April 25, 2024

లోవరాజు కధలు – సూర్రావు లెక్కల పుస్తకం

రచన: రవీంద్ర కంభంపాటి తిరిగి ఊరెళ్లిపోవాల్సిన రోజొచ్చేసింది. ఏంటో నిన్న గాక మొన్నొచ్చినట్టు ఉంది. అప్పుడే వెళ్ళిపోతున్నావా అని మా అమ్మ ఒకటే గొడవ. ‘సరేలే. నువ్విలా ఏడుపు మొహం పెట్టేవంటే. ఇంకెప్పుడూ రానని’ తనతో అంటూంటే, లోవరాజుగాడొచ్చేసేడు. కారేసుకుని ! స్టేషన్ దాకా దింపడానికి కారెందుకని అడిగితే, డిక్కీ తీసి చూపించేడు. ఓ పెద్ద క్యాను నిండా ఆవు నెయ్యి, తేగల కట్టలు, సంచీడు మొక్కజొన్నపొత్తులూ, ఓ పెద్ద కరకజ్జం ప్యాకెట్టు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. […]