April 24, 2024

ఒద్దిరాజు అపూర్వ సోదరులు

రచన: శారదాప్రసాద్ ‘ఒద్దిరాజు అపూర్వ సోదరులు’ గా ప్రసిద్ధులైన సీతారామచంద్రరావు, రాఘవరంగారావు గార్లు సంస్కృతాంధ్ర పండితులు మరియు ప్రచురణ కర్తలు. ఒద్దిరాజు సీతారామచంద్రరావుగారు ఒద్దిరాజు సోదరులలో పెద్దవాడు. ఒద్దిరాజు రాఘవ రంగారావుగారు ఒద్దిరాజు సోదరులలో చిన్నవాడు. వీరికి సుమారు పది భాషలలో పాండిత్యం ఉంది. వీరి తల్లిదండ్రులు వెంకట రామారావు మరియు రంగనాయకమ్మలు. వీరు వరంగల్లు మండలం మానుకోట తాలూకా, ఇనుగుర్తి గ్రామ వాస్తవ్యులు. ఈ గ్రామం నుండే వీరు తెనుగు అనే పత్రికను నడిపారు. ఈ […]

ఆదర్శ మహిళా శాస్త్రవేత్త మేరీక్యూరీ

రచన: శారదాప్రసాద్ (మేరీక్యూరీ దంపతులు) రెండు సార్లు నోబెల్‌ బహుమతి పొందిన మేరీక్యూరీ తన అద్వితీయ ప్రతిభాపాటవాలతో రేడియంను కనుగొన్న గొప్ప శాస్త్రవేత్త . రెండు శాస్త్రాల్లో నోబెల్‌ బహుమతి అందుకున్న అరుదైన ఘనత అమెకే దక్కింది. 1903 ఫిజిక్స్‌లోను, 1911లో కెమిస్ట్రీలోను నోబెల్‌ బహుమతులు పొంది సరికొత్త చరిత్రను సృష్టించింది. 1857లో ఒక బానిస దేశంగా ఉన్న పోలండ్ లో ఒక సామాస్య కుటుంబలో జన్మించింది మేరీక్యూరీ. బాల్యంలో ప్రతిభావంతమైన విద్యార్థిగా గుర్తించబడినా పేదరికం వల్ల […]

ఓషో రజనీష్

రచన: శారదా ప్రసాద్ వాత్సాయనుడికి వారసుడుగా జనం చెప్పుకునే ఓషో జిడ్డు కృష్ణమూర్తిగారి అభిమాని. బుద్ధుడి బోధల వల్ల ప్రభావితుడయ్యాడు. రజనీష్ చంద్రమోహన్ జైన్ 1960లలో ఆచార్య రజనీష్‌గా, 1970-1980లలో భగవాన్ శ్రీ రజినీష్‌ గా ఆ తరువాత ఓషోగా పిలువబడిన ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. ఇండియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా ఎన్నో దేశాలలో నివసించి ఓషో మూవ్‌మెంట్ అనే ఒక వివాదాస్పదమైన కొత్త ఆధ్యాత్మిక సంఘాన్ని తయారుచేశాడు. ఇతడు మధ్యప్రదేశ్‌ లో గల […]

జైన మతము

రచన: శారదా ప్రసాద్ క్రీ. పూ. 6వ శతాబ్దంలో భారతదేశంలో అనేక మతాలు ఆవిర్భవించాయి. వీటిలో ముఖ్యమైనవి జైనమతం, బౌద్ధమతం. ఈ రెండు మతాలు భారతదేశ సంస్కృతిని గణనీయంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా బౌద్ధం చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికీ గొప్ప ఆదరణ పొందుతోంది. జైనమతం చాలా పురాతన కాలం నుంచి ఉందని తెలుస్తోంది. ఋగ్వేద మంత్రాల్లో జైన మత స్థాపకులైన మొదటి తీర్థంకరుడైన వృషభనాథుని గురించి స్పష్టమైన ప్రస్తావన ఉంది. జైన మతంలో 24 […]