April 23, 2024

అతనెవడు?

రచన: పారనంది శాంతకుమారి అందంగా నువ్వు పెట్టుకున్నబొట్టును అర్ధాంతరంగా తుడిచివేయ మనటానికి అతనెవడు? అలంకరణకై నువ్వు తొడుక్కున్నగాజులను ఆ క్షణంనుంచి పగలగొట్టటానికి అతనెవడు? పెళ్ళిలోకట్టిన మంగళసూత్రాన్ని పెడమార్గంలో త్రెంచివేయటానికి అతనెవడు? అర్ధంలేని ఆచారాలను అతివపై బలవంతంగా రుద్దటానికి అతనెవడు? మగవాని మోదానికి మూలమైన మగువను మూల కూర్చోమనటానికి అతనెవడు? స్త్రీ ఆహారంపై,ఆహార్యంపై అతిశయంతో ఆంక్షలు పెట్టటానికి అతనెవడు? పడతి పద్దతిపై,ఉద్ధతిపై కరుణలేని కాంక్షలు తెలియచేయటానికి అతనెవడు? వనిత విధానాలపై అతనికున్న హక్కేమిటి? నెలత నినాదాలపై అతనికున్న టెక్కేమిటి? […]

విలువ

రచన: పారనంది శాంతకుమారి   నెగిటివ్ ఆలోచన వల్లే పాజిటివ్ ఆలోచనకు విలువ అమావాశ్యవల్లే పౌర్ణమికి విలువ. వేదనవల్లే వేడుకకు విలువ. మరుపువల్లే జ్ఞాపకానికి విలువ. రాత్రి వల్లే పగటికి విలువ. గరళం వల్లే సుధకు విలువ. ఓటమి వల్లే గెలుపుకు విలువ. పోకవల్లే రాకకు విలువ. అబద్ధం వల్లే నిజానికి విలువ. చెడువల్లే మంచికి విలువ. మృగతత్వం వల్లే మానవత్వానికి విలువ. ఒంటరితనంవల్లే జంటతనంకు విలువ. దు:ఖంవల్లే సుఖానికి విలువ. వేసవివల్లే వెన్నెలకు విలువ. కఠినత్వంవల్లే […]