April 19, 2024

మనసుకు హాయినిచ్చే హాస్యానందం

సమీక్ష: సి.ఉమాదేవి హాస్యరసం మనసుకు సేదతీర్చే జీవామృతం.మనసెపుడు ఆనందంతో ఉరకలు వేస్తుందో అప్పుడు మన ప్రమేయం లేకుండానే ఏ పని చేయాలన్నా ఉత్సాహం కలుగుతుంది.తన బ్లాగులద్వారా సాహిత్యాంశాలకు మెరుగులు దిద్దుకున్న కౌండిన్య కాలక్రమేణా కథాప్రపంచంలోకి అడుగిడి మనల్ని తను పరిచిన హాస్యపుబాటలోకి నడిపించారు. పదిహేనుకథలుగల సంపుటిలో ప్రతి అంశం విభిన్నతతో అలరిస్తుంది. ప్రతిసంఘటన హాస్యస్ఫోరకమై మనలో నవ్వులు పూయిస్తుంది.పంజాబీ డ్రెస్సులు అమ్మే అమ్మాయి దగ్గర పంజాబీ డ్రెస్సు కొని తన ఆహార్యాన్ని మార్చుకుని,పైగా లిప్ స్టిక్,మేకప్ తో […]

మనసు తడిపిన గోదారి కథలు

సమీక్ష:  సి.ఉమాదేవి విభిన్న కథాంశాలతో మనలో ఆలోచనలను రగిలించి పరిష్కారదిశగా మన మనసును మలుపు తిప్పుతారు  రచయిత్రి చెంగల్వల కామేశ్వరి.అటు సామాజిక సేవను ఇటు సాహితీ సేవను సమాంతరంగా నిర్వహించడమే కాక చక్కటి యాత్రానుభవాలను స్వంతం చేసుకున్నారు.స్నేహానికి,సంగీతానికి చక్కటి లయ పలుకుతుంది వారి మనసు. చెప్పుకుంటే కథలెన్నో,కాఫీ విత్ కామేశ్వరి మనకందిన వీరి పుస్తకాలు మనల్ని అలరించాయి.ఇప్పుడు వెలువడిన వీరి గుండెల్లో గోదారి కథాసంపుటం భిన్న కథాంశాల సమాహారం.నిర్మలంగా ప్రవహించే గోదారిలో సైతం, కనబడని సుడిగుండాలు కబళించినట్లు […]

మనసు పలికిన ఆత్మీయతా తరంగం

సమీక్ష: సి.ఉమాదేవి     రచయిత్రి రజనీ సుబ్రహ్మణ్యం రచించిన అసమర్థురాలి అంతరంగం కథలు,  అనువాదాలు,  వ్యాసముల సమాహారం.  భిన్నత్వంలో ఏకత్వంవలె ప్రతి రచనలోను ప్రతిఫలించే అక్షరసుగంధం మనసంతా పరిమళభరితం కావిస్తుంది.  తాతగారు త్రిపురనేని రామస్వామిగారు, తండ్రిగారు గోపిచంద్ గారు పరచిన సాహితీబాటలో తనదైన శైలిలో రచనలు గావించినా,  వారి పెద్దలు పలికిన మాటలు అంతర్లీనంగా మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. ఓటమి కథ సాధారణంగా ఎన్నో కుటుంబాలలోని భార్యాభర్తల జీవనసరళిని పారదర్శకం చేస్తుంది.  తాను చెప్పిందే చేయాలని […]

బాల్యం కురిపించిన హాస్యపు జల్లులు

రచన: సి.ఉమాదేవి మనసుకు రెక్కలు తొడిగి జ్ఞాపకాల వలను తడిమినపుడు వెలువడే అనేక సంఘటనలు చిరస్మరణీయమైన మధురానుభూతులు. ఒకనాటి కుటుంబ వ్యవస్థను, అనుబంధాలను, ఆనాటి కట్టుబాట్లను మనముందుంచి, మన మనోవల్మీకములో నిక్షిప్తమైన మన చిన్ననాటి జ్ఞాపకాలను సైతం తోడి మనకందిస్తారు మన్నెం శారద. విభిన్నకళలలో ప్రవేశంగల రచయిత్రి ఆ కళలను నేర్చుకునే క్రమంలో వచ్చిన అడ్డంకులను తనదైన కళాస్ఫూర్తితో అధిగమించి కళలకే తన జీవిత ధ్యేయంగావించుకున్న కళారాధకురాలు. ఫేస్ బుక్ లో చక్కని చిత్రాలతో అందరినీ అలరించి […]

మానవత్వమే మనిషితనానికి దిక్సూచి అని చెప్పిన కథలు – మాయాజలతారు

సమీక్ష: సి. ఉమాదేవి రచయిత సలీంగారు జగమెరిగిన రచయిత. తన సాహితీ ప్రస్థానంలో ఎన్నో కథాసంపుటాలను, నవలలను, కవితాసంపుటాలను పాఠకులకందించారు. ప్రతి రచనలోను నేటి సామాజికాంశాలపై రచయిత మనసులోని అంతర్మథనం స్పష్టంగా గోచరిస్తుంది. వీరు అందుకున్న పురస్కారాలు, రచనలకు బహుమతులు వీరిలోని సాహితీ ప్రజ్ఞకు కొలమానాలని చెప్పవచ్చు. రచయితలోని అక్షర స్పందన పాఠకుడి ఆలోచనా వల్మీకాన్ని కదిలిస్తుంది. కథలు చదివాక అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. రచయితతోపాటు మనకు కూడా సమస్యలకు పరిష్కారాన్ని అందరికి తెలియచేయాలనే తపన […]

మనోవేదికపై నర్తించిన అక్షరరవళి

రచన: సి.ఉమాదేవి ఆంగికం భువనం యశ్య వాచికం సర్వవాఙ్మయమ్ ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్త్వికం శివమ్ అభినయ దర్పణములో ప్రారంభ శ్లోకంతో కోసూరి ఉమాభారతి రచించిన వేదిక నవలపై సమీక్ష ప్రారంభించడానికి కారణం నవల నడిచిన కాదు నర్తించిన తీరు. భరతముని రచించిన నాట్య శాస్త్రమును నాట్యవేదమంటారు. వేదిక నవల నాట్యశాస్త్రాన్ని గుర్తు చేయడం కాకతాళీయమే కాని విభిన్న నృత్యాంశాలకు చక్కటి మార్గదర్శినిగా నిలిచిన నాట్యశాస్త్రం నృత్యాభిలాష ఉన్నవారికి కరదీపిక అని పునశ్చరణ చేసుకోవడం నవలలో […]