May 20, 2024

స్థితి

రచన: భాస్కర్ కొండ్రెడ్డి

thinker

విచ్చుకుంటున్న శిలాజాల పువ్వుల్లో,

ఏ పరిమళాన్ని ఆశించానో మరి.

దుఃఖపు మగతల ముడులు విప్పుకుంటూ.

 

దేనికోసమో వేచిచూస్తుంటా, ఆత్రుతగా

చాలా సార్లు అదిచ్చే ఆనందం స్వల్పమని

తెలిసికూడా, అంతే మరుపుతో.

 

దేన్ని సంతోషమంటావు అనడిగితే,

సరైన సమాధానం కోసం వెతుక్కునే దగ్గరే

మిగిలిపోతున్నాను,  ఎంత ఆలోచించినా.

 

వదిలివేయబడ్డప్పుడు

విరుగుతున్నహృదయాన్ని వంచించే,

ఓ తప్పనిసరి వీడ్కోలుగీతం,

ఆనందంగానే వున్నాననుకోవడం

అలా అనిపించక పోయినా.

ఎన్ని ప్రణాళికలతో సిద్ధంగా వున్నా,

ఒక దగ్గర ఆగిపోతుంది జీవితం.

మళ్లీ మొదలుపెట్టాలనుకున్నప్పుడు,

అక్కడే ప్రారంభించాలనుకోకు.

2 thoughts on “స్థితి

Leave a Reply to Rama Krishna Perugu Cancel reply

Your email address will not be published. Required fields are marked *