర్షంలో తడుస్తున్న భూమిలా పుకించిపోతూ ‘ములాఖత్‌ ’ గదివైపు నడిచింది ఒంటినిండా నల్లని బురఖాతో.. విషాద దేవతవలె అప్పుడు గదమాయించాడు కాపలా సైనికుడు ‘దాన్ని […]

తపస్సు – లేలేత స్వప్నం

రచన: రామా చంద్రమౌళి ఆమె లీలావతి – పదవ తరగతి అప్పటిదాకా ‘ లీలావతి గణితం ’ చదువుతోంది.. అన్నీ లెక్కలు కాలం- దూరం, కాలం – పని, ఘాతంకముల న్యాయం చకచకా ఒక కాగితం తీసుకుని రాయడం మొదలెట్టింది పెన్సిల్‌తో బయట ఒకటే వర్షం.. చిక్కగా చీకటి 2 చెత్త.. తడి చెత్త.. పొడి చెత్త ఆకుపచ్చ.. నీలి ప్లాస్టిక్‌ టబ్స్‌ ‘‘ఐతే చెత్త ఎప్పుడూ పదార్థ రూపంలోనే ఉండదు చెత్త ఎక్కువ ‘మానవ‘ రూపంలో […]

తపస్సు

రచన: రామా చంద్రమౌళి   జ్ఞానానికి రూపం లేదు.. గాలి వలె ప్రవహించడం జీవ లక్షణమైనపుడు స్థితి స్థల సమయ కాలాదులు అప్రస్తుతాలు అగ్ని ఎప్పుడైనా, ఎక్కడైనా దహిస్తుంది కదా జ్ఞానమూ, కళా అంతే దహిస్తూ, వెలిగిస్తూ, దీప్తిస్తూ.. లీనమైపోతూంటుంది – అది సంగీతమో, సాహిత్యమో, యుద్ధ క్రీడో శిష్యుడు తాదాత్మ్యతతో భూమై విస్తరించాలి విస్తృతమై .. ఎదుట అప్పుడు ముఖం రెక్కలు విప్పిన ‘ ఆంటెనా ‘ ఔతుంది బీజాలు బీజాలుగా, సంకేతాలు సంకేతాలుగా .. […]

తపస్సు – ఆఖరి మెట్టు పైనుండి.

రచన: రామా చంద్రమౌళి ఇక్కడనుండి చూడు.. ఈ ఆఖరి మెట్టుపైనుండి ముషాయిరా.. రాత్రిని కాల్చేస్తూ కాల్చేస్తూ ఎలుగెత్తిన స్వరాలను మోసుకుంటూ గాలిలో .. ఒక దుఃఖజీర ప్రక్కనే నిరంతరమై ప్రవహిస్తూ.. నది.. నిశ్శబ్దంగా – ఔనూ.. శరీరంలోని ప్రాణం శబ్దిస్తుందా పాదాలు ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు అందుకోవాలని అలలు పడే యాతన.. ఒక వియోగ జీవక్షోభ గజల్‌ గాయని ఒక్కో వాక్యకణికను యజ్ఞంలోకి సమిధగా అర్పిస్తున్నపుడు అక్షరాలు.. అగ్నిబిందువులై తేలి వస్తూంటాయి గాలిలో సముద్ర జలాలపై లార్క్‌ […]

తపస్సు – సంతకం

రచన: రామా చంద్రమౌళి ఆవులిస్తూ మనిషి ఒళ్ళు విరుచుకుంటున్న ప్రతిసారీ సవరిస్తున్నప్పుడు సాగే ఫిడేల్‌ తీగ సారిస్తున్నప్పటి విల్లు అల్లె తాడూ జ్ఞాపకమొస్తాయి స్ట్రెచ్‌.. స్ట్రెచ్‌ హృదయమూ, ఆత్మా వ్యాకోచిస్తున్నపుడు సముద్రం అలలు అలలుగా విస్తృతమౌతున్నట్టు మనిషిలోని తరతరాల వారసత్వావశేషాలు మేల్కొనడం తెలుస్తూంటుంది మంచుతుఫానుల్లో మనిషి గడ్డకడ్తూండడం మండుటెండలో మనిషి కరిగిపోతూండడం ఒక సత్యాన్ని ప్రవచిస్తుంది సంకోచించగల మనిషో.. ఒక అక్షరమో ఎప్పుడో ఒకప్పుడు తప్పక వ్యాకోచిస్తాయని – కాళ్ళని నిక్కించి మునగదీసుకుంటున్న కుక్క తను నీ […]

తపస్సు – మొదటి సమిధ

రచన:- రామా చంద్రమౌళి ఔను .. ఈ శరీరం ఒక పుస్తకమే .. సంహిత బీళ్ళు, అరణ్యాలు , నదులు, పర్వతాలు .. అన్నీ ఈ దేహంలోనే .. సుప్త సముద్రాలు , జ్వలితాకాశాలు పుట వెనుక పుట తిప్పుతూ ఎన్ని యుగాలుగానో .. ఈ బూజుపట్టిన గ్రంథాల పురాపరిమళం హోమర్ లు, వ్యాసులు, కంఫ్యూషియస్ లు, సూఫీలు అన్నీ రక్తనదుల్లో కొట్టుకుపోతూ రాజ్యావశేషాలు ఏ చక్రవర్తి జాడించి సింహాసనంపైకి బొంగరాన్నో , ఖడ్గాన్నో విసిరినా అది […]

తపోముద్రల వెనుక

రచన: రామా చంద్రమౌళి తలుపులు మూసి ఉంటాయి కొన్నిసార్లు తలుపులు మూసివేయబడ్తాయి మూసినా, మూసివేయబడ్డా వెనుకా, లోపలా గోప్యంగా ఉన్నది ఏమిటన్నదే ప్రశ్న – ముందు ఒక ఛాతీ ఉంటుంది వెనుక ఒక గుండెనో, ఒక హృదయమో ఉంటుందని తెలుస్తుంది అరే .. ఒక నది తనను తాను విప్పుకుని అలలు అలలుగా ప్రవాహమై వికసిస్తున్నపుడు భరించగలవా నువ్వు జలసౌందర్య బీభత్సమధురాకృతిని ప్రశాంతత నీలిమేఘాల వెనుకనో తపోముద్రల వెనుక విలీనతలోనో అప్పుడే వికసిస్తున్న పువ్వు ముఖంలోనో ఉంటుందనుకోవడం […]