April 24, 2024

కౌండిన్య కథలు – బద్రి

రచన: కౌండిన్య (రమేష్ కలవల) ఆ ఊరులో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగ జరుపకోవడం ఓ ఆనవాయితి. ఆ ఇంటి ముందు ఎద్దులబండి ఆపి ఒకాయన లోపలకు వెళ్ళాడు. పెరట్లో మంగయ్య గారు ఒళ్ళంతా నూనె రాయించుకుంటూ, అటూ ఆయన రావడం చూసి, ఆ ధాన్యం బస్తాలను జాగ్రత్తగా లోపల పెట్టించమని కసురుతున్నారు. లోపల నుండి వచ్చిన ఇల్లాలు అది చూసి, “ఇదిగో ఈ సంవత్సరం కూడా పందాలతో వీటిని మట్టి కలిపావంటేనా చూడు మరి” అంటూ ఆ […]

కౌండిన్య కథలు – పిండిమర

రచన: రమేశ్ కలవల   “ఏవండి.. ఇక్కడో పిండిమర ఉండాలి?” అని దారిలో పోతున్న మనిషిని ఆపి మరీ అడిగాడు. “ఏ కాలంలో ఉన్నారు మాస్టారు? పిండిమర మూసేసి చాలా ఏళ్ళయ్యింది..” అంటూ వెళ్ళబోయాడు  అతను. “దగ్గరలో ఇంకెక్కడైనా ఉందా?” అని అడిగాడు. “పాత బజార్లో ఉందేమో వెతకండి! అక్కడే గానుగతో చేసే నూనె కూడా బహుసా దొరకవచ్చు” అంటూ నవ్వాడు. ఆ అన్న మాటలు, వెలికినవ్వులో ఉన్న అంతరార్థం తనకు తెలియకపోలేదు. నీలకంఠం ఇదంతా ముందే […]

కౌండిన్య కథలు – మారని పాపారావు

రచన: రమేశ్ కలవల మాయ మాటలతో మభ్యపెట్టడం పాపారావుకు పుట్టుకతో అబ్బిన కళ. సిగరెట్టు బడ్డీకొట్టు దగ్గర మాటల గారడి చేసిడబ్బులు సంపాదించాడు పాపారావు. పట్నం నుండి హోల్ సేల్ లో కొత్త వెరైటీ లైటర్స్ తీసుకురమ్మని చెప్పాడుట ఆ బడ్డీకొట్టు ఓనర్. పాపారావు ఎలాంటి వాడో కొంచెం తెలిసింది కదా, తన గురించి మిగతాది తరువాత తెలిసుకుందాం, ఎందుకంటే ఆ డబ్బులు తీసుకొని అటు వెడుతుంటే పోస్ట్ మ్యాన్ ఓ టెలిగ్రాం అందచేసాడు. అందులో “తాత […]

కౌండిన్య కథలు .. సిద్దయ్య మనసు

రచన:  రమేష్ కలవల   ఆకు పచ్చని లుంగీ మీద మల్లెపువ్వు లాంటి తెల్లటి లాల్చీ లోంచి బనియను కనపడుతోంది. మెడలో నల్లటి తాయత్తు, కళ్ళకు సుర్మా, ఎర్రగా పండిన నోరు, భుజం మీద వేసుకున్న సంచిలో నెమలి ఈకలతో పాటు సాంబ్రాణికి కావలసిన సామగ్రితో ప్రతిరోజూ ఆ వీధి లో దట్టమైన పొగలలో కనిపించే మస్తాన్ వలి అంటే అందరికీ పరిచయమే. మస్తాన్ వలి కంటే కూడా సాంబ్రాణి వలి గానే అతను అందరికీ తెలుసు. […]

కౌండిన్య కథలు – కిరణ్ కొట్టు

రచన: రమేశ్ కలవల “కిరణ్” అంటే మీరేనా? అని అడిగాడు నారాయణ. “కాదు” అంటూ ఆ షాపులో సర్దుతున్న వాడల్లా వెనక్కి తిరిగి “ఇక్కడ ఆ పేరుతో ఎవరూ లేరు” అన్నాడాయన. “మరీ ‘కిరణ్ కొట్టు’ అని రాసి ఉంది?” అని అడిగాడు సంశయిస్తూ. “ఇదిగో ఈ రాజు చేసిన పనే ఇది..” అంటూ ఆ షాపులో పనిచేసే కుర్రాడిలా ఉన్న వాడిని చూపిస్తూ. “చిదంబరం కిరాణా కొట్టు అని రాయడానికి పేయింటర్ పిలుచుకు రారా అంటే… […]

కౌండిన్య కథలు – ప్రకృతి క్రితి

రచన: రమేష్ కలవల ఈ ప్రదేశం గురించి చాలా సార్లు విన్నాడు గీత్. ఎన్నో రోజుల నుండి అక్కడికి రావాలని ప్రయత్నిస్తున్నాడు. దగ్గర ఉన్న గ్రామంలో కొన్ని రోజులు ఉండి, ఆ చుట్టుపక్కలా ఉన్న పరిసరాల ప్రకృతిని చిత్రీకరించటాని కావలసినవన్నీ తనతో తీసుకొని వచ్చాడు. అక్కడికి వెతుక్కుంటూ వచ్చాడు. అక్కడ చూడటానికి అంతా కనువిందుగా, ఆహ్లాదకరంగా ఉంది, చుట్టూ నిశ్శబ్ధం ఆవహించి కదలిక లేని కొలను కనబడుతుంది. ఆ కొలనులో ఓ భాగం సూర్యుడి కిరణాలు పడుతూ […]