March 28, 2024

ధృతి పార్ట్ – 12

రచన: మణి గోవిందరాజుల కాలేజీ వార్షికోత్సవ వేడుకలు దగ్గరికొస్తున్నాయి. ఇదే ఇక ఆఖరు సంవత్సరం అని ధృతి కూడా అన్నిట్లో ఉత్సాహంగా పేరు ఇచ్చింది. క్లాస్మేట్స్ అందరూ కూడా ఫస్ట్ ఇయర్ చేసిన డ్యాన్సే మళ్లీ చేయమని వెంటపడ్డారు. కాని ధృతికి అందరికీ గుర్తుండిపోయేలా ఏదైనా మంచి ప్రదర్శన ఇవ్వాలని ఉన్నది. ఎప్పటిలానే స్పోర్ట్స్ ఒక రోజు, మధ్యలో ఒక రోజు రెస్ట్ ఇచ్చి కల్చరల్ ఆక్టివిటీస్. కాలేజీ మొత్తం వెల్ నోటెడ్ అయిన ధృతికి ఇది […]

ధృతి – 11

రచన: మణికుమారి గోవిందరాజుల స్వాతీ… చెప్తే అర్థం చేసుకో… ఆ అమ్మాయి చాలా తెలివితేటలు కలది. అదే కాక మనవాడికి తగినజోడి అవుతుంది కూడాను” అప్పటికి చాలా సేపటినుండి నచ్చ చెప్తున్నాడు శేఖరం. “అంత మాత్రం జోడీ మనవాడికి ఎలానూ దొరుకుతుంది. ఇలా చిన్నపిల్లను ఒప్పుకుని వయసొచ్చేదాకా ఎదురు చూడక్కరలేదు. ఎట్టి పరిస్తితుల్లోనూ నేను ఒప్పుకోను” ఖరాకండిగా చెప్పింది స్వాతి. “ఇప్పుడు నీకు అర్థం కావటం లేదు. ఆ అమ్మాయి మన కాలేజ్ లో మూడేళ్ళుగా టాపర్ […]

ధృతి – 4

రచన: మణికుమారి గోవిందరాజుల “రండి! రండి… అత్తయ్యగారూ!” కారు దిగుతున్న అత్తగారికి ఎదురెళ్ళి ఆహ్వానించింది పూర్ణ. కారు దిగుతూ కోడల్ని నిండుగా చూసుకుంది రంగనాయకమ్మ. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే కోడలంటే చాలా ఇష్టం రంగనాయకమ్మకి. కారు దిగిన అత్తగారి కాళ్ళకు దండం పెట్టింది. “ఇప్పుడెందుకే ఈ దండాలూ” అంటునే మనసారా “దీర్ఘ సుమంగళీ భవ” అని దీవించింది. “పిల్లలేరే” ఎక్కడా పిల్లల జాడ కనపడక అడిగింది. “ఏమో అత్తయ్యా! ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. ఎక్కడికెళ్ళారో… ఏంటో” పూర్ణ […]

మార్నింగ్ వాక్

రచన: మణికుమారి గోవిందరాజుల “రేపటినుండి యేమైనా సరే వాకింగ్ కి వెళ్ళాల్సిందే. ” అద్దంలో ముందుకూ వెనక్కూ చూసుకుంటూ అనుకుంది . “కానీ మరీ లావణ్య వర్ణించినంత లావుగా యేమీ లేనే?” మళ్ళీ చూసుకుంది . యేమోలే చూసేవాళ్ళకు లావుగా కనపడుతున్నానేమో. . అయినా అయ్యో అయ్యో యెంత మాట అనేసింది దొంగమొహం. వారం క్రితం ఇంట్లోకి వస్తూనే అన్నది కదా “ఒసే రేఖా! పేరుకి తగ్గట్లు రేఖలా వుండేదానివల్లా సున్నాలా అవుతున్నావే” అని దానికి శ్రీవారి […]