April 20, 2024

దానశీలత

రచన: సి. హెచ్. ప్రతాప్ దానంలో కర్ణుడి ఖ్యాతి జగద్విఖ్యాతం. నభూతో నభవిష్యతి అన్న చందాన అతని దాన ప్రస్థానం సాగింది. జన్మత: సహజ కవచకుండాలతో జన్మించిన కర్ణుడి వల్ల తన కుమారుడు అర్జునుడికి ఎప్పటికైనా ముప్పు తప్పదని గ్రహించిన ఇంద్రుడు ఒక కపట ఉపాయం ఆలోచించి పేద బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కవచకుండలాలను దానంగా కోరాడు. ఇలాంటి మోసమేదో జరుగుతుందని ముందుగానే ఊహించిన సూర్యుడు. . దేవేంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ కవచకుండలాలు ఇవ్వమని […]

చిత్రగుప్తుడు

రచన: శ్యామసుందరరావు యమగోల యమలీల లాంటి హిందూ దేవుళ్లను కించపరిచే సినిమాల పుణ్యమా అని పురాణాల్లోని ఉదాత్తమైన పాత్ర చిత్రగుప్తుడు ఒక హాస్య పాత్రగా మన మనస్సుల్లో ముద్ర పడింది నిజానికి చిత్రగుప్తుడు బ్రహ్మ యొక్క పదిహేడు మంది మానసపుత్రులలో ఒకడు. యమధర్మరాజుకు ధర్మ నిర్వహణలో సహాయకుడిగా ఉంటూ భూలోకవాసుల మరణానంతరము వారి పాప పుణ్యాల అనుగుణముగా వారికి న్యాయ బద్ధముగా ఏ విధమైన పక్షపాత ధోరణి లేకుండా శిక్షలు నిర్ణయించటంలో యమధర్మ రాజుకు సహకరించే వ్యక్తి […]

అంగారపర్ణుడు

రచన: శ్యామసుందర రావు మహా భారతములో ఆదిపర్వంలో ఈ అంగారపర్ణుడి కద వస్తుంది. వారణావతములోని లక్క గృహము దహనము నుండి బయటపడ్డ పాండవులు కుంతీ, విదురుని సలహా మేరకు కొంత కాలము ఏకచక్రపురంలో బ్రాహ్మణ బ్రహ్మచారులుగా రహస్య జీవనము సాగిస్తూ, బకాసురిని వధ తరువాత బ్రాహ్మణుడు ఇచ్చిన సమాచారంతో పాంచాల రాజ్యానికి ద్రౌపది స్వయంవరానికి బయలు దేరుతారు. ఆ సమయములో వారు గంగానది ఒడ్డున గల అరణ్యము గుండా ప్రయాణిస్తున్నప్పుడు, వారి అడుగుల సవ్వడి విన్న అంగారపర్ణుడు […]

మునికుల చూడామణి “కణ్వ మహర్షి”

రచన: శ్యామ సుందరరావు కణ్వుడు కశ్య ప్రజాపతి వారసుడైన అంగీరసుని వంశంలో ఘోరుడు అనే ఋషికి జన్మించాడు ఈయనను “మునికుల చూడామణి”అని అంటారు అంటే మునులలోకెల్లా శ్రేష్ఠుడు అని అర్ధం. ఈయన బాల్యము నుండి తపోనిష్ఠలో ఉండి బ్రహ్మచారిగా ఉండిపోయాడు కణ్వుడు మహా నిష్ఠాగరిష్ఠుడు. గొప్ప తపస్సంపన్నుడు అతను మన వేదాలలో పెక్కు మంత్రాలకు ద్రష్టగా నిలిచారన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూ లేదు. రుగ్వేదంలో కణ్వుడి పేరిట చాలా మంత్రాలే ఉన్నాయి. కణ్వుడు, అతని వంశజులు […]

వేదకర్త “జమదగ్నిమహర్షి”

రచన: శ్యామ సుందరరావు భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి వివాహము చేసుకోవాలనే తలంపుతో కుశ వంశానికి చెందిన గాది మహారాజు దగ్గరకు వెళ్లి అయన కూతురు సత్యవతిని ఇచ్చి వివాహము చేయమని అడుగుతాడు రాజు. నున్నటి శరీరము, నల్లటి చెవులు ఉండే వెయ్యి ఆశ్వాలను ఇమ్మని కోరతాడు. అప్పుడు ఋచీకుడు వరుణుని ప్రార్ధించి వెయ్యి అశ్వాలను పొంది గాది మహారాజుకు ఇచ్చి సత్యవతిని పెళ్లాడుతాడు. వివాహము చేసుకున్నాక సత్యవతి తనకు ,తన తల్లికి పుత్ర […]

అత్యంత విశిష్ఠుడు వశిష్ఠ మహర్షి

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు   వశిష్ఠ మహర్షి హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి.  మహాతపస్సంపన్నుడు.  సప్త ఋషులలో వసిష్ఠ మహర్షి కూడా ఒకడు.  వేదముల ప్రకారం ఇతను మిత్ర మహర్షి, వరుణా దంపతుల కుమారుడు .  మొదట్లో బ్రహ్మ మానస పుత్రుడై ఉండి నిమి శాపము వల్ల ఆ శరీరము లేకుండా పోవడముతో మరల మిత్రావరుణులకి జన్మించాడు ఒకప్పుడు మిత్రావరుణులకు ఊర్వశిని చూచి రేతస్సు స్ఖలితము అయి అది ఒక కుంభమునందు చేర్పఁబడఁగా అందుండి […]

గరిమెళ్ల సత్యనారాయణ గారు

రచన: శారదాప్రసాద్ స్వాతంత్య్రోద్యమ కవుల్లో గరిమెళ్ల సత్యనారాయణ గారిది విశిష్టమైన స్థానం. గరిమెళ్ల గేయాలు జాతీయ వీర రసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూ గించాయి. అతను వ్రాసిన ‘మా కొద్దీ తెల్ల దొరతనం’ పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండంలోని ప్రియాగ్రహారంలో 1893 జూలై 15న జన్మించారు. బి. ఏ. డిగ్రీ పూర్తి చేశాక గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత విజయనగరం ఉన్నత […]

శ్రీ జిడ్డు కృష్ణమూర్తిగారి కొన్ని ఆలోచనలు

రచన: టీవీయస్. శాస్త్రి ఆలోచన వేరు, తెలివి వేరు-వాటి మధ్యన గల తేడాను పరిశీలించారా? ఒక అడవి మృగాన్ని చూసినప్పుడు స్వీయరక్షణ కోసం లోపలి నుండి స్వత:సిద్ధంగానే వచ్చే ప్రతిస్పందనను తెలివి అనీ, అది భయం కాదని ఇంతకు ముందు మీకు చెప్పాను. భయాన్ని పెంచి పోషించే ఆలోచన ఇందుకు పూర్తిగా విభిన్నమైనదని కూడా అన్నాను. మిత్రుల కోరికపై కొంత వివరణ ఇస్తాను. పైన చెప్పినవి రెండూ భిన్నమైనవి కదా? భయానికి జన్మనిచ్చి, పెంచి పోషించే ఆలోచనకు, […]

మహాకవి శ్రీశ్రీ ని గురించి కొందరు ప్రముఖులు

రచన: శారదాప్రసాద్   ఒక్కడే మహాకవి, అతని పేరు శ్రీశ్రీ –శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు “ఆనందం ఆర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపుటంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం. ” గిరి-అహో, ఏమిగీతం. ఎంత సొగసుగా వుంది. కవిత్వాన్ని వడబోసినట్లుందే. ఎవరయ్యా ఈ పాట రాసింది? హరి-ఈ పాట వ్రాసినతని పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. గిరి-కొత్త కవుల్లో ఇంతటి మహాకవులుంటారా? హరి-అట్టే మాట్లాడితే ఈ క్రొత్తకవుల్లో ఒక్కడే మహాకవి. అతని పేరు శ్రీశ్రీ. గిరి-అయితే శ్రీశ్రీ వంటి నవ్యకవిలో […]

ఆంధ్రపితామహుడు–శ్రీ మాడపాటి హనుమంతరావు గారు

రచన: శారదాప్రసాద్ మాడపాటి హనుమంతరావుగారు మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు, ఎవరికి, విధిప్రేరణం అనే కధలు ‘మల్లికాగుచ్చం’ పేరుతో 1911 లో పుస్తక రూపంలో వచ్చాయి. మాడపాటికి రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంధం ‘తెలంగాణా ఆంధ్రోద్యమం’. మాడపాటి హనుమంతరావుగారు బహుభాషావేత్త, సాంఘిక సంస్కర్త. వీరు 11 -11 -1970 న తెలుగు వారిని […]