April 24, 2024

విశ్వనాథ వారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు

రచన: రాజన్   ఒక జాతి గొప్పదనం ఆ జాతి యొక్క భాష, ఆచారవ్యవహారముల వల్లనూ, ఆ జాతిలో పుట్టిన మహాత్ముల వల్లనూ, ఆ జాతికి సంబంధించిన సార్వజనీన గ్రంధముల వల్లనూ విలసిల్లుతూ ఉంటుంది. జ్ఞానవైరాగ్యముల పుట్టినిల్లయిన భారతావనిలో భాషాపరంగా జాతులను చూడగోరితే అందులో తెలుగు జాతికి ఒక విలక్షణమైన స్థానమున్నది. సంస్కృతం తరువాత అందునుండే పుట్టిన భాషలలో అత్యంత సంస్కరింపబడిన భాష తెలుగు భాష. మనకు అమ్మమ్మ సంస్కృతమైతే, తెలుగు అమ్మ; అమ్మమ్మ సంతానంలోకెల్లా మన […]

సరదాకో అబద్దం

రచన: రాజన్ ప్రపంచం లో ఎక్కువ శాతం మంది ఆడేది, ఆడేకొద్దీ ఆడాలనిపించేది …….అబద్దం. నాటి ధర్మరాజు దగ్గర నుండి నేటి రాజకీయనాయకుల వరకు అందరూ ఈ ఆటలో నిష్ణాతులే. ఆ మాటకొస్తే వారే ఏమిటిలెండి.. మీరు, నేను కూడా చిన్నవో, పెద్దవో అబద్దాలు చెప్పే వాళ్ళమే. మనం ఆడిన అబద్ధాన్ని నమ్మితే అవతలి వాడు, నమ్మకపొతే మనం ఓడిపోతాం. ఎవరో ఒకరే గెలిచే అవకాశం ఉంది కాబట్టే అబద్దాన్ని ఆడటం అంటారనుకుంటా. మానవ జీవితం నుండి […]

నా శివుడు

రచన: రాజన్ దిక్కుల చిక్కుల జటాజూటము అందులొ హరిసుత నిత్యనర్తనము కొప్పున దూరిన బాలచంద్రుడు జటగానుండిన వీరభద్రుడు . గణపతి ఆడగ నెక్కిన భుజములు మాత పార్వతిని చేపట్టిన కరములు స్కందుడు కూర్చొను ఊరువు నెలవులు సకల దేవతలు మ్రొక్కెడు పదములు . అజ్ఞానాంతపు ఫాలనేత్రము శుభాలనిచ్చే మెరుపు హాసము ఘోరవిషమును మింగిన గ్రీవము సర్వలోక ఆవాసపు ఉదరము . మదమను గజముకు చర్మము ఒలిచి ఒంటికి చుట్టిన తోలు వసనము మృత్యుంజయుడను తత్వము తెలుపు మెడలో […]

భగవంతునికి లేఖ… భగవంతుడి సమాధానం

రచన: రాజన్ సకల చరాచర సృష్టికర్త, ధర్మసంస్థాపకుడు అయిన భగవంతునికి, జీవకోటిలొ శ్రేష్టుడు అయిన ‘నేను’ సందేహ నివృత్తికై వ్రాయుచున్న లేఖ. భగవాన్! కళ్ళకు కనపడని నీవు ఎక్కడున్నావని అడిగితే.. గుళ్ళో ఉన్నావని కొందరు, భక్తుల గుండెల్లో ఉన్నావని మరికొందరు అంటున్నారు. సంతృప్తి చెందని నేను…స్వాములను, పండితులను దర్శించి ప్రశ్నిస్తే..నువ్వు నాలోనే ఉన్నావని, నేను చూడగలిగే వాళ్ళందరిలో ఉన్నావని, అసలు మేమంతా నీలోనే ఉన్నామని జ్ఞానోపదేశం చేసారు. కానీ.. ఒకప్పటి అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తూ భౌతిక జీవన […]

భగవంతుల రహస్య సమావేశం

రచన: రాజన్ పి.టి.ఎస్.కె సర్వాంతర్యామి, దేవదేవుడైన శ్రీమహావిష్ణువు దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. ఆయన వదనంలో నిత్యం నాట్యం చేసే చిరునవ్వు ఎందుకో ఈ రోజు అలిగినట్టుంది. ఆయన గంభీర వదనాన్ని చూసి భయపడ్డ పాలసముద్రపు కెరటాలు కూడా మెల్లిగా ఆడుకుంటున్నాయి. ఆదిశేషుడు తను కొట్టే చిన్నిపాటి బుసలను కూడా మాని నిర్లిప్తంగా చూస్తున్నాడు. విష్ణు పాదాలు ఒత్తుతున్న జగన్మాతకు మాత్రం ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. ఎన్నడూ లేనిది స్వామి ఇలా వ్యాకులం గా కనిపించడంతో అమ్మవారు ఉండబట్టలేక… […]