March 29, 2024

రాజీపడిన బంధం.. 3

రచన: ఉమాభారతి అత్తయ్య నాకోసం శ్రద్ధగా వండించే తినుబండారాలు, తెప్పించే మామిడికాయలు, ఉసిరికాయలు మినహాయించి, ఈ సమయంలో ఆహ్లాదాన్ని కలిగించే ఇష్టమైన వ్యాపకం ఏముంటుందాని ఆలోచించాను. చిన్నప్పటినుండి నాకు కుక్కపిల్లులు, వాటి పెంపకం ఇష్టం. స్కూలుకి వెళ్ళే దారిలో తప్పిపోయిన కుక్కపిల్లల్ని చేరదీసేదాన్ని. ఆ నోరులేని జీవాలు నాలో తెలియని ప్రేమని, మార్దవాన్ని నింపేవి. అప్పట్లో ఆ కుక్కపిల్లల్ని పెంచే స్తోమత లేక, పెట్స్ అంటే ఇష్టమున్న ఫ్రెండ్సుకి వాటిని అప్పజెప్పేదాన్ని. పూదోటలు, మొక్కల పెంపకం కూడా […]

రాజీపడిన బంధం – 2

రచన: ఉమాభారతి కోసూరి యేడాది తరువాత… ఢిల్లీ మహానగరంలోని ‘రీగల్ లయన్స్ క్లబ్’ వారి ఆవరణ కిక్కిరిసి ఉంది. మిరుమిట్లు గొలిపే జిలుగుల వెలుగులతో నిండి ఉంది ఆడిటోరియం. ‘క్లబ్ వార్షికోత్సవం’ లో భాగంగా ‘ప్రేమికుల రోజు’ – వేలంటైన్స్ డే’ సందర్భంగా “అందాల జంట” కాంటెస్ట్ జరుగుతుంది. ఆఖరి అంశం కూడా ముగిసి, విశ్రాంతి సమయంలో మ్యూజిక్ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతిష్టాత్మకమైన ఆ పోటీలో మాతో పాటుగా పాల్గొన్న యువజంటలన్నీ పోటీ ఫలితాల ప్రకటన కోసం […]

రాజీపడిన బంధం – 1

  రచన: కోసూరి ఉమాభారతి “వెండితెర – సినీ సర్క్యూట్ వారి – తాజావార్త ” – పేపర్ చదువుతూ, ఏదో ముఖ్యమైన ప్రకటన చేస్తున్న శైలిలో చేయి పైకెత్తి స్వరం పెంచిందామె. “ ‘మొరటోడు’ సినిమా చిత్రీకరణ సమయంలో- ‘రొమాంటిక్ సీక్వెన్స్ కోసం వెరైటీగా బాక్సింగ్, ఫుట్బాల్ క్రీడల్లో పాల్గొన్నందుకు నటి రాణి గాయాలకి లోనై అస్వస్థతకి గురవడంతో వారంపాటు షూటింగ్ నిలిపి వేసినట్టు దర్శకుడు కరుణాకరం అందించిన వార్త. వరుణ్ హీరోగా నిర్మాణంలో ఉన్న […]