April 25, 2024

ప్రేమవ్యధ…!!

రచన, చిత్రం: కృష్ణ అశోక్ పెనవేసుకున్న ప్రేమ పోగులు ఒక్కొక్కటి విడివడి తెగిపోవడం నా కంటిపాపకి కనిపిస్తుంది… గుండెలో రాసుకున్న ప్రేమాక్షర నక్షత్త్రాలు ఆకాశం నుండి ఉల్కల్లా నేలకు రాలడం నా మనసు కిటికీనుండి చూస్తూనే ఉంది… మైత్రి మమకారాలు మాట రాక గుండెగొంతులోనే కరుడు కట్టినట్టు మస్తిష్కపు కేన్వాసు వర్ణిస్తూనే ఉంది… సిరుల విరుల ఊసులన్నీ నీరుగారి నిన్నునన్ను ముంచేస్తున్న సునామీల్లా మనిద్దరినీ చెల్లాచెదురుగా చేయడం నా భవిష్యవాణి చెవిలో చెప్తున్నట్టు వినిపిస్తుంది… ఈ నిట్టూర్పుల […]

నీ జ్ఞాపకంలో

రచన, చిత్రం : కృష్ణ అశోక్. గుండె గూటిలో నీవు అనే జ్ఞాపకం ఒక అద్భుతం… ఈ జీవితానికి జతకాలేమేమోకానీ మనసులో నిరంతరజతగా మరుజన్మ వరకూ జీవిస్తూ.. నిర్జీవిస్తూ… నీ జాబిలి చెక్కిలి చుంబనాల చెమరింపుల వర్ణాల జిలుగులలో భ్రమిస్తూ.. పరిభ్రమిస్తూ… చుక్కలను తాకే నీ జ్ఞాన పరిపక్వత వెలుగుల ఆరాలను చేరేందుకు శ్రమిస్తూ.. విశ్రమిస్తూ… అంతర్యామివై నాలో నగ్నంగా కదిలే నీ ఆత్మతో అలౌకిక స్వప్నంలో రమిస్తూ.. విరమిస్తూ… గుండెల కౌగిళ్ళలో బిగించాలనిపించే దేహారహిత నీ […]

‘పర’ వశం…

  రచన, చిత్రం : కృష్ణ అశోక్ గోవులు కాచే వయసుకే గోపెమ్మ చేతిలో చిక్కాను, ఆమె కమ్మని కబుర్ల ముద్దలు ప్రేమ పెదవుల ముద్దులు మొదలు..   వయసు తెలిసే వేళకే ఓ అంకం మొదలయ్యింది… ఒళ్ళంతా చిన్ని చిన్ని మోహాల మొలకలు లేలేత చిగుళ్ళు వేసి పరువపు గుర్తులుగా కొంచెం కొంచెం ఎదుగుతూ… ‘పరవశం’ కి అర్ధం తెలియకుండానే మనసు తనువు ‘పర’వశము…   తొలిరోజుల నాటిన ఆ ప్రేమమొక్క నాతోపాటు ఎదుగుతూనే ఉంది.. […]

చెక్కిన చిత్ర శిల్పం..

రచన: కృష్ణ అశోక్. నేనో రాతిని చిత్రరచనలు చేసే ఓ రాతిని పాలుగారే వయసునుండే, అందుకేనేమో పాలరాతిని… ఓ స్త్రీ మూర్తి నాలోని సృజనాత్మక చిత్ర రసాన్ని మనసు కంటితో వలచిందేమో మలచడం మొదలెట్టింది… కాలం కదిలిపోతుంది నెలలో సంవత్సరాలో, కళ్ళుతెరిచి చూస్తే చుట్టూ భామల కోలాహలం… పాలరాతి ప్రియుడిని ఉలితో సుతిమెత్తగా వరించి కృష్ణ మూర్తిగా తీర్చిదిద్ది పూజలందుకొమ్మని దీవించి పోయింది… మాయల కృష్ణుడి పేరు మహిమో, రాతిని మూర్తిగ మలచిన రాధిక వరమో నేను […]

గుండె గొంతుకు…

రచన: కృష్ణ అశోక్   గొంతు మింగుడు పడటంలేదు.. నోటిదాకా చేరని ఓ అన్నం ముద్ద పిడికిలిలోనే ఉండిపోయి మెల్లగా ఎండిపోతుంది.. ఎండిపోతున్న ఒక్కో మెతుకు తనలోని తడి ఉనికిని కోల్పోయి పిడికిలిని వీడి ఆకాశంలోకి ఆవిరై రాలిపోతుంది.. కొన్ని ఇమడలేని మెతుకులు కూడా ఒకటొకటి గాలి చాలకో ఊపిరాడకో వాంతి అయిపోయినట్టు పిడికిలి దాటి జారిపోతున్నాయి… గొంతు ఇంకా గింజుకుంటూనే ఉంది మింగుడుపడే మార్గంకోసము.. గరగరా శబ్దం చేస్తూ కిందమీద పడుతూనేవుంది… పిడికిలి ముద్దనుండి రాలిపోగా […]

రంగుల ‘భ్రమ’రం..

రచన, చిత్రం, కవితాగానం : కృష్ణఅశోక్ ఈ మైక్ మీద క్లిక్ చేసి  కవితను వింటూ చదువుకోండి. అప్పుడప్పుడు… ఆకాశంలో ఉల్కలు రాలిపడినప్పుడో, భూమ్మీద సునామీలు చెలరేగినప్పుడో, నాలోకి నేను ప్రయాణం చేస్తుంటాను… కారణం లేకుండానే! జ్ఞాపకాలు హృదిలో కదలాడే వేళ మొదట కనిపించేది నీవే… నగ్నంగా… అవును! నగ్నంగానే… నిన్ను మొదటిసారి నగ్నంగా చూసినప్పుడు “నా న్యూడ్ పెయింటింగ్ వేస్తావా!?” అని ఆకాశంలో ఏదో వెదుకుతున్నట్టు చూస్తూ అడిగావ్… గుర్తుందా!…” భౌతికంగా కాకుండా, మనో నగ్నత్వం […]