April 25, 2024

మనుగడ కోసం.

రచన: ఓలేటి శశికళ శ్రావణ శుక్రవారం. వరలక్ష్మీ వ్రతం రోజు. సాయంత్రం పేరంటంపెట్టుకుని, అరవైమందిని పిలుచుకున్నాను. చాలా సందడిగా జరిగింది పేరంటం. పిలిచినవారంతా చక్కటి ముస్తాబుతో, అందమయిన పట్టుచీరలు కట్టుకుని, కొత్త, పాత నగలు అలంకరించుకుని, అపర లక్ష్మీదేవుల్లా ఒచ్చి పసుపు, కుంకుమ, తాంబూలాదులు తీసుకుని వెళ్ళి పోయారు. ”అమ్మయ్యా! ఒకరిద్దరు తప్ప అందరూ ఒచ్చేసినట్టే”. ఇంక వీధి తలుపు వేద్దామని వెళ్తూ, నా అమ్మవారిని ఒకసారి తేరిపార చూసుకున్నా. పాలరాతి మందిరంలో, స్థాపించిన అష్టలక్ష్మీ కలశంలో, […]

బ్రహ్మలిఖితం 9

రచన: మన్నెం శారద “లిటరరీ ఫ్లాక్” అనుకుంది మనసులో కసిగా లిఖిత. చీకటి పడింది. రెండరటిపళ్ళు తిని బెర్తెక్కి పడుకుంది. శరీరాన్ని వాల్చినా మనసుకి విశ్రాంతి లభించడం లేదు. కొన్ని గంటలుగా కంపార్టుమెంటులో కోయదొర చేసిన విన్యాసాలు మనిషి పల్స్ తెలుసుకొని ఆడుతున్న నాటకాలు గుర్తొచ్చి ఆశ్చర్యపడుతోంది. ఒక చదువుకోని అడవి మనిషి .. అడవిలో దొరికే పిచ్చి పిచ్చి వేర్లు తెచ్చి వాటిని దగ్గర పెట్టుకుంటే శని విగడవుతుందని అదృష్టం పడుతుందని, అనుకున్న పనులు జరుగుతాయని […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 17

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య మానవ జన్మ ఎక్కువ కాలం నిలిచి వుండదు. లభించిన కాలాన్ని అంటే జీవించియున్న కాలాన్ని సక్రమంగా వాడుకోవాలి. “దుర్లభో మానుషోదేహః” శరీరం లభించడమే చాలా కష్టం, “దేహినాం క్షణ భంగురః” లభించినది ఒక క్షణమంత కూడా ఉండదు. “మిన్నిన్ నిలయిల మన్ను ఇఱాక్కెగళ్” అని చెబుతారు నమ్మాళ్వార్. ఇది మెరుపు కంటే కూడా ప్రమాదకరమైనది. మెరుపు ఎట్లా ఐతే పోయేదో, ఆ వెలుతురును పట్టించుకోం, అట్లానే శరీరం పోయేది అని తెలిసి కూడా […]

బ్రహ్మలిఖితం – 7

రచన: మన్నెం శారద తాత్కాలికంగా వచ్చిన పని మరచిపోయి లిఖిత దాని దగ్గర కెళ్లి మోకాళ్ల మీద కూర్చుని దాన్ని నిమరసాగింది. పామరిన్ కుక్కపిల్ల లిఖిత ఏనాటి నుండో తెలిసినట్లుగా లిఖితని ఆనుకొని కూర్చుని ఆమె చేతుల్ని ఆబగా నాకుతూ తన ప్రేమని ప్రకటించుకోసాగింది. బహుశ గత జన్మలో ప్రేమరాహిత్యానికి గురయిన వ్యక్తులు పామరిన్ కుక్కలుగా పుడ్తారేమోననిపించింది లిఖితకి. ఎలాంటి కరకురాతి మనిషయినా వాటిని దగ్గరకు తీయకుండా వుండలేడు. లిఖిత దాన్ని లాలిస్తుండగా పక్క గోడ మీంచి […]

మాయానగరం – 35

రచన: భువనచంద్ర “వాన్ని గమనించాను వెంకటస్వామి… నిస్సందేహంగా వాడు పరమశివమే! అయితే వాడు ఇటువైపు రాలేదు. వెనక వైపు నుండి వచ్చి మా పెరట్లోకి దూకాడు. యాక్ట్యువల్ గా ఇవాళ నాకు ఆఫ్. అయినా ఓ చిన్నవిషయం వల్ల ఆఫీస్ కు వస్తూ వాడ్ని చూశాను. వాడి కథంతా మహదేవన్ గారు నాకు చెప్పారు. వాడెంత క్రూరుడో కూడా చెప్పారు. నువ్వే ఎందుకో నాతో చెప్పడానికి సందేహించావు. వాడేదో క్రూరత్వమైన ఆలోచనలతోటే ఇక్కడికొచ్చాడు. బహుశా వాడొచ్చాడని మీకు […]

ఈ జీవితం ఇలా కూడా వుంటుందా? 9

రచన: అంగులూరి అంజనీదేవి అంకిరెడ్డి ఆఫీసు నుండి ఇంటికి రాగానే సతీష్‌చంద్ర ఫోన్‌ చేసినట్లు మాధవీలతతో చెప్పాడు. ఆమె మాట్లాడకుండా మౌనంగా విని ”సరే! మీకు కాఫీ తెచ్చిస్తాను” అంటూ అక్కడ నుండి కావాలనే లేచి వెళ్లింది. భార్య కాఫీ తెచ్చేంత వరకు ఖాళీగా కూర్చోకుండా లాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి కొత్తగా వచ్చిన వెబ్‌సైట్లు చూసుకుంటూ కూర్చున్నాడు. ”ఊ… ఇదిగోండి కాఫీ” అంటూ ఆయనకు నాలుగు అడుగుల దూరంలో వున్నప్పుడే అంది. ”దగ్గరకి రా! అక్కడ నుండే […]

చిటికెన వ్రేలు

రచన: రామా చంద్రమౌళి వాడు బుడిబుడి అడుగులతో పరుగెత్తుకొచ్చి ‘అమ్మా’ మోకాళ్లను చుట్టుకుపోతాడు. పైగా నవ్వు ముఖం నిండా ‘అమ్మ నాదీ’ అన్న వ్యక్తీకరణ ఈ చంద్రుడు నాది.. ఈ ఆకాశం నాది.. ఈ సమస్తమూ నాదే.. వలె… ఔను మనిషి తనను తాను స్పష్టంగానే చెప్పుకోవాలి ‘నేను దు:ఖిస్తున్నాను. నేను సంతోషంతో పొంగిపోతున్నాను. నేను నీకోసం పరితపిస్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు కావాలి నీ కోసం యుగయుగాలుగా ఇక్కడ ఇదిగో ఈ తీరంపై నేను […]