April 25, 2024

కౌండిన్య కథలు – పరివర్తన

రచన: రమేష్ కలవల “అబ్బ! ఎంత హడావుడిగా ఉందో చూడండి?” అంది కమలమ్మగారు, కూతురు కూడా పక్కనే నించొని ఉంది. “అవునవును. పండగలకు ఊరు వెళ్ళే వారంతా ఇక్కడే ఉన్నారు” అన్నారు రామనాధంగారు. మళ్ళీ “వాస్తవంగా బస్టాండు కంటే కూడా ఇక్కడే ఎక్కవ ప్రయాణికులు ఉంటున్నారు. ఇసకేస్తే రాలని జనం” అంటుండగా కాళేశ్వరరావు పంతులుగారు హడావుడిగా అటు నడుస్తూ వెళ్ళడం చూసి “కాళేశ్వర్రావుగారు” అంటూ పిలిచారు. ఆయన ఆగి “అరెరె మీరేంటి ఇక్కడ, ఎన్ని రోజులయ్యింది కలిసి” […]