April 24, 2024

గోపమ్మ కథ – 2

రచన: గిరిజారాణి కలవల గోపమ్మ ఇంట్లో పెరుగుతున్న లక్ష్మి క్రమేపీ తన తల్లితండ్రులని పూర్తిగా మర్చిపోయింది. గోపమ్మ, అంజిలనే అమ్మానాన్నలుగా అనుకుని వీళ్ళతో అనుబంధం పెంచుకుంది. కొడుకు రమేష్ కి గోపమ్మ తన అన్న కూతురుతో పెళ్ళి చేసింది. విచిత్రం దాని పేరు కూడా గోపమ్మే. మేము కన్ ఫ్యూజ్ అవకుండా అత్త గోపమ్మ , కోడలు గోపమ్మ అని పిలిచేవాళ్ళం. ఆస్తి పంచినట్టూ, కోడలు రాగానే ఇనప్పెట్టె తాళాలు చేతికి ఇచ్చినట్లు, కోడలుకి తను పని […]

జలజం… మొహమాటం.

రచన: గిరిజా కలవల ఆ మధ్య జలజం ఓ బీరకాయపీచు చుట్టమింటికి వెళ్ళింది. బంధుప్రీతి ఎక్కువ కదా మన జలజానికి… ఎవరినీ వదలదు.. ఆ ప్రకారం గా.. ఆ బీరకాయ పీచు ఇంటికి వెళ్ళగా… వారు సాదరంగా ఆహ్వానించి సముచిత ఆసననంబుపై ఆశీనులుకమ్మని.. తదుపరి యోగక్షేమం విచారించి… తగు ఆతిధ్యమీయ ఆ బీరకాయపీచు… ఒక ప్లేటు నిండుగా ఉల్లి పకోడీలు తెచ్చి మన జలజానికి అందించెను. ఉల్లి వాసనకి ముక్కుపుటాలు అదిరి… నోట లాలాజలం రివ్వున ఎగసింది […]

ఆచరణ కావాలి.

రచన: గిరిజరాణి కలవల రాత్రి తొమ్మిది అవస్తోంది. కోడలు హోటల్లో నుంచి తెప్పించిన టిఫిన్ తినేసి తన రూమ్ లోకి వెళ్ళబోతూ.. మనవడిని పిలిచారు రామారావు గారు. ” చిన్నూ ! ఇక రా, బజ్జుందువుగాని, తొమ్మిదవుతోంది, మంచి కధ చెపుతాను విందువుగాని..” అని పిలిచారు. ” ఉండండి.. తాతయ్యా ! ఈ గేమ్ సగంలో వుంది అయ్యాక వస్తాను. మీరు పడుకోండి.” టాబ్ లోనుంచి తల పైకెత్తకుండానే, ముక్కు మీదకి జారిపోతున్న కళ్ళజోడుని పైకి లాక్కుంటూ, […]

పాజిటివ్ థింకింగ్

రచన: గిరిజ కలవల పూజ, టిఫిన్ అవగానే…. వంటకు తొందరలేదు.. ఈరోజు లంచ్ కి ఈయన ఎలాగూ రానన్నారు.. నెమ్మదిగా ఆలోచిద్దాం దాని సంగతి అనుకుంటూ, చాలా రోజులుగా పెండింగ్ లో వున్న నవలని తీసుకుని సోఫాలో చతికిలపడ్డాను. రెండు పేజీలు చదివానో లేదో, వసుధ దగ్గరనుండి ఫోను వచ్చింది. ” వాణీ… ఏం చేస్తున్నావు…. ఉన్నపళంగా బయలుదేరి మా ఇంటికి రా..” అంది.. ఏమీటే సంగతి అని అన్నా కూడా ఏం చెప్పలేదు. ఇక చేసేదేం […]

గ్రహణం వదిలింది

రచన: గిరిజ కలవల సాయంత్రం ఐదు కావస్తోంది. రాధ ఆఫీసు పని ముగించి టేబుల్ సర్దేసింది. “ఏంటో.. మేడమ్ గారు అప్పుడే బయలుదేరిపోతున్నట్లున్నారే.. ఏమన్నా విశేషమా ఈ రోజు..” వెనక నుండి సూపరిడెంట్ భూషణం వ్యంగ్యంగా అన్నాడు. “అవును.. సార్… రేపు మా అమ్మాయి పుట్టినరోజు.. డ్రస్ కొనుక్కుని వెళ్ళాలి. పెండింగ్ వర్క్ అంతా అయిపోయింది. అందుకనే వెడుతున్నాను.”అంది రాధ. “డిసైడైపోయారుగా.. అలాగే కానీండి. . పుట్టినరోజు.. పార్టీ లు అంటారేమో.. ఈ వంకతో రేపు సెలవంటారేమో […]