April 23, 2024

గజల్

రచన: సంధ్య ch అభిలాషను అందుకునే కవితేమో దొరకలేదు ఎద బాసను పంచుకునే చెలిమేమో మనకు లేదు రాలుతున్న ఆశచినుకు కురిసి కురిసి వరదాయెను నావలేక ఈదలేక కనుకేమో కునుకు లేదు రాదారులు నీ దారని జ్ఞాపకాల్ని చూపుతుంటె మౌనంలో మునిగినట్టి మదికేమో పలుకు లేదు మెరిసె వెండి కాంతులన్ని మబ్బులకే పంచెనేమొ చందమామ సగం మిగిలి రేయేమో వెలుగలేదు పిల్లగాలి మెల్లగాను అల్లుకున్న తీగలలో తెల్లనైన మల్లె లేక అలకేమో చెరగలేదు ఎంత కఠిన మనసో […]

వీడికోలు!

రచన:కుసుమ.ఉప్పలపాటి. గజల్: రాగసుధల రసికులనూ అలరించే రారాజు! పాడటమే జీవంగా భావించే మహరాజు! తెనుగు భాష మాధుర్యం ఔపోసన పట్టాడె! పలుకు తల్లి వరమల్లే జనియించే రసరాజు! స్తోత్రాలతొ దేవతలకు స్వరార్చనే చేసాడు! సామవేద ఘనాపాటి తరియించే గానరాజు! గుండెగొంతు భాషతోన దేశమంత వినిపించె! వీనులున్న ప్రతివారిని మురిపించే రాగరాజు! నవరసాలు నావేనని విర్రవీగు గంధర్వుడు! సినిమాలకు కాసులనూ కురిపించే ధనరాజు! నీలిమబ్బు, గాలితెరలు వినిపించుగ నీపాట! సుస్థిరమై హృదయాలలొ జీవించే వలరాజు! అశృతర్పణ వీడికోలు అందుకొనుము […]

గజల్

రచన: శ్రీరామదాసు అమరనాథ్ అల తాకగానే దరి పులకరించింది నది సొగసుతో తాను పరవశించింది . కల చెదిరి మదిలోన గుబులాయనేమో ఒక మనసుకై తనువు పలవరించింది . తలపైన పూబంతి వికసించెనేమో ఒక ప్రేమ అనుభూతి పరిమళించింది . ఇలలోన అందాలు దాగున్నవేమో ఒక సొగసు వెన్నెలై పరితపించింది . శిలలోని సొంపులను పరికించితే ‘శ్రీయా ‘ ఒక మూగ రస జగతి పలుకరించింది .