April 25, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 19

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఒకరోజు అల్లరికృష్ణయ్య ఎక్కడా కనుపించడంలేదు. మళ్ళీ ఏమి తగాదాలు, గొడవలు తీసుకోస్తాడోనని హడలిపోతూ యశోదమ్మ బాలకృష్ణునికై వెదకింది. కృష్ణయ్య అలా మోచేతిపై తలవాల్చి పడుకుని వుండగా రహస్యంగా తల్లి తొంగి చూచింది. నిద్రలో ఉన్నాడు నల్లనయ్య. నోరు కొంచెం తెరుచుకుని ఉంది. ఆనోట్లో సర్వలోకాలు..సూర్య చంద్రులూ, గ్రహసంతతీ కనిపించాయి. యశోదమ్మ హడలిపోయింది. అప్రయత్నంగా చేతులు జోడించి నిలబడింది. అంతలో క్రిష్ణయ్య లేవనే లేచాడు. “అమ్మా!” అన్నాడు. అన్నమయ్య ఇలాంటి జనశృతులను అధారం చేసుకొని […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 14, 15

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య. అన్నమయ్య ఎన్నో కీర్తనలలో దశావతార వర్ణన బహు చిత్ర విచిత్రంగా చేశాడు. ఈ క్రింది కీర్తనలో పదిరూపులై పలు పలు విధములుగా ధర్మాన్ని రక్షించావు అలాంటి నీకు మమ్ము రక్షించడం కష్టమా! చెప్పు పరంధామా అంటూ దశావతారాలను స్తుతిస్తున్నాడు అన్నమయ్య. చేసిన వర్ణన చేయకుండా కొత్త కొత్త రీతులలో దశావతార వర్ణన చేయడం అన్నమయ్య కే సాధ్యం. కీర్తన: పల్లవి: ఇట్టె మమ్ము రక్షించుట ఏమి దొడ్డ నీకు నేడు బట్ట బాయిటనే […]