March 29, 2024

నవరసాలు..నవకథలు.. శాంతం 6

రచన: ఉమాదేవి కల్వకోట ఇక అబద్ధాలు చెప్పకండి నాన్నా. సాయంత్రం ఆరుగంటలు దాటింది. పార్కులో చిన్నపిల్లల ఆటలూ, కేరింతలు,పెద్దవాళ్ళ కబుర్లు, ప్రేమికుల ఊసుల బాసల సందడులన్నింటికీ దూరంగా ఒక బెంచిమీద ఒంటరిగా కూర్చొని తన కొడుకు కార్తీక్ రాసిన ఉత్తరం గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నారు రామారావుగారు. ఇప్పటికే రెండుసార్లు చదివిన ఆ ఉత్తరాన్ని అప్రయత్నంగానే జేబులో నుండి తీసి మరోసారి చదవసాగారు.. నాన్నా ! ఒకే ఇంట్లో ఉంటూ మీకీ ఉత్తరం రాయడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని […]