April 23, 2024

తపస్సు – కొన్ని ఖడ్గ ప్రహారాలు.. కొన్ని శిథిల శబ్దాలు

రచన: రామా చంద్రమౌళి గాయపడ్డ గాలి రెక్కలను చాచి వృక్షం నుంచి వృక్షానికి పునర్యానిస్తూ , స్ప్సర్శిస్తూ, సంభాషిస్తూ ఒళ్ళు విరుచుకుంటున్న ఆకాశంలోకి అభిక్రమిస్తున్నపుడు కాలమేమో మనుషుల కన్నీళ్ళను తుడుస్తూ తల్లిలా ద్రవకాలమై, ద్రవధ్వనై, ద్రవాత్మయి, చినుకులు చినుకులుగా సంగీత నక్షత్రాలను వర్షిస్తూ అరణ్యాలపై, ఎడారులపై, సముద్రాలపై, పాటలను కురుస్తూ వెళ్తూంటుంది.. తన కొంగు అంచులు జీరాడుతూండగా సెకన్‌లో మిలియన్‌ వంతు ఒక రసానుభూతి.. తన పూర్ణవెన్నెల రాత్రయి వికసిస్తూనే చకచకా శతాబ్దాల చరిత్ర పుటల్లోనుండి పాదముద్రలనూ, […]