March 29, 2024

మాయానగరం – 38

రచన: భువనచంద్ర “ఇన్నేళ్ళుగా మీరిక్కడ వుంటున్నారు? నాకు తెలిసి, ఇది నీరు లేక మోడుగా మారిన దేవాలయం. దీన్ని ఇంత పచ్చగా చేసినవారెవరు? ” అడిగాడు రుషి. రుషికి ఇరవై తొమ్మిదేళ్ళు వుంటాయి. అందంగా, దబ్బపండుగా వుంటాడు. వొంటి మీద కాషాయ రంగు పైజామా లాల్చీ వున్నాయి. మెడలో రెండు మూడు పూసల దండలూ, ఓ రుద్రాక్షమాలా వున్నాయి. భుజాన వేలాడుతూ ఓ కాషాయ సంచీ. అతడంతట అతను వచ్చి అమరేశ్వర అవధానిగార్ని పరిచయం చేసుకున్నాడు. ” […]

మాయానగరం -37

రచన: భువనచంద్ర “జూహూ బీచ్ అద్భుతంగా వుంది ” అదిగో అదే సన్ & సాండ్ ” చూపిస్తూ అన్నది వందన. “విన్నాను, బోంబే లో ఒకప్పుడు ఇది చాలా ఫేమస్ ” ఇక్కడి స్మిమ్మింగ్ పూల్ చాలా సినిమాలలో చూపించారు. ‘బత్తమీస్ ” సినిమాలో మొదటిసారి బికినిలో సాధన షమ్మీ కపూర్ ని ఏడిపిస్తూ ” సూరత్ హసీ.. లగతా హై దివానా ” అంటూ పాట కూడా పాడుతుంది అని చెప్పాడు ఆనందరావు. వారి […]

మాయానగరం – 36

రచన: భువనచంద్ర బోంబే లో ట్రైనింగ్ అయ్యాక అక్కడే ‘జూహూ’ లో పోస్టింగ్ ఇచ్చారు ఆనందరావుకి… ఇది కాస్త ఊహించని విషయమే. జనరల్ గా ఎవరి స్వరాష్ట్రానికి వారిని పోస్ట్ చేస్తారు…. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి. ఆనందరావు విషయంలో చిన్న తేడా జరిగింది. తొలి పోస్టింగ్ గనక చెయ్యక తప్పదు. ఛాయిస్ అడగటానికిప్పుడు వీలుండదు. బొంబే లో అన్నీ దొరుకుతాయి …. ‘ఇళ్ళు ‘ తప్ప. వెయ్యి అడుగుల అపార్ట్మెంట్ సంపాదించుకొన్న బాలీవుడ్ నటవర్గమే ఆనందంతో పొంగిపోతారు. […]

మాయానగరం – 35

రచన: భువనచంద్ర “వాన్ని గమనించాను వెంకటస్వామి… నిస్సందేహంగా వాడు పరమశివమే! అయితే వాడు ఇటువైపు రాలేదు. వెనక వైపు నుండి వచ్చి మా పెరట్లోకి దూకాడు. యాక్ట్యువల్ గా ఇవాళ నాకు ఆఫ్. అయినా ఓ చిన్నవిషయం వల్ల ఆఫీస్ కు వస్తూ వాడ్ని చూశాను. వాడి కథంతా మహదేవన్ గారు నాకు చెప్పారు. వాడెంత క్రూరుడో కూడా చెప్పారు. నువ్వే ఎందుకో నాతో చెప్పడానికి సందేహించావు. వాడేదో క్రూరత్వమైన ఆలోచనలతోటే ఇక్కడికొచ్చాడు. బహుశా వాడొచ్చాడని మీకు […]