April 20, 2024

కౌండిన్య హాస్యకథలు 1 – ఇదేం సరదా

రచన: రమేశ్ కలవల (కౌండిన్య) ఉద్యోగం రీత్యా గోపాలం ఆ ఊరికి ఈ మధ్యనే ఓ నెల క్రితం వచ్చాడు. పట్నంలో పనిచేసి వచ్చిన బ్యాంకు ఉద్యోగికి ఈ మోస్తరు పల్లెటూర్లో అంతా కొత్తగా అనిపిస్తున్నాయి. గోపాలానికి, అతని భార్య కామాక్షికి ఆఫీసువారు ఇచ్చిన పెద్ద పెంకుటింట్లో అలవాటు పడటానికి కొంత సమయం పట్టింది. ఆ ఇంట్లో పెరట్లోకి నడవగానే ఎదురుగుండా తులసికోట, ఒక ప్రక్క బావి, దాని ఆనుకోని ఎత్తైన కొబ్బరిచెట్లు కనపడటమే కాకుండా మరో […]

అమ్ము- ఆల్ఫా-ఇన్ఫినిటీ

రచన: శ్రీదేవి నా పేరు అలివేలు. ముద్దుగా అందరూ అమ్ము అని పిలుస్తారు. నేను చాలా తెలివయిన అమ్మాయిని అని మా పిచ్చి నాన్న నమ్మకం. ఆ అమాయకుడిని చూసి మా అమ్మ తల కొట్టుకోవటం రోజు పరిపాటే మా ఇంట్లో. ఇంతకీ అసలు నేను తెలివిగలదాన్నా ?కాదా? అన్న మీమాంసలోనే నాకు 16 యేళ్ళు వచ్చేశాయి. అన్నయ్య బోoడామ్ అని 24 గంటలు ఎక్కిరిస్తుంటే ఉక్రోషంతో మేడ మీద ఏరోబిక్స్ మొదలెట్టాను. మొదలెట్టిన పది నిమిషాలకే […]

విశ్వపుత్రిక వీక్షణం 1 – రమ్య ది రోబో

రచన:విజయలక్ష్మీ పండిట్ సూపర్ బజార్ నుండి ఇంటికి వచ్చిన లక్ష్మి వరండాలో చెప్పుల స్టాండు పై చెప్పులు వదిలి ఇంట్లోకి వెళ్లి తన హాండ్ బ్యాగ్ ఢైనింగ్ టేబుల్ పై పెట్టి బాత్రూం వైపు నడిచింది. డ్రైవర్ సామాన్ల బ్యాగ్ తెచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి వెళ్లాడు. ఫ్రెషప్ అయ్యక కాఫీ తాగాలని వంటింటి వైపు నడుస్తూ అంతలో భర్త రామ్ కు కాఫీ టి ఏదయినా కావాలేమో అడగాలని ఆఫీస్ రూమ్ వై పు […]

బ్రహ్మలిఖితం – 17

అతన్ని చూడగానే ఎక్కడలేని ధైర్యమొచ్చింది లిఖితకి. “పాము.. పాము” అంది లేచి నిలబడి అదురుతోన్న పెదవులతో. “అదేం చేస్తుంది. అంతకంటే భయంకరమైన జంతువులున్నాయీ అడవిలో”అన్నాడతను లిఖితను దగ్గరకు తీసుకుంటూ. అతను మళయాళంలో మాట్లాడిందేమిటో అర్ధం కాకపోయినా అతని స్పర్శలో ఉన్న నీచదృష్టిని గమనించి అతని చేతుల్ని దూరంగా తోసేయ్యబోయింది లిఖిత. “ఏంటంత భయపడుతున్నావు. మగపిల్లాడివేగా. మా పెరియార్లు నిన్ను మగపిల్లాడివనుకొని బలికి తీసుకొచ్చేడు. నేనప్పుడే గ్రహించేసేను. ఈ పూజలతో విసిగి పోయినప్పుడు సరసానికి పనికొస్తావని” అంటూ ఆమెని […]

మాయానగరం 45

రచన: భువనచంద్ర జీవించడం తెలీనివాడు జీవితాన్ని మధించలేడు. అన్నీ వున్నవాడు ఎదుటివాడి ఆకల్ని ఏనాడూ గమనించలేడు. జీవితం అంటేనే ఒక ఉగాది పచ్చడిలాంటిది. అక్కడ చేదు, పులుపు, తీపి, కారం, వగరూ, వుప్పూ లాంటి రుచులుంటే, ఇక్కడ సుఖం, కష్టం, విరహం, ప్రేమ, కన్నీరు, కపటం, మోసం, మాయలాంటి అనేక విధానాలు వుంటాయి.నిన్నటి దేవుడు ఇవ్వాళా దేవుడుగానే వుంటాడని గ్యారంటీ లేదు. అదే విధంగా నిన్నటి విలన్ ఇవ్వాళా విలన్ పాత్రనే పోషిస్తాడనే నమ్మకమూ లేదు. ఆకాశంలో […]

కలియుగ వామనుడు – 5

రచన: మంథా భానుమతి హలీమ్ నలుగురికి శిక్షణ ఇస్తుంటే, వాళ్లకి అసిస్టెంట్ల కింద అబ్బాస్ లాంటి వాళ్లు అరడజను మంది ఉంటారు. నజీర్ దగ్గర పని చేస్తూనే, హలీమ్ ఫామ్ కి వచ్చినప్పుడు ట్రయినీ ముధారీ లాగ కొంత డబ్బు సంపాదిస్తాడు అబ్బాస్. అందులో సగం నజీర్ నొక్కేసి, సగం అబ్బాస్ బాంక్ లో వేస్తాడు. ఒంటె నడుస్తుంటే ఎగరకుండా, గట్టిగా మూపురాన్నీ, మెడకి కట్టిన తాడునీ పట్టుకోమని, ఎలా పట్టుకోవాలో మిగిలిన పిల్లలకి చూపిస్తున్నాడు నజీర్. […]

ఎందుకీ మహిళా దినోత్సవాలు??

రచన: శ్రీమతి నిర్మల సిరివేలు అణకువ కలగిన ఇల్లాలుగా, ప్రేమను పంచే మాతృమూర్తిగా , స్నేహాన్ని పంచే ఆత్మీయ వ్యక్తిగా ఉన్న ఒక మహిళ మహిళా దినోత్సవాల సందర్భంగా మొదటిసారిగా తనలోని ఆలోచనలను, భావాలను ఎంత అందంగా వ్యక్తీకరించారో చూడండి. పెద్దలకు, ఇంకా పెద్దలకు, ఈ సభకు వచ్చినందుకు మీకందరికి మా ధన్యవాదాలు. స్త్రీ శక్తి స్వరూపిణి. అన్నింటా తెలివిగలది. చదువులో, వంటలో, తల్లిగా, భార్యగా, చెల్లిగా, ఇల్లాలిగా అందరి మన్ననలు అందుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నది. […]

ఒక ప్రాతః వేళ

రచన: రామా చంద్రమౌళి ఒక సీతాకోక చిలుక వచ్చి భుజంపై వాలినట్టనిపించి చటుక్కున మెలకువ వస్తుంది నిజానికి ప్రతిరాత్రీ నిద్రపోవడం ఎంత చిత్రమో మర్నాడు మనిషి మేల్కొనడం అంతకన్నా విచిత్రం జీవించీ జీవించీ అలసి రాతిశరీరాలతో తిరిగొచ్చిన తర్వాత ఏమి కనిపిస్తాయి .. అన్నీ ఖండిత స్వప్నాలు .. రక్త రేకులు తప్పితే ఎవరో తరుముతున్నట్టు ఎవరో ప్రశ్నిస్తున్నట్టు ఎవరో లోపల నిలబడి గునపంతో తవ్వుతున్నట్టనిపిస్తున్నపుడు కళ్ళుమూసుకుని మాంసవిగ్రహమై నిద్ర మోసుకొచ్చే రాత్రికోసం నిరీక్షణ తనకోసం తను […]

అప్పుడు – ఇప్పుడు

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు. అప్పుడు-ఇప్పుడు అమ్మ అప్పుడు అంతర్యామిగా అమ్మ, ఇప్పుడు అంత్యదశలో అమ్మ. అప్పుడు ఆదిశక్తిలా అమ్మ, ఇప్పుడు అత్యల్పప్రాణిలా అమ్మ. అప్పుడు దీనార్తపరాయణియై అమ్మ, ఇప్పుడు దీనాతిదీనంగా చూస్తూ ఆమ్మ. అప్పుడు అందరినీ ఘనంగా చూసిన అమ్మ, ఇప్పుడు అందరితో హీనంగా చూడబడుతున్నఅమ్మ. అప్పుడు కంటికిరెప్పలా మనని కాపాడిన అమ్మ, ఇప్పుడు కంటికి మింటికి ధాటిగా ఏడుస్తూ అమ్మ. అప్పుడు జడలో పువ్వులతో అమ్మ, ఇప్పుడు కంటిలో పువ్వులతో అమ్మ. అప్పుడు తన […]

మత్తు వదలరా

రచన: కొసరాజు కృష్ణప్రసాద్ పరుచుకున్న చీకటి, ప్రయాసతో గర్భిణి, పర్లాంగులో ఆసుపత్రి, మధ్యలో మద్యం షాపు! మత్తులో మందు బాబులు, వళ్లు తెలియని కామాంధులు, మఱ్ఱెల మధ్య మానభంగం, ఆక్రందనాల అమావాస! మద్యం షాపులో కాసుల గలగల, మానభంగమై బాధిత విలవిల, మద్యం డబ్బుతో నిండెను ఖజానా, బాధితకందెను పరిహార నజరానా! మారే ప్రభుత్వాలు, మారని ఆలోచనలు, ఖజానాపై దృష్టి జాస్తి, గోడుపై మాత్రం నాస్తి. మద్యంతో వచ్చిన డబ్బుతో ఆరోగ్య, సంక్షేమ పథకాలా?! ఇది కొనితెచ్చుకున్న […]