TELUGU BLOGS' COMMENTS
అనామకం
"

తాతయైనను జేమ్సుబాండును తావుచెప్పెదనానిమ
స్సౌత గానను యన్యగామిగ సాముజేసిన గూడనౌ
పాతకాలపు తెక్నికుల్గల పట్టుగాంచిన పారుడన్
కూతకొచ్చినకోడివోలెను కొత్తవాడిని సుమ్మనౌ 🙂

మెచ్చుకోండి

"
kastephale
"

అన్యగామి గారు,
కనిపెట్టేశా! అనామకంగా రాసినా!!
అమ్మ దయతో అరవైలవైపు నడుస్తున్నాం. గత రెండేళ్ళూ ఇల్లాలి అనారోగ్యంతో వేసవి భయపెట్టింది, ఈ వేసవి కొద్ది పాటి ఇబ్బందితో దాటుతున్నట్టే! 🙂
మీ అభిమానానికి,ఆకాంక్ష కు
ధన్యవాదాలు.

మెచ్చుకోండి

"
kastephale
"

రమణాజీ,
కుశలం కదా!బహుకాల దర్శనం, మీ P.P.O వచ్చిందా?
మీ అభిమానానికి,అభినందనకు
ధన్యవాదాలు.

మెచ్చుకోండి

"
kastephale
"

YVR’s అం’తరంగం’
వివాహం ఐన వెంటనే ఆది దంపతుల దర్శనం చేయిస్తారెందుకో తెలుసా! వారిలా వాక్కు,అర్ధమూ, వెలుగు,కాంతి లను విడ తీయలేనట్టూ, ఆది దంపతులలా అర్ధనారీశ్వరులుగా బతుకుతామని ప్రతిజ్ఞ చేయించడానికే!
మీ అభినందనకు,అభిమానానికి
ధన్యవాదాలు.

మెచ్చుకోండి

"
kastephale
"

Rajeswariగారు,
మీ అభినందన ఆనందాన్ని పెంచింది!
ధన్యవాదాలు.

మెచ్చుకోండి

"
kastephale
"

Suryanarayana MV (suryamahavrata)గారు,
ఆనందం పంచుకుంటే పెరుగుతుంది!
యువజంటకు ఆశీర్వచనం, దీర్ఘాయుష్మాన్భవ,దీర్ఘ సుమంగళీభవ
మీ అభినందనలకు,అభిమానానికి
ధన్యవాదాలు.

మెచ్చుకోండి

"
kastephale
"

చి.challa.jayadev vara
మీరు,మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ శాంతులతో, విద్యా,బుద్ధులతో కొనలు సాగాలని ఆశీర్వచనం
మాకు పెద్దరికమిచ్చి, ఈ సావకాశం కలగజేసినందుకు
ధన్యవాదాలు.

మెచ్చుకోండి

"
kastephale
"

పవన్ గారు,
మీ మాట బతకుపై మరింత ఆశ కలిగించింది.మీ అభిమానానికి
ధన్యవాదాలు.

మెచ్చుకోండి

"
kastephale
"

విన్నకోటవారు,
అరవైలవైపు వడివడిగా అడుగులేసున్నాం.
గత రెండేళ్ళు వేసవిలో నరకం చూశాం, ఇల్లాలి అనారోగ్యంతో, ఈ సంవత్సరం అమ్మ కరుణించింది, కొద్దిలో తేలిపోయాం,చల్లగానే ఉన్నాం.

సమానుల్లో కొంచం ఎక్కువ సమానం అనుకుంటా! ఎందుకంటే..

దువ్వూరి సుబ్బమ్మగారు, స్వాతంత్ర్య సేనాని గుర్తున్నారు కదా! వారికి మా శ్రీమతివారు శిష్యులు. సుబ్బమ్మగారిది కడియం.

ఇక చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారి రెండవకుమారుడు దుర్గేశ్వర శాస్త్రి,సీతాలక్ష్మి దంపతులకు ఇల్లాలు అభిమానపుత్రిక. మరేం చెప్పగలను 🙂
మీ అభిమానానికి
ధన్యవాదాలు.

మెచ్చుకోండి

"
kastephale
"

చి.సౌ చిత్ర
భార్య/భర్త ఒకరిమాట మరొకరు వినేస్తే సమస్యలే లేవు కదమ్మాయ్
కాని ఎదుటివారు వినేటట్టుగా చెప్పడంలోనే ఉందికదా అసలు తిరకాసు 🙂
దీర్ఘసుమంగళీభవ
ధన్యవాదాలు.

మెచ్చుకోండి

"
శరత్ కాలమ్
"😁"
Anonymous
"https://www.pinterest.com/pin/24136547974991317/"
Lalitha TS
"చాలా మంచి విషయం పంచుకున్నారు . ధన్యవాదాలు."
Chandrika
"

మంచి వ్యాసం అన్యగామి గారు 🙂 ధన్యవాదాలు

మెచ్చుకోండి

"
విన్నకోట నరసింహారావు
"

చక్కటి వ్యాసానికి లింక్ నిచ్చిన “అన్యగామి” గారికి కృతజ్ఞతలు. ఈ విషయంలో గొల్లపూడి మారుతీరావు గారి లాంటి ప్రముఖుడి అభిప్రాయాలలోనూ, నాలాంటి సామాన్యుడి అభిప్రాయాలలోనూ సామ్యం కనిపించడం నాకు చాలా గొప్పగా ఉంది – ఎంత గొప్పగా అంటే ‘జలపాతాన్ని ఈ వైపు నుండి ఆ వైపుకు ఒకే గంతులో దాటినంత’ గొప్ప ఫీలింగ్ గా ఉంది 🙂. చెయ్యి తిరిగిన రచయిత కాబట్టి, సినిమాలతో ప్రత్యక్షానుభవం కలిగిన వ్యక్తి కాబట్టి గొల్లపూడి గారు అద్భుతంగా వివరించారు.

నిజానికి సినిమా కళ అంటే నాకు చాలా గౌరవం. సృజనాత్మకత నావిష్కరించడానికి ఎంతో ఆస్కారం గల రంగం. ఆ రకంగానే సినిమాలు రూపొందించారు ఒకనాటి సినీ పెద్దలు, బాధ్యతతో కూడిన వినోదమూ అందించారు. ఒక సినిమా నిర్మించడం అంటే ఎంతో వ్యయప్రయాసలతో కూడిన పని. అయినా బాధ్యతారహితంగా వ్యవహరించలేదు వారు. అటువంటి రంగం భ్రష్టు పట్టిపోతోందే అని విచారం.

ఈ చర్చలో పాల్గొన్నవారందరికీ 🙏.

మెచ్చుకోండి

"
Chandrika
"

అందుకే కదండీ ఇక్కడ పొందుపరిచాను🙂

మెచ్చుకోండి

"
kastephale
"

విన్నకోటవారి మాట వజ్రాల మూట. 🙂

మెచ్చుకోండి

"
అన్యగామి
"

విన్నకోట వారి, జిలేబి వారి వాదనకి మరింత బలం చేకూరేలా ఉన్న ఈ వ్యాసం కూడా తిలకించండి.
http://www.koumudi.net/gl_new/051313_vandella_cinema.html

మెచ్చుకోండి

"
UG SriRam
"Income from Kollur Mookambika Temple to Karnataka Govt every year is 33-44 CR , Where as Govt Spends 65 Thousand!!

https://twitter.com/Girishvhp/status/866604273798336514

Kar: Hindu population 80% - Govt fund for archaka salary '17 - 41 crores.

Govt budget for imam salary '17 - 45 crores

https://twitter.com/pranasutra/status/867061275867598848

Kar Govt gives 36K per yr to 34,229 temples. Out of which 12K (1k per month) goes to archaka salary -> hence 41 crores.

https://twitter.com/pranasutra/status/867061275867598848"
challa.jayadev vara
"

sorry madam, after mis guided by blog page design,i thought it belongs to sharma garu.

మెచ్చుకోండి

"
Chandrika
"

_/\_

మెచ్చుకోండి

"
Chandrika
"

ధన్యవాదాలు పవన్ గారు

మెచ్చుకోండి

"
Chandrika
"

🙂

మెచ్చుకోండి

"
Chandrika
"

వారు శర్మ గారు కాదండీ . విన్నకోట నర్సింహారావు గారు. అర్ధం కాలేదు. తిరిగి వ్రాయగలరా ?

మెచ్చుకోండి

"
Jekka Swetha
"superb lines.. True words Satish"
శ్రీధర్
"ధన్యవాదాలు! నా బ్లాగులో ఈ రోజు టపా కొట్టిన 'శ్రీరంగ నీతులు' చదవండి. దానిని మీ పద కవితా విన్యాసంతో తీర్చి దిద్దండి. ...శ్రీధర్.ఎ."
Jekka Swetha
"Please add my blog..
my blog url is
https://jekka-swetha.blogspot.com

నా అభిరుచులు.. ఆలోచనలు.. భావాలు..అనుభవాలే ఈ బ్లాగు. ఇది తెలుగు భాషలో కలదు.

Thank you"
శ్యామలీయం
"తప్పకుండా చేదాం."
శ్రీధర్
"తాడిగడప శ్యామలగారూ!ఇంత వీనుల విందైన,రమ్యమైన రగడని చదివాక నాకు ఒక ఆలోచన కలిగింది!! నేను ఆటిజం మీద ఒక సాంఘిక నాటకం 'నీలిరంగు రిబ్బను' అనే పేరుతొ వ్రాస్తున్నాను. నా నాటకంలో ఒక వినూత్న జానపద కళా రీతిని పరిచయం చేయాలనిపించింది. మీ బ్లాగు పేరులో అంటే శ్యామలీయం అనే పేరులో 'ఆటిజం' సంకేతమైన నీలం రంగు ఉంది!! నేను పద్య రచన చేయలేను, నా కోసం నా నాటకాన్ని ప్రదర్శించే కళాకారుల కోసం ఆటిజం అనే మనో"
radharaopv
"

మా మనవడు 99 వ రాంక్ సంపాదించాడు.ఇష్టపడ్డ కోర్స్ కదా..నిన్ననే తెలిసింది. మంచి కాలేజ్ లో సీట్ వస్తుంది.

Like

"
భమిడిపాటి ఫణిబాబు
"

రాధారావుగారూ,

మొన్న మా చుట్టం ఒకాయన ఈ విషయమే నా అభిప్రాయం అడగ్గా, రాసిన టపా ఇది…

Liked by 1 person

"
వరప్రసాద్ దాసరి
"Thank you very much narendar. Happy to see your comment in my blog."
శ్యామలీయం
"రగడలు దేశిఛందస్సులు. వీటిలో‌ ద్విపదల్లోలాగా ప్రాసనియమంతో రెండేసి పాదాలొక పద్యం. మధురగతికి పాదానికి నాలు చతుర్మాత్రాగణాలు మధ్యలో విరచి యతి. నిజానికి పదహారు మాత్రలొకపాదం అంటే బాగుంటుంది. రగడల్లో అందం అల్లా వాటికి కల అంత్యప్రాసా నియమం."
శ్యామలీయం
"లలితగారూ,
మీకు నచ్చినందుకు సంతోషం. ఈరోజున నా బ్లాగు చదివేవారి సంఖ్య అన్నదే తక్కువ. ఇంకా నా రచనలను ఎవరైనా స్వరబధ్ధం చేసి ఆలపించటమా? అంత ఆశ లేదండి. ఏదో‌ ఉన్నన్నాళ్ళూ‌ దైవసంకీర్తనం చేసుకుంటే చాలు - వీలున్నప్పుడు బ్లాగుల్లో అవి ప్రకటించటమే చేయగలనేమో‌ కాని ఆశలకు పోలేను కదా. ఈ మధ్య కాలంలో ఆఫీసుపనికి తప్ప ఘడియతీరట‌ం కూడా గగనంగా ఉండి చలా ఆవేదనగా ఉంటున్నది. లోలోన నామజపం తప్ప బ్లాగుతెరచి నాలుగు"
sarma
"చాలా రోజుల తరవాత!
బాగుంది, ప్రక్రియ కొత్త, నాకు తెలియనిదే."
Lalitha TS
"ఈ మధురగతి శివరగడ స్వరపరిచిన మధురస్వ"రగడ" (రగడ = మెలొడీ) అవుతుందండి - నాకు భలే నచ్చేసింది. ఓం నమశ్శివాయ!"
Agnatha
"https://en.wikipedia.org/wiki/The_Egg_(building)"
naren
"Varammmm nice blog keep writing"
వరప్రసాద్ దాసరి
":-)☺😊😢😊😊"
వరప్రసాద్ దాసరి
"మీరన్నట్టు అసలంటూ ఎక్కడో అక్కడ మొదలెడితే సాధకబాధకాలు గురించి ఆలోచించొచ్చు."
విన్నకోట నరసింహా రావు
"ఫేస్ బుక్ లో కూడా ఇలా ఉంటుందన్నమాట (నేను ఆ పుస్తకంలో లేనులెండి) !! షాకింగ్, షాక్ అవుతారు లాంటి హెడింగ్ లు కనిపించే బ్లాగొకటి తెలుగు బ్లాగ్ లోకంలో కూడా ఉంది కదా. "శోధిని" సంకలినిలో తరచు కనిపిస్తుంది."
Kiran Dasari
"😊😊😊"
Dantuluri Kishore Varma
"నా బ్లాగ్ మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు రేవతిగారు."
cbrao
"Please furnish your e-mail at the page which is under maintenance. They will advise you when page is available."
Agnatha
"comments andi.comment manamu ivvali.chudali..basing on that you can decide whether to watch or not"
విన్నకోట నరసింహా రావు
"మీ ఆలోచన బాగానే ఉంది. అయితే పెద్దగా ఫలితం ఉంటుందా అని నా అనుమానం. ఎందుకంటే జీవితాలలో స్పీడ్ పెరిగింది. దూరాభారాలు పెరిగాయి. వేళ్ళాడుతూనయినా సరే ఎక్స్ప్రెస్ బండే ఎక్కి తమ ఊరికి త్వరగా చేరుకుందామనే ప్రయత్నిస్తారు. పైగా దూరాలు వెళ్ళేవారు మెల్లగా ప్రయాణించడానికి ఇష్టపడకపోవచ్చు కదా. అందువలన గూడ్స్-పాసెంజర్ ఎక్కుతారా అంటే ఆలోచించాలిసిందే. ప్రయాణీకుల రెయిళ్ళు అంతగా తిరగని ఏదైనా ఏజెన్సీ ప్రాంతాల రూట్ల ద్వారా వెడుతుండే గూడ్స్ బళ్ళల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టచ్చు. రైల్వేబోర్డ్ కి / మంత్రికి / వార్తాపత్రికలకి సలహా వ్రాసి చూడచ్చు."
వరప్రసాద్ దాసరి
"మళ్ళీ ప్రయత్నించండి లలిత గారు :-)"
prabhanews giddalur
"యజ్ఞం ఫోటోలు పెట్టండి స్వామి"
R. Pavan Kumar Reddy
"మేము అరవం గానీ పాడతాం .. చమక్కు బాగుంది లలిత గారు పోస్ట్ తో పాటు."

A.Satyanarayana Reddy
"లతికను బోలు దేహమున రంజిలు చుండును శౌరి కోడలౌ
రతి ప్రియపత్ని సుందరుడు లచ్చికుమారుడు శంబరారికిన్
సతతము నాల్క లందునను చక్కగపల్కెడు తమ్మికంటి భా
రతి పతి మారుడెట్లగును బ్రహ్మయె కాదె తలంచి చూచినన్
"
కామేశ్వర రావు పోచిరాజు
"సెప్టెంబర్ 22, 2015 నాటి నా పూరణ కించిత్సవరణ తో. అసమీక్షితము.

సతి వాణి చతుర్ముఖహృ
ద్రత శుకవారిజ విమల కరాంబుజ బ్రాహ్మీ
శృతి సూక్తి వివిక్తయు భా
రతి పతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్.
"
కామేశ్వర రావు పోచిరాజు
"సత తాబ్జభవ మనోరత
విత తాభిన వాక్షమాల విలసిత హస్త
ద్యుతి జిత శశాంక తను భా
రతి పతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్


కతిపయ మానవేంద్రులకుఁ గల్గును సందియముల్ మనమ్ములన్
ద్యుతిసెడి వ్యర్థ కార్యములఁ దోరము నిల్పగఁ జిత్త మంతయున్
స్తుతమతి కేల సంశయము చోద్యమ!వాణికి భర్త, కంతుఁ డా
రతిపతి మారుఁ డెట్లగును? బ్రహ్మయె కాదె తలంచి చూచినన్

"
G P Sastry
"రోజులు మారాయ్:

సంపద లెన్నో యున్నను
గంపలు గంపలుగ ధనము గలగల రాలన్
సొంపుగ నలరెడు న్యాయపు
సంపాదన లేని పతిని సతి మెచ్చుకొనెన్"
Venkat B
"bokkala undhi....edho love story anukuna...time bokka....prathi student lo jarige vishyame..."
krkr
"కం.వితతిగ సృష్టించె జగతి
సతతము యా జదువులమ్మ సాంగత్యమునన్,
శ్రుతులకు మూలము జయ భా
రతిపతి మన్మధుడు గాడు బ్రహ్మ యె తలఁపన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు"
Zilebi
"

అమా వాస్యా ! నీవే సుమ జన భారమ్ము లెల్లన్
సమానమ్మై జేయన్ కడియము సంజోకమున్ జే
సి మా ప్రాణమ్ముల్లాగితివి మసిన్ బూసి! ఓ చం
ద్రమా ! మా పాడెన్గట్టితివి సుతారమ్ము గానన్

జిలేబి"
గోలి హనుమచ్ఛాస్త్రి
"స్తుతమతి చెప్పెద వినుమా
రతిపతి మన్మథుడు గాద, రసనాగ్రమునన్
అతులితముగ నిలచిన భా
రతిపతి మన్మధుడుగాడు, బ్రహ్మయె తెలుపన్."
Laxminarayan Ganduri
"మతిమంతుడ పఠియించుము
శ్రుతుల బురాణముల నీకు రూఢిగ తెలియున్
అతులిత యక్షర సుర భా
రతి పతి, మన్మథుడు గాడు, బ్రహ్మయె తలఁపన్.
"
Zilebi
"

ఎక్కడి కథలన్ పట్టితి
వక్కమ్మా ! మజ జిలేబి వార్చితివిగదా
చిక్కుల్ బడితిని సుమ్మీ
తక్కిడి జేయంగ వాడు తప్పే వెదుకున్ :)

జిలేబి"
CHEPURI SREERAMARAO
"_ప్రతిసతిపతిజత రసపద
గతినతిమధురజతుల రతికార్యము సల్పన్
వితరణమునుచేయునతడు
రతిపతి మన్మధుడు; గాడు బ్రహ్మయె తెలుపన్"
Zilebi
"

పడిగాపుల్ పడి వచ్చి చేరితిగ నీపాదమ్మునన్ వేంకటే
శ! డుబాకోరుని గాదు రా రమణ ! మా స్వామీ ! జిలేబీయమై
నడిరేయిన్ రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్
సడిజేసెన్ గద నిన్ను గాన నట, యీశా! యేడు కొండల్ గనన్ !

జిలేబి"
subbarao
"రతిపతి యెవరని నరయగ
రతిపతి మన్మధుడు,గాడుబ్రహ్మయె తలపన్
హతవిధి! యనకుమ యట్లని
పతిదేవుడు వాణికతడు పరమాత్ముండున్"
మిస్సన్న
"గురువుగారికి ధన్యవాదశతములు"
Zilebi
"

ఓ! వైవీ ! యీ రాత
న్నే వోమారెక్కడో గనేనుగద? జిలే
బీ వోలెవున్నదే ! య
బ్బీ! వూరేదో ? విషయము బిగిబిగి తెలుపన్ 🙂


https://polldaddy.com/js/rating/rating.js

మెచ్చుకోండి

"
Zilebi
"

నోటుబుక్కున గీతగీసెను నోడ వచ్చిరి యెల్లరున్
నీటుగానటు నీలియార్ముడు నీరజారిని జేరగన్
తాటికల్లును త్రావినాడు సుతారమైయటు బోవనౌ !
మాటువేసి జిలేబివచ్చెను మత్త కోకిల గానమై !


జిలేబి
"
Zilebi
"

నోటుబుక్కున గీతగీసెను నోడ వచ్చిరి యెల్లరున్
నీటుగానటు నీలియార్ముడు నీరజారిని జేరగన్
తాటికల్లును త్రావినాడు సు తారమైయటు బోవనౌ !
మాటువేసి జిలేబివచ్చెను మత్త కోకిల గానమై !

జిలేబి

మెచ్చుకోండి

"
Zilebi
"

ఓ! వైవీ ! యీ రాత
న్నేవో మారెక్కడో గనేనుగ ద? జిలే
బీవోలెవున్న దే ! య
బ్బీ! వూ రేదో ? విషయము బిగిబిగి తెలుపన్ :)

జిలేబి"
Zilebi
"

పృథువిఁ బురూరవుస్సగరు హైహయజున్ బురుకుత్సుఁ జంద్రమ
త్యధిపు నలుం దిలీపు యవనాశ్వభవుం భరతున్ గయున్భగీ
రథుని మరుత్తనంగు శిబి రాము సుహోత్రుని నంబరీషునిం
బృథుని యయాతి రంతి శశిబిందుని భార్గవు మించవే హరీ!

ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములోని పద్యం
ఇందులో షట్చక్రవర్తుల పేర్లు,షోడశమహారాజుల పేర్లున్నాయి

source->

http://chitrakavitaprapancham.blogspot.com/2017/05/blog-post_72.html

జిలేబి
"
Zilebi
"

బాహుబలి చూడక ఎంత మిస్సవుతున్నారో శర్మ గారు చూసాక అర్థమవుతుంది.

జిలేబి

మెచ్చుకోండి

"
Zilebi
"
తాతయైనను జేమ్సుబాండును తావుచెప్పెదనానిమ
స్సౌత గానను యన్యగామిగ సాముజేసిన గూడనౌ
పాతకాలపు తెక్నికుల్గల పట్టుగాంచిన పారుడన్
కూతకొచ్చినకోడివోలెను కొత్తవాడిని సుమ్మనౌ :)

జిలేబి"
YVR's అం'తరంగం'
"

సర్, పన్ను(pun)పోటును పట్టలేకపోయాను.

మెచ్చుకోండి

"
YVR's అం'తరంగం'
"

ఓహ్! చంద్రలోకంలో తాటికల్లు తాగడానికా? హతవిధీ!!
శివగామి ఐడియానా? (మాతృభూతం=శివగామి. ఆవిణ్ణి మించిన మాతృభూతాలు ఎక్కడుంటారు?

మెచ్చుకోండి

"
kastephale
"

పొర’బడితి’రే వాక్యమును గమనింపుడు,”బాహుబలి మొదటి, దాని సీక్వెల్ చూడలేదు”
ఈ సమయాన్ని అలా ఉపయోగించుకోలేదండి
🙂

మెచ్చుకోండి

"
YVR's అం'తరంగం'
"

గురువుగారూ 🙏
//ఈ చేతివ్రాత ఎక్కడనో చూచియుంటినే! ఎక్కడైయుండనోపు?// మీరే చెప్పాలండి.
//బాహుబలి మొదటి దాని సీక్వెల్ చూడలేదు// అంటే బాహుబలి వన్ చూశారన్నమాట. మీ యాభైఆరవ వెడ్డింగ్ డే సందర్భంగానా? (సరదాగా అడిగానండి, ఏమీ అనుకోరనే అనుకుంటూ

మెచ్చుకోండి

"
Zilebi
"

అది తాటికల్లు మహాత్మ్యమని మాతృభూతం ఉవాచ 🙂

జిలేబి

మెచ్చుకోండి

"
kastephale
"

ఈ చేతివ్రాత ఎక్కడనో చూచియుంటినే! ఎక్కడైయుండనోపు?
బాహుబలి మొదటి దాని సీక్వెల్ చూడలేదు,మూడవది రాబోతోందష! అందులో తాడి చెట్టు వివరం దొరకచ్చు, కట్టప్ప బాహుబలిని ఎందుకుచంపేడో పార్ట్ రెండులో తెలిసినట్టుట 🙂

మెచ్చుకోండి

"
sarma
"విన్నకోటవారు,
నమోనమః
ధన్యవాదాలు."
sarma
"జిలేబిగారు
ధన్యవాదాలు."
YVR's అం'తరంగం'
"

అన్యగామిగారు నెనరులు 🙏
మౌస్‌ కాదండి, స్టైలస్‌తో రాసినది. థాంక్స్ టు టెక్నాలజీ.
//మిగిలిన పార్టులకి నేను రెడీ//
😆 విధి బహుబలీయమైనది మరియు బాహుబలీయమైనదీను.😆

మెచ్చుకోండి

"
Zilebi
"

పెళ్ళికి ముందే తల్లై
కళ్ళెము వేస్తా జిలేబి కన్నడి కనుచున్
భళ్ళన కుండను కొట్టెను
చెళ్ళని హాసనుడి పిల్ల చెకుముకి రాయీ‌ :

జిలేబి"
Zilebi
"

వెల్కం బెక బెక !

ట్రెండ్ మారుతున్నట్టుంది ! మళ్ళీ మీరు బ్లాగ్లోకానికి రావాలని నిర్ణయించేసుకోవడం చాలా మంచి విషయం

తెలుగు బ్లాగ్ లోకం మరిన్ని వెల్కం బెక బెక బ్లాగర్లతో కళ కళ లాడుతుందని ఆశిస్తో

జిలేబి"
Haran Rameshwer
"N.a. Peru dattatri janmanamam 27/11/1982 time 9:11 prastutam n.a. Peru rameshwer"
Lalitha TS
"ఇంకో పది కాదు - ఇంకొన్ని పదుల పది-కాలాల పాటు రాయాలి మీరు."
విసుకి వాడి మనస్సె ఒక విశ్వం...
"Welcome back to the right platform sir!!"
Sarada Vibhavari
"ధన్యవాదాలు సుజాతగారు . బావ అనే అంటానండి blog ముందు మావారు చదివి శభాష్ అన్నారు ఇప్పుడు మీరు అనుమానం కలిగించారు ఇది అన్యాయం అండి."
Sarada Vibhavari
"ధన్యవాదాలు బాబయ్యగారు. ఏదో మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఆ దేవుడి దయ కలిసి రాబట్టి పోయినవి దొరికాయి."
Sarada Vibhavari
"ధన్యవాదాలు లలితగారు"
Sarada Vibhavari
"thank u శ్రీ రామ ప్రసాద్ గారు , కధలు రాసేంత ధైర్యం ఇంకా చెయ్యలేదండీ ."
Raja Kishor D
"Kanchi Paramacharya Sri Chandrashekhara Saraswathi Swamiji"
nmrao bandi
"మీరు ఆరోగ్యానికి హాని కలిగించే వాటి జోలికి
పోనని చిన్నప్పుడే ఒట్టేసుకున్నారని తెలిసే
స్టాట్యుటరీ వార్నింగ్ పెట్టలేదు శ్రీధర్ జీ ... jf...
స్పందనకు ధన్యవాదాలు. :)"
SAI RAM
"Who is the maharshi ?
"
nmrao bandi
"మీకు నచ్చినందుకు చాలా సంతోషం
లలితా మేడం గారు. ధన్యవాదాలు.
:)"
Unknown
"Very nice bro"
R. Pavan Kumar Reddy
"కంగ్రాట్స్ హనుమంత రావు గారు. మరిన్ని సంవత్సరాలు రాస్తూ ఉంటారని ఆశిస్తున్నాను"
R. Pavan Kumar Reddy
"మీ నమ్మకానికి, ప్రోత్సాహానికి ధన్యవాదాలు నరసింహా రావు గారు."
R. Pavan Kumar Reddy
"చదివి మెచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు చిత్ర గారు."
Sridhar Bukya
"Always Obliged and Humbled, Lalitha Madam"
Lalitha TS
"That's alright :)"
sateesh
"Superb"


See also
Aavakaaya.comCurrent version of Maalika has been developed by Sreenu and maintained by Bharadwaj and Sreenu. Copyright © 2010
మాలిక: తెలుగు బ్లాగుల సంకలిని మరియు తెలుగు బ్లాగర్ల వేదిక
Follow Maalika on Facebook   Follow Maalika on Twitter  Chrome App for Maalika