March 28, 2024

గిలకమ్మ కతలు – గిలకమ్మ పందేరం. ఆహా..! ఏమి యవ్వారం.

రచన: కన్నెగంటి అనసూయ యేగోరింట్లో పిల్లోడ్ని పెళ్ళి కొడుకుని సేత్నారంటే అయ్యాల తెల్లారగట్తే లేసి పన్జేసుకుంది సరోజ్ని. మల్లీ ఎండెక్కితే కుదరదని పిల్లలు నిదళ్ళు లేత్తాకి ముందే తలిప్పి సిక్కుల్లేకుండా దువ్వెన్తో దువ్వి..తల్నిండా నూనెట్టి మరీ పైకి ముడెట్తేసి..బాగా మసిలి,మసిలీ పొగలొచ్చేసిన రాగి బిందెడు నీళ్లతో నీళ్ళోసేసుకుని ఏదో పాత సీరుంటే సుట్తబెట్టి బీరువాలోంచి పగడాల గొలుసుదీసి మెళ్ళో ఏసుకుని అద్దంలో సూసుకుంది. సూత్రాల గొలుసునీ, నల్లపూసల గొలుసుని అంతకు ముందురోజే కుంకుడుకాయల పులుసులో నానేసి మరీ […]

గిలకమ్మ కతలు – పెత్తాట్టెంక, సింతాట్టెంక

రచన: కన్నెగంటి అనసూయ “ అబ్బబ్బా..! ఈల్లు పిల్లలుగాదమ్మోయ్..పిశాసాలు. పీక్కు తినేత్తన్నార్రా..బాబోయ్ ..ఒక్కక్కళ్ళూను. ఎదవలు బడుంటేనే నయ్యిం. బళ్ళోకి పోతారు. ఇంట్లో ఉండి సంపేత్తన్నారు . పట్టుమని పది నిమిషాలన్నా..పడుకోనిత్తేనా..? ” కెవ్వుమన్న పిల్లోడేడుపుకి నిద్దట్లోంచి లేసిందేవో..మా సిరాగ్గా ఉంది సరోజ్నీకి. లేసలా మంచం మీద గూకునే సెదిరిపోయిన జుట్టుని లాగి ఏలు ముడేసుకుంటంటే.. ధడాల్న తలుపు తోసుకుంటా గది లోకొచ్చిన కొడుకు ఏడుపిని మరింత సిర్రెత్తిపోయిందేవో…సరోజ్నికి ఆ కోపంలో ఆడ్ని గభాల్న దగ్గరకి లాగి మెడలొంచి […]

గిలకమ్మ కతలు .. ఉప్పులో .. బద్ద

రచన: కన్నెగంటి అనసూయ “ఏం..కూరొండేవేటి ..వదినే..…! ” మిట్ట మజ్జానం రెండున్నరకి పిల్లలు అన్నాలు తిని బళ్ళోకి ఎల్లిపోయాకా.. తలుపుకి తాళవేసి ఆటిని జాగర్తగా జాకిట్లోకి దూరుపుతా అప్పుడే అరుగు మీద కొచ్చి కూచ్చుని తొక్క బద్దలు ఏరటానికని అక్కడే గోడకి జేరేసి ఉన్న సేటల్లోంచి ఏ సేట సేతుల్లోకి తీసుకుని పక్కనే ఉన్న కందిపప్పు బత్తాలోంచి దోసిలితో రెండో దోసిలి..కందిపప్పోసుకుంటున్న సరోజ్ని వంక సూడకుండానే సావిత్రంది ఏదోటి పలకరిచ్చాలి గాబట్టి అన్నట్టు. రోజూ మజ్జానం కందిపప్పులో […]

గిలకమ్మ కతలు.. “కణిక్కి…సింతకాయ్ ..! “

రచన: కన్నెగంటి అనసూయ “సత్తెమ్మొదినే ..ఏటంత అడావిడిగా ఎల్తన్నావ్? మొకం గూడా.. అదేదోలాగా ఉంటేనీ..! ఎక్కడికేటి…? అయినా.. నాకెంతుకులే..!” ఎదర కుచ్చిల్ల దగ్గర సీర పైకెత్తి  బొడ్లో దోపి..  కుడి సేత్తో పైట ఎగదోసుకుంటా ఎడం సేత్తో మనవరాలు సుబ్బులు  సెయ్యట్టుకుని ఈడ్సుకెల్తన్నట్టు అడావిడిగా  లాక్కెల్తన్న సత్తెమ్మ..రత్తయ్యమ్మన్న మాటలకి  అక్కడికక్కడే నిలబడిపోయి..ఎనక్కిదిరిగి  రత్తయ్యమ్మెనక్కి కుసింత ఇసుగ్గా సూత్తా…సెప్పక తప్పదన్నట్టు ..మొకవెట్టి.. ” అడిగినియ్యన్నీ  అడిగేసి..కడాకర్న నాకెంతుకులే అంటావ్. ఎప్పుడూ దీని బుద్ధింతే..ఇది మారదు..అదే ఒల్లుమండుద్ది..మల్లీ సెప్పాపోతే అదే […]