March 28, 2024

మనసున సుగంధం నింపిన అక్షరపూదోట

సమీక్ష: సి. ఉమాదేవి పోలాప్రగడ రాజ్యలక్ష్మిగారు జగమెరిగిన రచయిత్రి. వారి సాహితీప్రస్థానంలో బహుమతులు, బిరుదులు, పురస్కారాలు అనేకం అందుకున్న రచయిత్రి. సాహితీబాటలో వారందుకున్న సన్మానాలకు తప్పక అభినందించాలి. వీరి కథలలో అంతర్లీనంగా ప్రవహించే సామాజికాంశాలు కుటుంబసభ్యులకు బాధ్యతలను, విలువలను, బంధాలను గుర్తుచేస్తాయి. వీరి అక్షరనావలో పన్నెండు నవలలు, ఆరు కథాసంపుటాలు నిక్షిప్తం గావించబడ్డాయి. వీరి రచనలపై పి. హెచ్. డి, ఎమ్. ఫిల్ పరిశోధనలు చేసిన వారున్నారు. లోపాముద్ర బిరుదు, రమ్యకథారచయిత్రి బిరుదులు వీరందుకున్నారు. బెజవాడ గోపాలరెడ్డిగారు […]