April 20, 2024

శక్తిని భక్తిని చాటే మొగ్గలు

సమీక్ష: – బోల యాదయ్య హనుమాన్ చాలీసా (మొగ్గలు) తెలుగు సాహిత్యం లోకహితమై పుట్టింది. సాహిత్యం ఏదైనా ప్రజలకు మనోధైర్యాన్ని ప్రసాదించి వారిలో చైతన్యాన్ని నింపుతుంది. ప్రపంచ సాహిత్యం మొత్తం పరిశీలన చేసి చూస్తే, ఎందరో ఆదర్శనీయమైన ఆచరణాత్మకమైన జీవితాలను మన ముందుంచారు. అవి ఆధ్యాత్మికపరమైనవి కావొచ్చు. సామాజికపరమైనవి కావొచ్చు. ఎవరు ఏమి చెప్పినా, ఏది రాసినా ధర్మం, న్యాయం, నిలబడే విధంగా ప్రజాహితమైన సాహిత్యాన్నే రాస్తారు. అది వారికి నచ్చిన, మెచ్చిన ప్రక్రియలలో రాస్తారు. కాటేగారి […]

సురవరం మొగ్గలు చిరస్మరణీయ గుర్తులు

సమీక్ష: – బోల యాదయ్య తెలుగు సాహిత్యంలో కొందరు చిరస్థాయిగా నిలిచిపోయే వారున్నారు. వారు తెలుగు భాషాభివృద్దిని , తెలుగు వైభవాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టి సాహిత్య చరిత్రలో అజరామరంగా నిలిచిపోయారు. అందులో సురవరం ప్రతాపరెడ్డి గారు ఒక్కరు. అజ్ఞానమును పారద్రోలి ఐక్యమత్యమును పెంపొందించి తెలంగాణ ప్రజలను మేల్కోల్పిన బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి. కవిగా , రచయితగా, పరిశోధకుడిగా , పత్రికసంపాదకుడిగా, భిన్న కోణాలలో తెలుగు భాషా సాంస్కృతిక సేవ చేశారు. అట్లాంటి మహనీయుని సంస్మరిస్తూ అతని […]

గాంధీ మొగ్గలు

– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ క్విట్ ఇండియా ఉద్యమంతో జాతిని ఏకం చేసి ఆంగ్లేయపాలకుల గుండెల్లో దడపుట్టించినవాడు అలుపెరుగని పోరాటానికి అసలైన స్ఫూర్తి గాంధీజీ స్వాతంత్ర్యసమరంలో ఆయుధాలనేవి పట్టకుండానే అహింసాయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టినవాడు సామాన్యులలో అసామాన్యుడిగా జీవించింది గాంధీజీ సత్యాగ్రహ మహోద్యమంతోనే సమరశంఖం పూరించి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గాండీవం భరతజాతిని ఏకంచేసి విజయం సాధించింది గాంధీజీ పరిష్కార మార్గాలకై వినూత్నపంథాను ఎంచుకునే పోరాటాలెన్నింటికో నాందీవాచకమై నిలిచినవాడు ఆధునిక శాంతియుత ఉద్యమాలకు స్ఫూర్తి గాంధీజీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో […]

కాళోజీ మొగ్గలు

రచన: డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ తెలంగాణ మాటలను తూటాలుగా పేలుస్తూ అవినీతిపై అక్షరాయుధాలను సంధించినవాడు అధర్మంపై న్యాయపోరాటం చేసినవాడు కాళోజీ కవితలతో నిరంతరం అక్షరయుద్ధం చేస్తూనే ప్రజలను కవితాశక్తితో చైతన్యవంతం చేసినవాడు నడుస్తున్న చరిత్రకు సాక్షీభూతం కాళోజీ నా గొడవ అణిచివేతలను అన్యాయాలను సదా నిరసించి సామాజిక మార్పుకోసం పాటుపడినవాడు సమాజ ప్రగతికోరిన అభ్యుదయవాది కాళోజీ సామాన్యుల ఆక్రందనలకు తిరుగులేని గొంతుకై ఆపన్నహస్తంలా వారిని ఆలింగనం చేసుకున్నవాడు సామాన్యప్రజలకు ఉద్యమగొంతుకైనవాడు కాళోజీ నిజాం వ్యతిరేక పోరాటంలో ముందుకు […]

గజల్

రచన: డా. భీంపల్లి శ్రీకాంత వెల్లువలా ఉప్పొంగే కడలి అలలదెంతా ఆరాటం ఉవ్వెత్తున ఎగిసిపడే జలపాతాలదెంతా ఆరాటం మంటలై ఎగిసిపడే అగ్గిరవ్వలను చూస్తుంటే చలిని పోగొట్టే వేడిదనపువాడిదెంతా ఆరాటం అజ్ఞానాన్ని తరిమేసే జ్ఞానజ్యోతులను చూస్తుంటే చీకటిని పారదోలే వెలుగుకిరణాలదెంతా ఆరాటం ఆటుపోట్ల అలజడులు జీవితాలను కమ్ముకుంటే నిత్యగాయాలను చెరిపేసే కాలానిదెంతా ఆరాటం హృదయాన్ని సాంత్వనపరిచే కన్నీటిని చూస్తుంటే దిగులును పోగొట్టే మనిషి గుండెదెంతా ఆరాటం తూర్పున ఉదయించే సూర్యోదయాన్ని చూస్తుంటే అంధకారాన్ని పోగొట్టే ఉషాకిరణాలదెంతా ఆరాటం కట్టతెగి […]

*మొగ్గలు*

  రచన:   – డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్   చీకటిలోకి ప్రయాణం చేస్తూనే ఉంటాను వెలుగుచుక్కలను వెతికివెతికి ముద్దాడాలని కిరణాలు వెలుతురు చినుకులు   దుఃఖాలను దిగమింగుతూనే బతుకుతుంటాను జీవనసమరంలో ఆటుపోట్లు సహజాతిసహజమని సుఖదుఃఖాలు జీవితంలో ఆలుమొగులు   కష్టాలతోనే జీవననౌకను నడుపుతుంటాను ఆనందాల తీరాన్ని సునాయాసంగా చేరాలని ఆనందాలు కౌగిట్లో వాలే పక్షులు   పూలను చూసి గర్వంగా మురిసిపోతుంటాను స్వేచ్ఛగా నవ్వుతూ పరిమళాన్ని పంచుతాయని పూలు మనసుకు హాయినిచ్చే మలయమారుతాలు   తొలకరి చినుకులకు […]