May 13, 2024

మాలిక పత్రిక జులై 2014 సంచికకు స్వాగతం

shakuntala1

మాలిక పత్రిక జులై 2014 సంచిక విడుదలైంది. ఈసారి పత్రిక ఒక ప్రత్యేకమైన ప్రయోగంతో మీ ముందుకు వచ్చింది. ఒకే అంశం మీద పదిమంది రచయిత్రులు రాసిన కధలను , వాటి విశ్లేషణ, ఆ అంశానికి తగిన చిత్రంతో , మరికొన్ని సాహిత్య ప్రధాన వ్యాసాలతో మిమ్మల్ని అలరిస్తుందని అనుకుంటున్నాము.  తండ్రి – కూతురు అనే ఈ అంశానికి తగినటువంటి కథలు రాసినవారు సి.ఉమాదేవి, పి.ఎస్.ఎమ్ లక్ష్మి, జి.ఎస్. లక్ష్మి, మణి వడ్లమాని, నండూరి సుందరీ నాగమణి, సుజల గంటి, సమ్మెట ఉమాదేవి, బాలా మూర్తి, దమయంతి, వారణాసి నాగలక్ష్మి పాల్గొన్నారు. వీరందరి కధలు విభిన్నంగా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. ఈ కధలను విశ్లేషణ చేసినవారు మంధా భానుమతి.. అదే విధంగా జె.కె.మోహనరావుగారు కూడా  పద్యాలతో సరికొత్త ప్రయోగం చేస్తున్నారు.

భానుమతిగారు ఈ కధలను చదువుతూ, విశ్లేషించిన తర్వాత ఇలా అంటున్నారు..
నా మాట—
తండ్రీ కూతుళ్ల అనుబంధం ఎంత గొప్పదో.. ఆ ప్రేమ ఎంత అపురూపమయిందో.. అది అందుకున్న వాళ్లకి బాగా తెలుసు. అందుకనే.. మాలిక అంతర్జాల పత్రిక సంపాదకులు, రచయిత్రులని.. ఆ బంధం ఆధారంగా కథానికలు రాయమన్నప్పుడు వెంటనే స్పందించారు మన రచయిత్రులు.
ఒక్కో కథా వచ్చినప్పుడల్లా నాకు జ్యోతి పంపుతుంటే వెంటనే చదివేశాను.. పాఠకురాలిగా! అందరు రచయిత్రులూ ఆరితేరిన వారే.. ఒక్కొక్కరూ ఎంచుకున్న విషయం.. దేనికదే! అంత మనసుకు పట్టించుకోకుండా చదివేశాను కద.. ఆలోచిస్తే ఇన్ని రకాల నాన్నలుంటారా అనిపించింది. మా నాన్నగారు నన్ను గారం చెయ్యడం, కోపం వస్తే కోప్పడ్డం.. సరిగ్గా  చదవకపోతే కూర్చోపెట్టి పాఠాలు చెప్పడం, ప్రైజులొస్తే పదిమందికీ చెప్పి మురిసిపోడం.. ఇవే తెలుసు నాకు.
ఇంక సమీక్ష రాయడానికి కూర్చున్నప్పుడు, ప్రతీ లైనూ, వీలైతే లైనుకీ లైనుకీ మధ్య చదువుతుంటే ఆలోచనలు అంతర్వాహినిలా వచ్చాయి. అవన్నీ క్రమంలో పెట్టి విశ్లేషించడానికి ప్రయత్నం చేశాను.
నా అభిప్రాయాలు.. పాఠకులకి ఏమనిపిస్తాయో మరి.. వేచి చూడాల్సిందే!

ఈ సంచికలోని వ్యాసాలు, కధలు:
01. నాన్నకో ఈమెయిల్
02. నాన్న కూతురు
03. దహనం
04. ఓ నాన్న
05. ఓ ఇంటి కథ
06. ఏం బంధాలివి?
07. ఎంత మంచివాడవు నాన్నా?
08. కణ్వ శాకుంతలం
09.  బంధాలు – బాధ్యతలు
10. మీచ్ తుమ్చీ లేక్
11.  పదచంద్రిక
12. తలచుకొనండి – కనుగొంటాను
13. ఆశుధారలో కమనీయమైన ఖడ్గధార
14. అనగనగా బ్నిం కధలు – రాజయ్య ఇడ్లీ బండి
15. మాయానగరం – 5

You might also like:

5 thoughts on “మాలిక పత్రిక జులై 2014 సంచికకు స్వాగతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *