April 23, 2024

అల్ విదా!

రచన : సోమ సుధేష్ణ “నా మనసుకు నచ్చి, కోరికల కోటాలో కొట్టుకు పోయేవాడు కాకుండా అరవింద్ బావలాగ మంచి వాడైతే తప్ప నేను పెళ్ళి చేసుకోను. ” అని ఖచ్చితంగా చెప్పింది మాలిక. అలాగేలే అని దీవించారు విమల, బలరాం తమ గారాల కూతురును. అది విని మౌనిక చెల్లిని ప్రేమగా అక్కున చేర్చుకుని దీవించింది. మౌనిక కంటే మాలిక నాలుగేళ్ళు చిన్నది. అందరికి ఇద్దరు పేరెంట్సు ఉంటె` మాలికకు ముగ్గురున్నారు. మౌనిక మూడో పేరెంటు. […]

నా బంగారు తల్లి

రచన : సోమ సుధేష్ణ “అమ్మకు వంట్లో బాగాలేదు, నిన్ను చూడాలంటుంది. ఒకసారి వచ్చి వెళ్ళు.” బెంగుళూరు నుండి తండ్రి ఫోనులో చెప్పినప్పుడు సుజన మనసులో అలజడి అనిపించింది. “ఏమయింది? అసలు ప్రాబ్లమేమిటి? డాక్టరు చూసాడా?” “రఘువర్మ చూస్తున్నాడు. ఒవేరియన్ కేన్సర్ అని డయగ్నోజ్ చేసారు. ట్రీట్ మెంటు ఇస్తున్నాడు.” “ఎప్పుడు తెలిసింది? రఘువర్మ అంకుల్ బెస్ట్ కేన్సర్ స్పెషలిస్టు.” “నువ్వు ప్రేగ్నెంటు అని చెప్పినపుడు నీకు సాయం అవుతుందని తను అమెరికాకు రావాలనుకుంది. వచ్చే ముందు […]

అది ఒక ఇదిలే…

రచన : సుధేష్ణ   అపార్ట్మెంటు అంతా శుభ్రం చేసి టేబుల్ పైన వేజ్లో పువ్వులు గుత్తిగా అమర్చి ఆ పక్క నిలబడి, ఈ పక్క నిలబడి చూసాడు. డైనింగ్ టేబుల్, దానిపైన వెజ్, అందులో పువ్వులు అన్నీఅందంగానే కనిపిస్తున్నా యని రూడీ చేసుకున్నాక తృప్తిగా ‘మేరి సప్నోంకి రాణి’ ఈల వేస్తూ వంటిన్ట్లో కేల్లాడు రోహన్. పెద్దగా ఏనాడూ వంట చేసినవాడు కాదు. ఐపాడు ముందు పెట్టుకుని ఘుమ ఘుమ లాడే వంట కాలు పొలావు, […]

లేచింది మహిళ

రచన : సోమ సుధేష్ణ   భారతికి నిద్ర రావడం లేదు. మూగబోయిన మనసుకు ఊపిరి ఆడటం లేదు. మనసేనాడో  మొద్దు బారిపోయింది. శరీరం చలించడం మానేసి చాన్నాళ్ళయింది. భర్త చనిపోయాడని బాధా లేదు, సంతోషమూ లేదు. దట్టమైన అడవిలో నడుస్తూ బయట ప్రపంచాన్ని చూస్తానా ! చూడనా! అనుకుంటూ జీవితమంతా నడిచి, అలసి పోయి ఆశ వదులు కున్నప్పుడు వెలుతురు కనిపిస్తుంది. అలవాటులేని వెలుతురు- అలవాటైన చీకటి- దేవుణ్ణి తలుచుకోవడం కూడా మరిచి పోయింది. యాంత్రికంగా […]

అత్తగారు – అమెరికం

రచన: సోమ సుధేష్ణ గణ గణ మోగుతున్న ఫోను అందుకుని “హలో వదినా, నేనే ఫోను చేద్దామని కుంటున్నాను, ఇంతలో నువ్వే చేసావు. నీకు నూరేళ్ళ ఆయుష్షు. రేపు రవీంద్ర భారతికి వెళ్తున్నావా?” అంది అరుణ. “నూరేళ్ళు వద్దులే అరుణ. ఉన్నన్ని రోజులు కాళ్ళు చేతులు బాగుండి పోయేరోజు వరకు మంచం ఎక్కకుండా ఉంటే చాలు. నువ్వు, లలిత రావడం లేదు. నేనొక్క దాన్నే రవీంద్ర భారతికి ఏం వెళ్ళను చెప్పు. రేపు ఏం చేస్తున్నావు? ఇక్కడికిరా, […]

ఖజానా

రచన : సోమ సుధేష్ణ రాత్రి నిద్రలో వచ్చిన కలల తాలూకు ఛాయలు ఉమ మోహంలో నీలి నీడల్లా కదులు తున్నాయి. ఆ నీడలను దులి పెయ్యాలని ఉమ కాఫీ కలుపుకుంది. కూతురికి లంచ్ బాక్స్ తీయాలని ఫ్రిజ్ డోర్ తీయబోయి అలవాటుగా డోర్ పై పెట్టిన ‘ఈ రోజు చేయాల్సిన పనుల’ లిస్టు చూసింది. సరసి డాన్స్ క్లాసు ఐదింటికి, వచ్చే దారిలో కొనాల్సినవి- పాలు, ఆరెంజ్ జ్యూస్, లంచ్ స్నాక్, డ్రై క్లీనర్స్ దగ్గర […]

ఇండియా ట్రిప్

రచన:  సోమ సుధేష్ణ     “ఈసారి ఇండియా వెళ్ళినపుడు మద్రాస్ అక్కడి నుండి సిలోన్ వెళ్దాం మిట్టూ.” “త్వరగా డేట్ ఫిక్స్ చేసుకుంటే నేను కూడా వెకేషన్ కు అప్లై చేస్తాను.” అప్పుడే స్నానం చేసిన  మిట్టు టవల్ తో బాడి డ్రై చేసుకుంటూ అన్నాడు. “ఈసారి త్రీ వీక్స్ అయినా వెళ్ళాలి. జనవరి ఎండింగ్లో అయితే బావుంటుంది కదా! తిరునాళ్ళ కెల్లినట్టుగా జనం తోసుకుంటూ ఎయిర్ పోర్టు నిండా కనిపించరు. రష్ తగ్గి పోతుంది.” […]

‘నా కొడుకా’ అని ఒక్కసారి పిలువమ్మా!

రచన : సోమ సుధేష్ణ     “కొత్త ఇంట్లో చాల బావుంది శ్రీను.” అంటూ హిమ ఫేమిలీ రూమ్ లో నలుమూలలా తాను చేసిన అలంకారాలు సరి చేసుకుంటూ అంది. శ్రీనివాస్ కు కూడ అలంకరణ నచ్చింది. రాబోయే తల్లిదండ్రులకోసం అన్ని సిద్దంగా ఉన్నాయి. తృప్తిగా తలాడించాడు. ఇద్దరూ ఆ పక్కనే ఉన్న బెడ్ రూమ్ లోకి వెళ్ళారు. కింగ్ సైజు బెడ్ దానికి రెండు వైపులా టేబుల్స్ పై లాంప్స్ ఉన్నాయి. బెడ్ కు […]