April 24, 2024

బుడుగు-సీగేన పెసూనాంబ

రచన: ధనికొండ రవి ప్రసాద్. బుదుగు: సీ గేన పెసూనాంభా ! ఏంటలా డల్ గా మూతి ముడుచుక్కూచ్చున్నావ్ ! ఏం జరిగింది? అన్నం కూరా ఆడుకుందామా? సీగేన:హేమి అన్నం కూలా? ఇవ్వాల్ల అన్నమే తినాలనిపించ లేదు. అమ్మ కొత్తుతుందని తిన్నా . బుడుగు: హస లేమైంది? సీగేన: అమ్మా నాన్నా పోట్టాడుకున్నారు. బుడుగు:హ్హదా ! పెద్దాళ్లన్నాక కాసేపు పోట్టాడుకుంటారు. మళ్లీ కలుసుకుంటారు . ఇంతకీ దేనికి? సీగేన: నాకేమద్దమౌతుంది? పెద్దాల్ల తగాదా. ఏదన్నా అలిగితేనేమో “పిల్లాల్లు. […]

మా వదిన మంచితనం- నా మెతకతనం..

రచన: జి.ఎస్.లక్ష్మి.. నవంబరు 8న మన ప్రథానమంత్రి నరేంద్రమోడీగారు రాత్రి యెనిమిదిగంటలకి మొత్తం ప్రపంచమే ఉలిక్కిపడేలా. 500, 1000 రూపాయిలనోట్లు ఆరాత్రి పన్నెండుగంటలనుంచీ చెల్లుబడి కావంటూ ఒక ప్రకటన చేసారు. అది వినగానే ప్రపంచం మాట దేవుడెరుగు.. నా గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. సంగతి కూడా అలాంటిదే మరి.. అసలే నాది ముక్కుసూటిగా వ్యవహరించే స్వభావం. బీరువాలో డబ్బుంటే ఖర్చుపెట్టుకోవడం, లేకపోతే మాట్లాడకుండా వూరుకోవడం తప్ప చాటూమాటూ తెలీనిదాన్ని. అలాంటిదానికి నాకు మా వదిన బ్రైన్ వాష్ […]

గడసరి అత్త – సొగసరి కోడలు

అత్తా కోడలూ…యెంత ఆకర్షణ యీ పదాల్లో !!.పుల్ల పుల్లగా.. తియ్య తియ్యగా ఊరించే మామిడి ముక్కల పైన కాస్తంత కారం అలా అంటించి, ఉప్పు కాస్త తగిలించి, పంటికింద వేసుకుని….నెమ్మది నమ్మదిగా నములుతూ ఉంటే….యెంత బాగుంటుందో మన తెలుగు నాలుకలకు వివరించి చెప్పవలసిన పని లేదు కదా !!! ఇదివరకటి తరంలోని గయ్యాళి తనం, ఇప్పటి సర్దుకుపోయే గుణం, తెలుగు చెరకు పాల రుచులూ, ఇంగ్లీషు మాటల తేనె చుక్కలు, చిరు కోపమూ, నవ్వుతూనే చురకంటించే గడసరి […]