April 25, 2024

1. భలే భలే పెళ్ళిచూపులు

రచన: ఉమాదేవి కల్వకోట అరుంధతి చాలా ఆత్రుతగా ఉంది… చాలా టెన్షన్ గా కూడా ఉంది. దానితో నిద్ర కూడా పట్టడం లేదు. ‘మళ్ళీ నిద్రపోకపోతే మరునాడు జరిగే కార్యక్రమంలో తాను అందంగా కనిపించనేమో, తన గ్లామర్ తగ్గుతుందేమో’ అనే ఆందోళన కూడా తోడవడంతో ఇంకాస్త గాబరాగా ఉంది. ఈ ఆత్రుత, ఆందోళన, గాబరా వీటన్నింటికీ కారణమేమిటంటే మరునాడు జరగబోయే పెళ్ళిచూపుల కార్యక్రమం. ‘నిజమే కదా! నిద్ర లేకపోతే ముఖం పీక్కుపోయి, పెళ్ళివారు మెచ్చరు కదా! పాపం […]

బాలమాలిక – ‘బామ్మ నేర్పిన పాఠం.’

రచన: ఉమాదేవి కల్వకోట స్కూల్ వాన్ ఆగే ప్లేస్ లో తన ఫ్రెండ్ వరుణ్ కోసం ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్న బంటీ ముఖం వికసించింది. వరుణ్ కూడా నవ్వుతూ వచ్చి బంటీ పక్కనే నిలబడగానే వ్యాన్ రావటం, వీళ్ళు ఎక్కటం, వ్యాన్ కదలటం జరిగిపోయాయి. “హాయ్ రా వరుణ్…” “హాయ్ రా బంటీ…” “నిన్న సండే కదా… ఏంట్రా, ఏం చేసావు నిన్న?” కుతూహలంగా అడిగాడు వరుణ్. “నిన్న మేము ఒక బర్త్ డే పార్టీ […]

పనివారూ మీకు జోహార్లు

రచన: ఉమాదేవి కల్వకోట ఉదయాన్నే ఇల్లంతా ఒకటే గందరగోళం. అందరిలో అసహనం,అశాంతి…అయోమయం. ఒకరిపై ఒకరు చిరాకులూ పరాకులు…మాటల యుద్ధాలు. పనమ్మాయి రాకపోవడమే దీనంతటికీ కారణం. రెండురోజులుగా ఆమెకి జ్వరం. కరోనా భయంతో ఉంచారామెను దూరం. సామాజిక దూరం పాటించండంటూ టీవీల్లో ఒకటే హెచ్చరికలు. అందుకే కష్టమైనా ఆమెను కొన్నాళ్ళు రానీయరాదనే నిర్ణయం. పర్యవసానమే ఈ గందరగోళం. బాగున్నప్పుడు ఆమెను పట్టించుకున్నదెవరనీ! ఈ సామాజిక దూరం పనివాళ్ళకి ఈనాటిదా.. వీరిపట్ల జరుగుతున్న సామాజిక అన్యాయం మనమెరుగనిదా? ఇది తరతరాలుగా […]

నవరసాలు..నవకథలు.. శాంతం 6

రచన: ఉమాదేవి కల్వకోట ఇక అబద్ధాలు చెప్పకండి నాన్నా. సాయంత్రం ఆరుగంటలు దాటింది. పార్కులో చిన్నపిల్లల ఆటలూ, కేరింతలు,పెద్దవాళ్ళ కబుర్లు, ప్రేమికుల ఊసుల బాసల సందడులన్నింటికీ దూరంగా ఒక బెంచిమీద ఒంటరిగా కూర్చొని తన కొడుకు కార్తీక్ రాసిన ఉత్తరం గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నారు రామారావుగారు. ఇప్పటికే రెండుసార్లు చదివిన ఆ ఉత్తరాన్ని అప్రయత్నంగానే జేబులో నుండి తీసి మరోసారి చదవసాగారు.. నాన్నా ! ఒకే ఇంట్లో ఉంటూ మీకీ ఉత్తరం రాయడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని […]

తిక్క కుదిరింది… గొలుసు కథ

తిక్క కుదిరింది.. గొలుసు కథ 1 రచన: రజనీ శకుంతల సుమలత మంచి సింగర్ ” ఎంత అంటే పుట్టిన వెంటనే తన ఏడుపు కూడా స—-రి— గ—మ –ప —లానే రాగయుక్తంగా ఏడిచిందని ఆమె తల్లి అరుంధతి ఇప్పటికి ఏడు లక్షల ఒకటోసారి చెప్పింది. ఇంకా చెప్తోనే ఉంది. ప్యూచర్ లో కూడా చెప్తూనే ఉంటుంది. ఇంత రిధమిక్ గా ఏడవబట్టే మూడో సంవత్సరానికే సంగీతం క్లాస్ కి పంపింది.తల్లి. అలా అలా స్వరాలు వగైరా […]