April 24, 2024

విశ్వపుత్రిక వీక్షణం – రెక్కలకొండ

రచన: డా.విజయలక్ష్మీ పండిట్ జయ డైనింగు హాల్లోకొచ్చి “విహన్‌ను పిలిచాను వస్తున్నాడు” అంటూ భర్త అనిల్‌ వైపు తిరిగి, ”విహన్‌ మన పెరటి తోటలో వేపచెట్టును చూస్తూ నిలబడి చేతులూపుతూ మాట్లాడుతున్నాడండి. ఎవరితో మాట్లాడుతున్నావు నాన్నా అంటే, అదిగో ఆ వేప చెట్టుతో మాట్లాడుతున్నాను. అది కొమ్మల చేతులతో పిలిచి నవ్వుతూ మాట్లాడుతుందమ్మా. దానికి పెద్ద కండ్లు, నోరు కూడా వున్నాయి చూడు అంటాడు. నాకు కనిపించడంలేదండి”అంటూ ఆందోళన పడింది జయ.అనిల్‌కు అంతా అర్థమయింది. తనకు వున్నట్టే […]

ఫ్రీ… ఫ్రీ….. ఫ్రీ..

రచన: గిరిజారాణి కలవల పొద్దున్నే అష్టావధానం.. శతావధానం అయిపోతోంది.. ఓ పక్క కుక్కర్.. ఓ… తెగ కూసేస్తోంది రా.. రమ్మని.. రా.. రా.. రమ్మని.. ఇంకో పక్క సాంబారు కుతకుతలాడిపోతోంది… పోపుకి టైమయిందంటూ.. మరో వేపు శ్రీవారు కారుతాళాలు కనపడక కారుకూతలతో.. తైతక్కలాడుతున్నారు.. . ఇంకో వైపు పనిమనిషి గిన్నెల మోతలు.. సుతుడి సుత్తి ఇంకో రకం.. పూజగదిలో అమ్మవారి అష్టోత్తరమే చదివాను.. నాది చదవలేదేమని అయ్యవారు అలిగి.. ఎక్కడ అష్టకష్టాలు పెడతారో అని.. అదో భయం […]

కార్తీక మాసపు వెన్నెల

రచన: నిష్కల శ్రీనాధ్ కార్తీక్ ఇంటి ముందు బండి ఆపి గేటు తీస్తుండగా రంగారావు ఇంటి బయటకు వస్తు కనిపించాడు వెంటనే నవ్వుతు బండి దిగాడు “ఏంటి మావయ్య ఎలా ఉన్నారు ? ఎప్పుడు వచ్చారు ఇంట్లో అందరు బాగున్నారా ” అంటూ పలకరించాడు, దానికి సమాధానంగా ” బాగున్నాను రా ! అందరు బాగానే ఉన్నారు అరగంట క్రితమే వచ్చాను అర్జంటు పని ఉంది నేను చెప్పాల్సిన విషయాలు అన్ని అమ్మకు చెప్పాను ఆదివారం ఏమి […]

కంచె చేనును మేసింది

రచన: డి.కృష్ణ “రాజు.. రాజు.. ఎక్కడున్నావురా.. వర్షం వచ్చేలా ఉంది.. నేను బయలుదేరుతున్నాను.. పిల్లల్ని వర్షంలో తడవనివ్వకు.. నేను వెళ్తున్నా… ఏయ్… అందరూ లోపలికి వెళ్ళండిక..” అంటూ ఎవరి పనులు వారికి అప్పగించెసి వార్డెన్ వెంకటేశ్వరమ్మ తన నాలుగు చక్రాల బండిని తీసుకెళ్ళింది. “అలాగే మేడమ్… ‘ఈమెకి ఫ్యామిలీ మీద ఉన్న దృష్టి హాస్టల్ మీదుండదు. అంతా నా మీద వదిలేసి వెళ్తాది. ఈమెకి హెల్పెర్ గా జాయిన్ చెసిన మా బావననాలి. చంపుకు తింటుంది’” అంటూ […]

చేతిలో చావు… ఆపేదెలా???

రచన: రాజారావు. టి దేవుడిదయ వల్ల అనుకున్నటుగానే పెళ్ళి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోయింది. రాత్రికి ఆ శుభకార్యం కూడా సవ్యంగా జరిగిపోవాలి, అని వధూ వరుల తల్లి తండ్రులు అనుకుంటున్నారు. రాత్రికి వధువు పాల గ్లాసుతో గదిలోకి అడుగుపెటింది. పెళ్లికూతురు ముఖం తామరాకు పై వర్షపు బిందువులా, అప్పుడేపెట్టిన కొత్త ఆవకాయలా కళకళ లాడి పోతుంది. వరుడు లేని ధైర్యాన్ని మొఖములో తెచ్చిపెట్టుకుని, మనది పెద్దలు కుదిర్చిన వివాహం అవడమువలన ఒకరి గురుంచి ఒకరికి పూర్తిగా […]

నరుడు నరుడౌట…

రచన -దాసరాజు రామారావు. కలలు దాటి కన్నీళ్లు దాటి వలలు దాటి వాగువంకలు దాటి గడప దాటి కడుపు దాటి భ్రమలు దాటి పరిభ్రమలు దాటి ఆశలు దాటి ఆశ్రయాలు దాటి పొక్కిళ్లు దాటి వెక్కిళ్లు దాటి చికిత్సలు దాటి విచికిత్సలు దాటి హింసలు దాటి అహింసలు  దాటి ప్రయాణాలు దాటి ప్రయాసలు దాటి వాయిదాలు దాటి ఫాయిదాలు దాటి అడ్డాలు దాటి గడ్డాలు దాటి హత్యలు దాటి ఆత్మహత్యలు దాటి ఆవృతాలు దాటి అనృతాలు  దాటి […]

కంభంపాటి కథలు 1 – ఆశ

రచన: రవీంద్ర కంభంపాటి.. “అమ్మా తలుపేసుకో “ అంటూ వెళ్ళిపోతున్న సుభాష్ తో “జాగ్రత్త గా వెళ్ళిరా “ అని చెప్పేలోపే ఏదో ఫోను మాట్లాడుకుంటా వెళ్ళిపోయేడు . అయినా నా చాదస్తం కాకపోతే నా మాట వినేదెవరు ఈ ఇంట్లో ? మళ్ళీ సాయంత్రం నాలుగింటిదాకా ఒక్కదాన్నీ ఉండాలి. అసలే ఊరవతల ఎక్కడో విసిరేసినట్టుండే ఈ విల్లాల్లో “ఎలా ఉన్నారండీ “ అని పలకరించే దిక్కుండదు . ఇంట్లో కొడుకూ , కోడలూ , మనవలూ […]

గిలకమ్మ కతలు – ఎదరంతా … ఎదురీతే !

రచన: కన్నెగంటి అనసూయ “ ఎన్నోత్తా? కుంచుడు నానబోత్తావా.. ..” సీతమ్మంది బియ్యవొంక అదే పనిగా సూత్తా.. అలా సూత్తా సూత్తానే బత్తాలోంచి గుప్పెడు గింజల్దీసి కళ్లకాడికంటా తెచ్చుకుని కళ్ళింతంత సేసి మరీ సూత్తా “ఏటీ..ఇయ్యి పాత బియ్యవేనా? అలా కనిపిత్తాలేదు..” “ అయ్యా..నీతో నేనాపద్దాలాడతానేటే పిన్నే. ఆడితే నాకేగాని నీగ్గాదని నాకు దెల్దా? “ అన్నాకా నిముషమాగి.. “ ఇంకా నిరుటి బియ్యవే తింటన్నాం. అయ్యయిపోతేనేగాని పొణక్కి సిల్లెట్తం. పాత బియ్యవైతే పిండురువవ్వుద్దని , అరిసిలికి […]