సీతారామ కల్యాణం

రచన: కిభశ్రీ రండి కన రండి – – – – తరలి రండి రండి రండి రారండి – – – – కదలి రండి నవ్య యుగములో అందరూ సవ్యముగా జరుపుకునేది దివ్యానుభూతిని ఇచ్చేదీ భవ్యమైన కల్యాణమే ఇది || రండి|| తుల్యమే లేని సీతమ్మే కౌసల్యతనయుని చేరునటా కల్యాణం చూసినవారికి కైవల్యం తథ్యమటా ధరణిని జనకుని పట్టియట ఆ సిరియే- – – పెండ్లికూతురట సరియైనవాడె జోడట ఆ హరియే – –