March 29, 2024

లోకులు

రచన: తంగిరాల.మీరాసుబ్రహ్మణ్యం “ఏమైంది సరళా! పొద్దున్న హడావిడిగా బయలుదేరి వెళ్ళావు. ముఖం వడలిపోయి నీరసంగా కనబడుతున్నావు.” మూడువందల పదో నంబరు ఇంటి ఇల్లాలిని పలుకరించింది అదే అంతస్థులో మూడువందల అయిదులో వుంటున్న కావేరి. “ఇదే అంతస్థులో లిఫ్ట్ పక్కన వున్న ఇంట్లో పదేళ్ళు వుండి, స్వంత ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయిన కమల వాళ్ళింటికి వెళ్ళి వస్తున్నా. పాపం. చిన్న వయసులోనే ఘోరం జరిగిపోయింది. పచ్చగా వున్న దంపతులను చూసి ఆ దేవుడికి కన్ను కుట్టిందేమో. నలభై అయిదేళ్ళకే […]

బందీలైన బాంధవ్యాలు

రచన: డా. కె. మీరాబాయి కూరగాయలు, ఇంటికి కావలసిన సరుకులు కొనుక్కుని ఇంటి దారి పట్టిన రమణకు పిచ్చికోపం వచ్చింది. రెండు చేతుల్లో నిండుగా ఉన్న సంచీలు మోస్తూ నడవడం వలన ఆయాసం వస్తోంది. వూపిరి ఆడకుండా చేస్తూ ముక్కును నోటిని కప్పిన మాస్క్ ఒకటి. చెమటకో ఏమో ముక్కు మీద దురద పెడుతోంది. మాస్క్ పీకి పారేసి గోక్కొవాలని వుంది. కానీ భయం. చుట్టూ జనం వున్నారు. ఎక్కడినుండి వచ్చి మీద పడుతుందో కరోనా భూతం […]

టాన్యా! ఐ లవ్ యు

డా. తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం కారు మెల్బొర్న్ పట్టణం దాటి జీలాంగ్ అనే ఊరి మీద రయ్యిమని దూసుకు పోతోంది. అల్లుడు కారు నడుపుతుంటే పక్కన కూర్చుని బాక్ సీట్ డ్రైవింగ్ చేస్తోంది నా కూతురు. ‘ కాస్త స్పీడ్ తగ్గించు, జాగ్రత్త రెడ్ లైట్ వస్తోంది, పదినిముషాల్లో లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి ‘అంటూ. ఆస్ట్రేలియా అనగానే ముందుగా స్ఫురించేది సిడ్నీ, మెల్బొర్న్ పట్టణాల పేర్లే. మెల్బొర్న్ డౌన్ టౌన్ కి వెడితే తప్ప హడావిడీ, జనం కనబడరు. […]

ఆదిగురువు

రచన: డా. తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం “ఇదిగో విశాలా మాట” రాధమ్మ పిలుపు విని విసుగ్గా ముఖం చిట్లించి ఆమె దగ్గరకు వచ్చింది రెండో కోడలు విశాల. “చక్రపొంగలిలో పచ్చ కర్పూరం వేయడం మరచి పోవద్దని వంటాయనకు చెప్పు. ” గుర్తు చేసిందామె. ” వాళ్ళకు తెలియదా ఏమిటి? మనం ప్రత్యేకం చెప్పాలా? ” అనేసి పట్టు చీర రెప రెప లాడించుకుంటూ వెళ్ళిపోయింది విశాల. ఆమె చేతికి వున్న అరడజను బంగారు గాజులు మట్టి గాజులతో కలిసి […]

రాములమ్మ- బంగారు కమ్మలు

రచన: డా. కె. మీరాబాయి నేను కాలేజీ నుండి వచ్చేసరికి అలవాటుగా మా ఇంటి గుమ్మం ముందు కూర్చుని ఎదురు చూస్తోంది రాములమ్మ. గేటు తాళం తీసి లోపలికి రాగానే కొబ్బరి పొరక చేతపట్టి ఇంటి ముందున్న కడప బండల మీద రాలిన సుంకేసుల చెట్టు ఆకులు వూడవడం మొదలు పెట్టింది. ” వచ్చి ఎంత సేపు అయ్యింది రాములమ్మా? అందరింట్లో పని అయిపోయిందా? ” ముందు గదికి వేసిన తాళం తీస్తూ యథాలాపంగా అడిగాను. ” […]

అల

డా.తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం ” అమ్మా! కమల ఆంటీ సిల్వర్ జుబిలీ పెళ్ళిరోజు వేడుకకి నాన్న వస్తున్నారా ” తను వేసుకున్న గులాబి రంగు గాగ్రా చోళీ ఒంటిమీద సరిగ్గా అమిరిందా అని అద్దం ముందు నిలబడి చూసుకుంటున్న అనుపమ అద్దంలో నుండే అమ్మను చూస్తూ అడిగింది. ” నాకెలా తెలుస్తుంది? నేను నా తమ్ముడి ఇంట్లో వున్నాను. మీ నాన్న ఎక్కడో తన ఇంట్లో వున్నాడు. పైగా కమల నాతో బాటు పనిచేస్తున్న నా స్నేహితురాలు. మీ […]