April 19, 2024

మోదుగపూలు – 2

రచన: సంధ్యా యల్లాప్రగడ ఆదిలాబాదు అంటేనే అడవులు గుర్తుకు వస్తాయి. రాష్ట్రములో అత్యంత ఎక్కువ అడవులు ఉండి, అందాలతో ఉన్న జిల్లా అది. 75శాతం పచ్చని అడవులు, జలపాతాలతో ప్రకృతి అందాలన్నీ నిలవలుగా ఉన్న జిల్లా అది. అందాలు హస్తకళలు ఉన్నా అక్షరాస్యత 63శాతంలోనే ఉంది. ఆదివాసులు, గిరిజనులు ఉన్న జిల్లా. ఉన్నత విద్య, వైద్యము, కనీస అవసరాలకు ఆదిలాబాదే క్రేంద్రము వాళ్ళకు. ఆదిలాబాదు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు. కాని అడవులకు సరిహద్దులేర్పచగలమా? మహారాష్ట్ర, నాందేడు సంస్కృతులు […]

వంటలేనా? కాసిని నవ్వులు కూడానూ

సమీక్ష: వారణాసి నాగలక్ష్మి ‘నేను వడ్డించిన రుచులు – చెప్పిన కబుర్లు’ అంటూ సంధ్య యల్లాప్రగడ గారు కబుర్లనీ వంటల్నీ కలిపి కదంబ మాలలా అందించిన పుస్తకం చదువుతుంటే పెళ్లి పందిట్లో విందు భోజనం ఆరగిస్తున్నట్టనిపించింది. మధ్యమధ్యలో ఆమె విసిరిన చెణుకులు వేడి వేడి పుణుకుల్లా కరకరలాడాయి. పుట్టింట్లో మడీ దడీ వల్ల- పెళ్లై వెళ్లేదాకా ఏ వంటా రానిస్థితి నుంచి, ఎన్నో రకాల వంటలు నేర్చుకోవడమే కాక తేలిగ్గా చేసుకోగలిగేలా, వెంటనే చేసి చూడాలనిపించేలా చవులూరించే […]