స్వచ్ఛ భారతము

రచన: చల్లా పార్వతి

స్వచ్ఛ భారతమును సాధించుదామని
బాహ్య భారతమును శుద్ధి చేసినా
మనుజుల లోపల పట్టిన మకిలిని
శుభ్రపరచుట మన తరమగునా

పంచభూతాలనుపయోగించి బాహ్య సమాజమును శుద్ధి చేయవచ్చు
మన చేతలతో పంచభూతాలను కలుషితం చేస్తూ
భావితరాల జీవనయానం కష్టతరం చేసే
మనమే కామా భవిత పాటి శత్రువులం
మన అంతః శుద్ధి చేయుట ఎవరి తరం

ప్రకృతి విరుద్ధ ప్రయోగాలతో వనరులన్నీ నాశనం చేస్తుంటే
ఎదుర్కొనక తప్పదు మానవాళికి వాటి పరిణామాలు
ప్రకృతి ప్రకోపిస్తే జరిగే విలయతాండవానికి
గురి గాక తప్పదు జనావళికి

మానవుల మేధస్సు నంతా మంచికై వాడి
స్వచ్ఛ భారతము సాకారం చేసిన రోజు
మానవులే మహనీయులు
రేపటి భవితకు మాననీయులు