March 19, 2024

భాషను ప్రేమించరా!

రచన: నాగులవంచ వసంతరావు భాషను ప్రేమించరా బతుకును పండించరా బాష నేర్చుకుంటే నీ బతుకే బంగారురా! భాషే మన మెతుకురా భాషే మన బతుకురా భాష రాకపోతే మన బతుకే ఆగమ్మురా మాతృభాష మాధుర్యం మదినిండా నింపరా హృదిలోని భావాలను అలవోకగ తెలుపరా వృత్తియందు మెప్పు పొంద భాష కీలకమ్మురా భాషతోటి ‘బాసు’ మనసు బాగ దోయవచ్చురా! ఉద్యోగం వ్యాపారం వృత్తి ఏదైనగాని భాషయందు ప్రావీణ్యత బాగ ఉపకరించురా మదిలోని భావనలు మనసునిండ ముసురుతుంటె బహిర్గత పరచుటకు […]

చిటికెన వ్రేలు

రచన: రామా చంద్రమౌళి వాడు బుడిబుడి అడుగులతో పరుగెత్తుకొచ్చి ‘అమ్మా’ మోకాళ్లను చుట్టుకుపోతాడు. పైగా నవ్వు ముఖం నిండా ‘అమ్మ నాదీ’ అన్న వ్యక్తీకరణ ఈ చంద్రుడు నాది.. ఈ ఆకాశం నాది.. ఈ సమస్తమూ నాదే.. వలె… ఔను మనిషి తనను తాను స్పష్టంగానే చెప్పుకోవాలి ‘నేను దు:ఖిస్తున్నాను. నేను సంతోషంతో పొంగిపోతున్నాను. నేను నీకోసం పరితపిస్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు కావాలి నీ కోసం యుగయుగాలుగా ఇక్కడ ఇదిగో ఈ తీరంపై నేను […]

మీమాంస ..

రచన: శ్రీకాంత గుమ్ములూరి మస్తిష్కానికి మనసుకు మీమాంస !! మస్తిష్కపు మట్టిలో చిన్న విత్తనం … నాటిన వాని ఊహకే అనూహ్యం ! గోరంతలు కొండంతలు చేసిన నైజం.. మానసిక సంతులాన్ని తిరగదోసిన వైనం .. మానవ నైజపు వాసనలు చేసిన అంకురార్పణం .. అంకురించిన అనుమానపు బీజం .. వేరు తన్నిన వెర్రి ఊహల విజృంభణం .. సాదృశమైన దౌర్భాగ్యపు కలుపు మొక్కల భాషాజాలం .. విస్తరించిన చీడ కొమ్మలనలముకొన్న విషం .. కొత్త ఆశల […]

జీవిత పరమార్థం

రచన: నాగులవంచ వసంతరావు అనంత కాలచక్రంలో జీవితకాలం అల్పమే ఐనా శతకోటి సుగంధాల పరిమళ మాల జీవితం ఉత్సాహంగా పనిచేస్తూ ఆనందంగా జీవిస్తూ సాటివారికి సాయం చేయడమే సరియైన జీవితం సద్భావనలు పెంచుకొని సన్మార్గాన పయనిస్తూ సమత, మమత, మానవతలు పరిఢవిల్లేదే జీవితం ఆదర్శాలను ఆచరణలో ప్రతిపనిలో ప్రతిబింబిస్తూ తెరచిన పుస్తకంలా ఉండేదే అసలైన జీవితం దురలవాట్లతో దిగజార్చుకుంటే దు:ఖ సాగరమౌతుంది మలచుకోగల నేర్పు ఉంటే మహోన్నత శిఖరమౌతుంది సంసార సాగరంలో సమస్యల తిమింగలాలు అలజడులు రేపినా […]

గమ్యం

రచన: మహేశ్ కుమార్ విశ్వనాధ ఏ మార్గం నా ప్రతి రక్తనాళంలో దేశభక్తిని నింపుకుని యుద్ధంలో గెలుస్తుందో అదే నా గమ్యం ఏ మార్గం శాస్త్రాన్ని జ్ఞాన ఆయుధంగాజేసి అవైదికాన్ని ధర్మకురుక్షేత్రంలో ప్రతిఘటిస్తుందో అదే నా గమ్యం ఏ మార్గం మనోమయ విద్యను విశ్వజగతిలో జీవకాంతులతో నింపుతుందో అదే నా గమ్యం ఏ మార్గం విశ్వప్రజాలోచనజేసి స్వరాజ్యపు జనావాహినిలో సంచరించే నా సోదరిని రక్షిస్తుందో అదే నా గమ్యం ఏ మార్గం కాలకంఠుని కాళరాత్రి కార్చిచ్చుకు బెదరక […]