April 18, 2024

సుందరము సుమధురము –12

రచన: నండూరి సుందరీ నాగమణి ‘దేవదాసు’ ఒక అద్భుతమైన క్లాసిక్ మూవీ… కానీ విషాదాంతం. అయినా అఖిలాంధ్ర ప్రేక్షకుల మనసులను చూరగొన్న ఒక ప్రేమకావ్యం ఇది. ప్రఖ్యాత బెంగాలీ రచయిత శ్రీ శరత్ చంద్ర ఛటోపాధ్యాయ రచించిన ‘దేవదాసు’ నవలకు చిత్రరూపం ఇది. ఈ నవలను ఆయన 1917 లో రచించారు. ఆనాటి బెంగాల్ సమాజ స్థితిగతులకు, కులపట్టింపులకు అద్దం పడుతుంది ఈ నవల. ఈ నవలను తెలుగులో 1953 లో ఒకసారి, 1974 లో విజయనిర్మల […]

సుందరము – సుమధురము – 11

రచన: నండూరి సుందరీ నాగమణి సుందరము సుమధురము ఈ గీతం: ‘మయూరి’ చిత్రంలోని ‘అందెలు పిలిచిన అలికిడిలో’ అనే గీతాన్ని గురించి ఈ సంచికలో ముచ్చటించుకుందాము. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై, శ్రీ రామోజీరావు గారు నిర్మాతగా 1984 లో విడుదల అయిన ఈ చిత్రానికి, దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రకథ, ఈ చిత్రంలో నాయిక పాత్ర పోషించిన సుధాచంద్రన్ గారి నిజజీవిత గాథ. కథానాయిక మయూరికి చిన్నతనం నుండీ నృత్యం […]

ఆచార్య సర్వత్ర పూజ్యతే

రచన: నండూరి సుందరీ నాగమణి “వంటయింది… భోజనానికి రండి…” పిలిచింది విశాలాక్షి. “వస్తున్నాను విశాలా… వడ్డించు… ఇదిగో… ఈ శార్దూలాన్ని సవరించి వచ్చేస్తాను…” అల్లిన పద్యాన్ని పుస్తకంలో వ్రాసుకుని, మరోసారి చదువుకుని, తృప్తిగా తలపంకించాడు విశ్వనాథం. కంచంలో అన్నం, ఆవకాయ, బెండకాయ వేపుడు, ముద్ద పప్పు, వడియాలు, పక్కనే వేడి వేడి చారు గిన్నె అన్నీ చక్కగా బల్లపై అమర్చింది విశాల. మోకాళ్ళ నొప్పుల వలన కింద కూర్చుని తినలేరు ఇద్దరూ… “అబ్బాయిలు ఫోన్లు చేయటమే మానేసారు […]

సుందరము సుమధురము – 10

రచన: నండూరి సుందరీ నాగమణి మనకెంతో నచ్చేది పాత చిత్రాల్లోని సంగీతం. ముఖ్యంగా ఆనాటి పాటలు ఎంతో మంచి భావాలతో, మధురమైన రాగాలలో కూర్చబడి, మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని చేకూర్చుతాయని అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేనేలేదు. అప్పటి చిత్రాలలో ఏదో ఒక స్టేజి డ్రామా రూపంలోనో, వీధి భాగోతంగానో కొన్ని పాటలు ఉండేవి. వాటిల్లో ఎన్నో నీతిసూత్రాలు, సమాజానికి అవసరమైన మేలైన సందేశాలను వ్రాసి, మంచి బాణీలు కూర్చి, మన మధుర గాయనీగాయకుల చేత పాడించి, చక్కని […]

సుందరము – సుమధురము – 9

రచన: నండూరి సుందరీ నాగమణి మనసుకు ఎంతో ఆహ్లాన్నిచ్చేది సంగీతం. శాస్త్రీయ సంగీతంలోని రాగాలన్నీ కూడా వినటానికి, అనటానికి (పాడుకోవటానికి) ఎంతో హాయిగా ఉండి, ప్రేక్షక శ్రోతల హృదయాలనే కాక, గాయనీగాయకుల మానసాలకు కూడా ఎంతో సాంత్వనాన్ని కలిగిస్తాయనటంలో సందేహమేమీ లేదు. కొన్ని రాగాలలో సమకూర్చిన చిత్రగీతాలు ఎంతో మనోహరంగా ఉండి, శ్రోతల మనసులకు హాయిని కలిగిస్తాయి. అలాంటి రాగాలలో చిత్రాలలో ఎక్కువగా ఉపయోగించినవి హిందోళ, మోహన రాగాలు. రెండూ ఔడవ రాగాలే. అంటే సప్తస్వరాలు ఉండవు. […]

సుందరము సుమధురము – 8

రచన: నండూరి సుందరీ నాగమణి సుందరము, సుమధురము ఈ గీతం: ఈ సంచికలో ఒక చక్కని ధర్మాన్ని ప్రబోధించే ఒక గీతాన్ని గురించి వ్రాయాలని అనుకున్నాను. ఆ గీతమే, ‘రుద్రవీణ’ చిత్రంలోని ‘తరలి రాదా తనే వసంతం… తన దరికి రాని వనాల కోసం…’ అనే సిరివెన్నెల విరచితం. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై, 1988 మార్చి 4న విడుదలైన ఈ చిత్రానికి, శ్రీ కె బాలచందర్ దర్శకత్వం వహించారు. మాటలు గణేశ్ పాత్రోగారు వ్రాయగా, పాటలన్నీ శ్రీ […]

సుందరము సుమధురము – 7, (ఆదిభిక్షువు వాడినేది కోరేది?)

రచన: నండూరి సుందరీ నాగమణి సుందరము సుమధురము ఈ గీతం: ‘ఆదిభిక్షువు వాడినేది కోరేది? బూడిదిచ్చే వాడినేది అడిగేది?’ ఈ పాటను గురించి కొంతమంది వివరణ అడిగారు. అందుకని ఈ నెల సుమధుర గీతంగా ఈ పాట గురించి వ్రాస్తున్నాను. ఒక భక్తుడు ఆ మహాదేవుడైన శివుడిని ఇలా స్తుతిస్తున్నాడు. ఈ ప్రక్రియను ‘నిందాస్తుతి’ అని అంటారు. పైకి నిందిస్తున్నట్టు, ఆక్షేపిస్తున్నట్టు అనిపించినా, లోలోపల శ్లాఘిస్తున్న భావం వస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు అలవోకగా వ్రాసేసారు. మరి భావాన్ని […]

సుందరము సుమధురము

రచన: – నండూరి సుందరీ నాగమణి సుందరము సుమధురము ఈ గీతం: మొన్ననే స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నాం కదండీ, ఈ నేపథ్యంలో వెలుగునీడలు చిత్రంలోని ‘పాడవోయి భారతీయుడా!” అనే గీతాన్ని గురించి ఈ నెల వివరించాలని అనుకుంటున్నాను. అన్నపూర్ణా పిక్చర్స్ వారి పతాకంపై, 1961 జనవరి 7న విడుదలైన ఈ చిత్రానికి, శ్రీ ఆదుర్తి సుబ్బారావుగారు దర్శకత్వం వహించారు. మాటలు ఆత్రేయగారు వ్రాయగా, పాటలు శ్రీశ్రీగారు, కొసరాజుగారు వ్రాసారు. శ్రీ పెండ్యాల నాగేశ్వరరావుగారు సంగీతాన్ని అందించారు. శ్రీయుతులు […]

సుందరము – సుమధురము – 4

రచన: నండూరి సుందరీ నాగమణి సుందరము సుమధురము ఈ గీతం: ‘రంగుల రాట్నం’ చిత్రంలోని ‘కలిమి నిలవదు లేమి మిగలదు’ అనే గీతాన్ని గురించి ఈ నెల వివరించాలని అనుకుంటున్నాను. వాహినీ పిక్చర్స్ వారి పతాకంపై, 1966లో విడుదలైన ఈ చిత్రానికి, బి.యన్. రెడ్డి గారు దర్శకత్వం వహించారు. అంజలీదేవి, రామ్మోహన్, వాణిశ్రీ, విజయనిర్మల, త్యాగరాజు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ద్వారానే చంద్రమోహన్ గారు పరిచయమయారు. వారి తొలి చిత్రం ఇది. హిందీ నటి […]

సుందరము – సుమధురము – 3

రచన: నండూరి సుందరీ నాగమణి సుందరము సుమధురము ఈ గీతం: ‘వాగ్దానం’ చిత్రంలోని ‘నా కంటి పాపలో నిలిచిపోరా…’ అనే గీతాన్ని గురించి ఈ నెల వివరించాలని అనుకుంటున్నాను. కవితాచిత్ర వారి పతాకంపై, 1961 అక్టోబరు 5న విడుదలైన ఈ చిత్రానికి, ఆచార్య ఆత్రేయ గారు దర్శకత్వం వహించారు. శ్రీ కె. సత్యనారాయణ మరియు శ్రీ డి. శ్రీరామమూర్తి గారాలు చిత్రనిర్మాతలు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి గారలు నాయికానాయకులుగా నటించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు చాలా […]