దీపావళి పద్యములు

రచన: జెజ్జాల కృష్ణ మోహనరావు దీపావళికి సంబంధించిన పదములతో ఉండే వృత్తములను ఏరి పండుగ సందర్భముగా శుభాకాంక్షలతో ఇక్కడ అందిస్తున్నాను. అన్య నామములను కుండలీకరణములలో చూపినాను. * గుర్తుతో నున్నవి నా కల్పనలు. ప్రతి ఛందమునకు రెండు ఉదాహరణములను ఇచ్చినాను. ఇందులో వాడబడిన ఛందములు 20, అవి – దీప్తా, లక్ష్మీ, అర్చిస్సు, భాస, దీపకమాలా, మౌక్తికమాలా, కాంతి, మణిమాలా, ప్రభా, బభ్రులక్ష్మీ, నిగ్గు, దీపక, భామ, భాతి, హరిణీ, కలాపదీపక, దీపికాశిఖ, దీపార్చి, జ్యోతి, దీప.