April 25, 2024

జలగ

రచన: శ్రీపాద ఏమిటో నలుగురిలో ఉన్నా ఒంటరిగా ఉన్నట్టే వుంది. అక్కడికీ నన్ను నేను చాలానే విశ్లేషించుకున్నాను. నాకే ఏదైనా అహమూ గిహమూ ఉన్నయేమోనని అనుమానం. చిన్నప్పుడు ఏ మాత్రం దాపరికం లేకుండా లొడలొడా వాగేదాన్నని అమ్మ చెప్తూనే ఉండేది. అవును , చాలా రోజులు అనుకున్నది లోలోనికి తోసేసి పెదవుల మీద అబద్దాలు దొర్లించగలమని తెలియదు నాకు. అనుకున్నది నిష్కర్షగా చెప్పెయ్యడమే. స్వచ్చంగా ఉంటేనే ఆత్మానందం అనుకునేదాన్ని. కాని ఎంత దాపరికం ఉంటే అంత గొప్ప […]