April 19, 2024

స్వాగతం

రచన: ములుగు లక్ష్మీ మైథిలి ప్రత్యూష కాంత నీలి వస్త్రం ధరించి మేలి పొద్దును స్వాగతిస్తోంది చైత్ర మాసపు గానరవళులతో తెలుగుతనపు మధురభావనలతో తొలిపండగ తెలుగువారి ముంగిట్లో శ్రీకారం చుట్టింది. ఏ చిత్రకారునికి అందని మనోహరదృశ్యం .. పచ్చ పచ్చని లేమావి చివురులు అరవిచ్చిన మల్లెల గుబాళింపులు ఆమని రాకతో ప్రకృతిశోభ ద్విగుణికృతమైంది మనుగడలో మకరందాన్ని నింపి షడ్రుచుల పరమార్ధం తెలిసేలా జీవితంలో వసంతమై రావమ్మా.. తెలుగు తల్లిని వేనోళ్ళ కీర్తిస్తూ మాతృభాష కు అక్షర హారతులతో […]

Something Special – ముచ్చర్ల రజనీ శకుంతల

సాహితీ కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, ప్రమదాక్షరి సమావేశాలు మొదలైనవాటిలో చురుగ్గా పాల్గొనే ఒకావిడ కొన్నేళ్ల క్రితం పాఠకులను ఉర్రూతలూగించే రచనలు చేసి ఎన్నో కథలు, వ్యాసాలు, నవలలు, సీరియళ్లు, టీవీ ప్రోగ్రాములు మొదలైనవి చేసిన ప్రముఖ రచయిత్రి అని తెలిస్తే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా.. నరుడా ఏమి నీ కోరిక, ప్రియా ప్రియతమా, ఒక గుండె సవ్వడి, మనమిద్దరం లాటి పాపులర్ టీవీ సీరియళ్లు,వంశీ ఆర్ట్స్, కళానిలయం, జ్యోత్స కళాపీఠం, మయూరి ఆర్ట్స్ , […]

ఓషో రజనీష్

రచన: శారదా ప్రసాద్ వాత్సాయనుడికి వారసుడుగా జనం చెప్పుకునే ఓషో జిడ్డు కృష్ణమూర్తిగారి అభిమాని. బుద్ధుడి బోధల వల్ల ప్రభావితుడయ్యాడు. రజనీష్ చంద్రమోహన్ జైన్ 1960లలో ఆచార్య రజనీష్‌గా, 1970-1980లలో భగవాన్ శ్రీ రజినీష్‌ గా ఆ తరువాత ఓషోగా పిలువబడిన ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. ఇండియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా ఎన్నో దేశాలలో నివసించి ఓషో మూవ్‌మెంట్ అనే ఒక వివాదాస్పదమైన కొత్త ఆధ్యాత్మిక సంఘాన్ని తయారుచేశాడు. ఇతడు మధ్యప్రదేశ్‌ లో గల […]

గ్రహణం వదిలింది

రచన: గిరిజ కలవల సాయంత్రం ఐదు కావస్తోంది. రాధ ఆఫీసు పని ముగించి టేబుల్ సర్దేసింది. “ఏంటో.. మేడమ్ గారు అప్పుడే బయలుదేరిపోతున్నట్లున్నారే.. ఏమన్నా విశేషమా ఈ రోజు..” వెనక నుండి సూపరిడెంట్ భూషణం వ్యంగ్యంగా అన్నాడు. “అవును.. సార్… రేపు మా అమ్మాయి పుట్టినరోజు.. డ్రస్ కొనుక్కుని వెళ్ళాలి. పెండింగ్ వర్క్ అంతా అయిపోయింది. అందుకనే వెడుతున్నాను.”అంది రాధ. “డిసైడైపోయారుగా.. అలాగే కానీండి. . పుట్టినరోజు.. పార్టీ లు అంటారేమో.. ఈ వంకతో రేపు సెలవంటారేమో […]

మాయానగరం – 41

రచన: భువనచంద్ర ‘గురువు’ గారి అడ్డ మహా గంభీరంగా వుంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళతో చిన్న సైజు తీర్ధంలా వుంది. పార్టీ సామాన్య కార్యకర్తల నుంచీ, పార్టీ అధ్యక్షుడి దాకా, చిన్న చిన్న ఫేవర్స్ కోసం పడిగాపులు గాచే నిరుపేదవాడి నుంచి కేంద్రమంత్రివర్యుల దాకా వచ్చిపోతూనే వున్నారు. కారణం ఏమైనా’ప్రెస్’ వాళ్ళకీ,’ఛానల్’ వాళ్ళకీ పండగ్గా వుంది. “మాదేముంది గురూ, పైన పటారం లోన లొటారం.. ఉత్త డొల్ల.. ఏదో ఈ కార్డుని పట్టుకొని తిరగడం కానీ, మా యాజమాన్యం […]

బుద్ధుడు-బౌద్ధ మతం

రచన:  శారదా  ప్రసాద్ ​బౌద్ధ మతం ప్రపంచంలోని ముఖ్యమైన మతాలలో ఒకటి. మొత్తం ప్రపంచంలో బౌద్ధ ధర్మాన్ని ఆచరించేవారు 23 కోట్లనుండి 50 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా.బౌద్ధంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి – మహాయానము, థేరవాదము. తూర్పు ఆసియా, టిబెట్ ప్రాంతాలలో మహాయానం (వజ్రయానంతో కలిపి) అధికంగా ప్రాచుర్యంలో ఉంది.”బుద్ధుడు అట్టడుగువర్గాల విముక్తి ప్రధాత. రాజకీయ మార్గదర్శి’’ గౌతమ బుద్ధుని పైనా, ఆయన సామాజిక కార్యాచరణ పైనా విస్తృత పరిశోధన చేసిన సి.ఎఫ్. కొప్పన్ అన్నమాటలివి. […]

ఎందరో మహానుభావులు – గరికపాటి నరసింహారావు

ఇంటర్వ్యూ: విశాలి పేరి ” కదిలేది కదిలించేది పెనునిద్దర వదిలించేది కావాలోయ్ నవతరానికి ” అని మహాకవి శ్రీశ్రీ కోరినట్టుగా ప్రస్తుత యువతరానికి తన మాటలతో ఉత్తేజాన్నిచ్చేవారు ఇన్నాళ్ళకు దొరికారు. ప్రవచనాలంటే కాటికి కాలు చాపుకొనేవారే వింటారు అనే అపోహ ఈయన ప్రవచనం వింటే తొలగిపోతుంది. ఏ ప్రవచనం విని యువతలో ఒక వివేకానందుడు వెలుగుతాడో.. ఆ ప్రవచనం ఆ గరికపాటివారి సొంతం. ప్రస్తుతం సమాజంలో ఉన్న కుళ్ళును తన మాటలతో ఉతికిపారేసే నైజం వారిది. ఆయన […]

ఎందరో మహానుభావులు 1. రావు బాలసరస్వతి

ముఖాముఖి చేసినవారు: విశాలి పేరి తెలుగు పాటల మణిహారములో సరస్వతీ దేవిని అలరించిన స్వర కుసుమాలు ఎన్నో. ప్రతీ పాట ఒక తేనె గుళికగా అందించిన గాయకులు ఎందరో! పాటలో ప్రతి పలుకు మనసుపొరలలో గూడు కట్టుకొనేలా చేసే గాయకులు చాలా తక్కువమందే! . లాలిత్యం, హాయిగా రాగ యుక్తం ఆలపించే గాయనీమణులలో చెప్పుకోతగినవారు రావుబాల సరస్వతి దేవి గారు. తన గాత్రంతో మనసులను సుదూర తీరాలలో ఓలలాడించగల స్వర బాల. గట్టిగా మీటితే తంత్రులు కందిపోతాయేమో […]

రెండో జీవితం

రచన : అంగులూరి అంజనీదేవి జీవితం చిన్నదే అయినా మనుషుల్లో ఆశలు, ఆకాంక్షలు వుంటాయి. తాము చేరుకోవలసిన గమ్యాలు, పెట్టుకున్న లక్ష్యాలు వుంటాయి. శాంతికి, అశాంతికి మధ్యన అవ్యక్తపు ఆలోచనలు, ఊహకందని అలజడులు వుంటాయి. వీటికోసం ఎంతో గోప్యంగా తమ హృదయాన్ని రహస్యపు మందిరంగా చేసుకొంటారు. మనసును దారంతో బిగించి కట్టిన పొట్లంలా మార్చుకుంటారు. తాము గీసుకున్న బొమ్మలో తామే తిరుగుతున్నట్లు తమలోకి తాము చూసుకుంటారు. ఎక్కడ ఆగుతామో అక్కడ మన ఆనందం ఆగుతుందని గ్రహిస్తారు. తిరిగి […]

మాయానగరం – 39

రచన: భునవచంద్ర “మాధవిగారూ… నేను మీకు తెలుసు. నా అనే వాళ్ళు నన్నొదిలేశారు. ఎలా పైకొచ్చానని అడక్కండి. ఏ జీవితాన్ని చూసినా పైకి రావాలంటే రెండే పద్ధతులు. ఒకటి కష్టపడి ఎదగటం… రెండోది ఇతరుల్ని కష్టపెట్టి ఎదగటం. ఇతరుల్ని కష్టపెట్టే ఎదిగేది రౌడీలూ, గూండాలూ మాత్రమే కాదు. ఎదుటివారి వీక్ నెస్ ని సొమ్ము చేసుకునేవారు కూడా! ” ఓ క్షణం ఆగాడు బోసు. “అదంతా నాకెందుకు చెబుతున్నారూ? ” ఏ మాత్రం కుతూహలం ధ్వనించని స్వరంతో […]