July 2, 2024

అత్తా, ఒకింటి కోడలే…

రచన: నండూరి సుందరీ నాగమణి “అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు అంతగా ఇష్టపడ్డారు. నువ్వెందుకే కనకం, కట్నం డబ్బు కోసం వియ్యంకుడిని అంత ఒత్తిడి చేస్తున్నావు? మనకేం లేదా, పోదా? మరీ ఇంత ఆశ పనికి రాదు కనకం…” మందలింపుగా అన్నాడు, భద్రయ్య భార్యతో. “మీకు తెలియదు, నోరు మూసుకోండి. కోడలు ఏం తెచ్చింది అంటే నలుగురిలోనూ ఏం చెప్పుకోవాలి నేను?” “అలాగని, పాపం ఆ బడిపంతులును అంతగా హైరానా పెట్టాలటే? నీకు కట్నం ఇవ్వటం కోసం అతనికున్న […]

యస్.వి. రంగారావు

రచన: సుజాత తిమ్మన గంభీరమైన రూపం, నిలువెత్తు విగ్రహం… అది యెస్.వి. రంగారావు. సామర్లకోట వెంకట రంగారావు యస్.వి. రంగారావుగా సుప్రసిద్ధులు. మన తెలుగు రాష్ట్రంలోనిది అయిన కృష్ణాజిల్లాలోని నూజివీడులో 1918 జులై 3 వ తేదీన తెలగ నాయుళ్ళ వంశములో లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు జన్మించారు రంగారావు. రంగారావు తాత కోటయ్య నాయుడు వైద్యుడు. నూజివీడు ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిపుణుడుగా పని చేశారు. రాజకీయ నాయకుడైన బడేటి వెంకటరామయ్య రంగరావుకి మేనమామ. తండ్రి న్యాయ శాస్త్రవేత్త […]

ఏది పొందడానికి ఏం కోల్పోతున్నావు?

రచన: లావణ్య బుద్ధవరపు ఇప్పుడు కొత్తగా ఏదీ జరగలేదు. కానీ చాలా వెలితిగా ఉంది. విపరీతమైన ఒంటరితనం. ఎన్నో ఏళ్లుగా పరుగులు పరుగులు తీస్తూ ఏదో సాధించెయ్యాలి అని అనుక్షణం తపన పడుతూ కింద పడుతూ లేస్తూ ఊపిరి తీసుకోవడం కూడా మర్చి పోయి గడిపేకా, ఎందుకో ఈ సాయంత్రం చాలా గుబులుగా, అన్నీ పోయేయేమో అనే దిగులుగా, విపరీతమైన శూన్యం ఆవహించి ఎడతెగని కన్నీటి ధారలు ఆపినా ఆగనంటూ మరింత కలవరపెడుతున్నాయి. అన్ని పనులూ అలాగే […]

మధ్యతరగతి మందహాసం – నవలా సమీక్ష

రచన: మంగు కృష్ణకుమారి నవల పేరు: మధ్యతరగతి మందహాసం రచయిత్రి: పి సత్యవతి శ్రీమతి పి సత్యవతిగారు చాలా అభ్యుదయ భావాలతో ఉంటారు. అలాగే రాస్తారు కూడా. చాలా డెప్త్ ఉండేలా సాగుతుంది ఆమె రచన. పాతకాలంలో… జ్యోతి, స్వాతి, విజయలాంటి పుస్తకాలకి అనుబంధ నవలలు వచ్చేవి. అలా వచ్చినది ఈ మధ్యతరగతి మందహాసం. మొదటి పేజీలోనే ఆమె డాక్టర్ సినారె గారికి క్షమాపణలతో ఈ పేరు వాడుకున్నాను అని చెప్పేరు. కథంతా అమ్మాయి చెపుతున్నట్టే ఉత్తమపురుషలో […]

తీర్థరాజ్ లో మా కల్పవాసం

రచన: నాగలక్ష్మి కర్రా కల్పవాసం అంటే ఏమిటి?, ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దీని వెనుక నున్న పురాణ కథ ఏమిటి?ఇవన్నీ మీకు తెలియజేస్తూ ‘కల్పవాస’ దీక్షలో ఉన్న మా అనుభవాలు కూడా తెలియజేస్తాను. మన గురువులు మనకు కొన్ని ‘వాసము’ ల గురించి తెలియజేసేరు, కొన్ని కథలలో కూడా మనం ‘రాజుగారు యువరాజుకు రాజ్యభారం ఒప్పజెప్పి వాన ప్రస్థాశ్రమం స్వీకరించి అడవులలోకి పోయి సాత్విక ఆహారం భుజిస్తూ, భగవంతుని కొలుచుకుంటూ కాలం గడిపేరు’ అని వింటూ […]