గడసరి అత్త – సొగసరి కోడలు

అత్తా కోడలూ…యెంత ఆకర్షణ యీ పదాల్లో !!.పుల్ల పుల్లగా.. తియ్య తియ్యగా ఊరించే మామిడి ముక్కల పైన కాస్తంత కారం అలా అంటించి, ఉప్పు కాస్త తగిలించి, పంటికింద వేసుకుని….నెమ్మది నమ్మదిగా నములుతూ ఉంటే….యెంత బాగుంటుందో మన తెలుగు నాలుకలకు వివరించి చెప్పవలసిన పని లేదు కదా !!! ఇదివరకటి తరంలోని గయ్యాళి తనం, ఇప్పటి సర్దుకుపోయే గుణం, తెలుగు చెరకు పాల రుచులూ, ఇంగ్లీషు మాటల తేనె చుక్కలు, చిరు కోపమూ, నవ్వుతూనే చురకంటించే గడసరి తనమూ… అంతలోనే సర్దుకుపోయే ఆప్యాయతా… ఇవన్నీ కలగలిస్తే..ఇదిగో ఇలా యీ తరం అత్తా కోడళ్ళ కబుర్లౌతాయట !!!

మీరూ చూడండదేమిటో…. (అత్తగారు శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని, కోడలు శ్రీమతి వంశీప్రియ ధర్మరాజు)