June 14, 2024

ఏడు పదుల ప్రేమ గోల

రచన: పావని pvls “లక్ష్మీ! లక్ష్మీ! ఏమేవ్ లక్ష్మీ! ఎక్కడున్నావే? ఉన్నావా లేదా??” అంటూ గావు కేకలు పెడుతున్నాడు ప్రసాదరావు పడకగదిలో నుంచి గుక్క తిప్పుకోకుండా… “అబ్బబ్బబ్బా! వంటింట్లో నా తిప్పలు నేను పడ్తుంటే ఏమిటండీ మీ అరుపులు? నేనేమైనా చిన్న పిల్లనా? మీరు పిలవగానే పరిగెత్తుకు రావటానికి. డెభ్భై యేళ్లు నిండాయి నాకు. ఊరికే లక్ష్మీ లక్ష్మీ అంటూ అరుస్తుంటారు” అంటూ కసిరింది వంటింట్లోంచి లక్ష్మి. “ఓహో! నేనేమైనా బాలాకుమారుడినా? నీ పని మానుకుని వచ్చి […]

మాలిక పత్రిక ఉగాది కథలపోటీ 2024 ప్రత్యేక సంచిక

గత మాసంలో మాలిక పత్రిక, ప్రమదాక్షరి (రచయిత్రుల ఫేస్బుక్ సమూహం) సంయుక్త ఆధ్వర్యంలో సమూహ సభ్యులకు నిర్వహించిన సరదా కథల పోటీల విజేతల వివరాలు, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన కథలను ఈ ప్రత్యేక సంచికలో చదవవచ్చు..   ఈ ఉగాది కథలపోటీకి వచ్చిన ముప్పై కథల్లో నియమనిబంధనలకు కట్టుబడి, న్యాయనిర్ణేతలు పది కథలను ఎంఫిక చేసారు. వీలువెంబడి మిగతా కథలు కూడా మాలిక పత్రికలో ప్రచురించబడతాయి.   మాలిక, ప్రమదాక్షరి ఉగాది కథలపోటి విజేతలందరికీ […]

1. కొత్త కోడలు- తెలుగు కాపురం

రచన: కనకదుర్గ జొన్నలగడ్డ “అక్కా, యు నో వాట్? శ్రీకర్ వాళ్ళ బామ్మా నీకు పులిహోర కలపడం వచ్చా అని అడిగింది?” అంటూ ఒకింత ఆశ్చర్యంగా, ఎగతాళిగా తన అక్కకు చెప్పింది త్రిష. “అవునా? అయినా ఈ ఏజ్ లో ఆవిడకు పులిహోర కలపడం గురించి ఎందుకే? దట్ టూ విత్ యు! కొత్త కోడలివి. బామ్మ బాగా స్పోర్టివ్ అన్న మాట! ఆయితే రేపు మేము వచ్చినప్పుడు ఫుల్ మీ ఇంట్లో మాకు ఫుల్ ‘జబర్దస్త్’ […]

2. చాదస్తపు మొగుడు

రచన: కిరణ్మయి గోళ్ళమూడి “లాస్యా! ఎక్కడ విహరిస్తున్నావ్! పాలు పొయ్యిమీద పెట్టి నిద్రపోవద్దు అంటే వినవేం?” కార్తీక్ అరుపుతో కళ్ళు తెరిచింది లాస్య! “పాలు ఎవరు కాచారు?” కంగారుగా అడిగింది. వంటగదిలోకి వెళ్లిన కార్తీక్ కి స్టవ్ పైన గిన్నె కనబడలేదు. పొయ్యి వెలగడం లేదు. వెనకనుండి లాస్య క్రీగంటి చూపులు గుచ్చుకుంటున్నాయి. “గిన్నె మాడిన వాసన వస్తోంది!” నాలుక కరుచుకుని పేపర్ ముఖానికి అడ్డం పెట్టుకుని సోఫాలో కూర్చున్నాడు. “పొయ్యి వెలిగించకపోయినా పాలు పొంగుతాయా?” అంది […]

1. భలే భలే పెళ్ళిచూపులు

రచన: ఉమాదేవి కల్వకోట అరుంధతి చాలా ఆత్రుతగా ఉంది… చాలా టెన్షన్ గా కూడా ఉంది. దానితో నిద్ర కూడా పట్టడం లేదు. ‘మళ్ళీ నిద్రపోకపోతే మరునాడు జరిగే కార్యక్రమంలో తాను అందంగా కనిపించనేమో, తన గ్లామర్ తగ్గుతుందేమో’ అనే ఆందోళన కూడా తోడవడంతో ఇంకాస్త గాబరాగా ఉంది. ఈ ఆత్రుత, ఆందోళన, గాబరా వీటన్నింటికీ కారణమేమిటంటే మరునాడు జరగబోయే పెళ్ళిచూపుల కార్యక్రమం. ‘నిజమే కదా! నిద్ర లేకపోతే ముఖం పీక్కుపోయి, పెళ్ళివారు మెచ్చరు కదా! పాపం […]

2. కిష్కింధ కాండ

రచన: మంగు కృష్ణకుమారి పక్కింటావిడ బజారుకి తోడురమ్మని బతిమాలడంతో, అమ్మకి వెళ్ళక తప్పలేదు. నిజానికి అమ్మకి పిల్లలమీద ఇల్లు వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. అయినా తప్పలేదు. “పిల్లలు ఇల్లు ‘ఆగం ఆగం’ చేసేస్తారొదినా…” అంది. “మరీ చెప్తావు లెద్దూ…నీ పిల్లలు కోహినూరు వజ్రాలు” పిల్లలని ఎత్తేసింది పక్కింటామె. పిల్లలు నలుగురు. పెద్దమ్మాయి, చిన్నక్కా, తమ్ముడూ తరవాత చంటి అయిదేళ్ళది. అమ్మ వెళుతూ, వెళుతూ, “చెల్లి జాగ్రత్త. నేను వచ్చిందాకా, దాన్ని కాస్త చూసుకోండి” అని మరీ […]

1. నత్తి రాంబాబు

రచన: మాలతి నేమాని ‘అమ్మా అన్నం వేసి మజ్జిగపులుసు’ లోపలనించీ ఇంకా రాంబాబు మాట పూర్తి కాకుండానే, ‘ చాల్లేరా, ఆనక తిందువుగాని మళ్ళా’ అని, ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్తున్న శ్యామలని వింతగా చూసింది ఉమ. రాంబాబుకి మాత్రం ఇది అలవాటే కాబట్టి, ‘హు’ అనుకుని ఇవాళ బైట ఏం తిందామా? అని ఆలోచనలో పడ్డాడు. “అదేంటి వదినా పిల్లాడు అన్నం ఇంకా కావాలి అంటే, చాలు అంటావేంటీ” అని ఉండబట్టలేక అడిగేసింది ఉమ. ఓ […]

2. అయిందా పెళ్లి!

రచన: కర్రా నాగలక్ష్మి ఇంకా జోరుగా పరుగెత్తాలి, బుసలు కొడుతూ వెంబడిస్తున్న నాగుపాముల బారిన పడకుండా తప్పించుకోవాలి, చెమటలు శిరస్సు నుంచి సిరిపాదం వరకు కారిపోతున్నాయి, అరవైయేళ్ల శరీరం పరుగెత్తేందుకు సహకరించటంలేదు, ఐనా పరుగెత్తాలి, పరుగెత్తుతూనే ఉన్నాను… ఢిల్లీ నుంచి విశాఖ వెళ్లే ట్రైనులో ప్రయాణిస్తున్న సౌజన్య బండి కుదుపుకి ఉలిక్కిపడింది. మూసుకు పోతున్న కళ్లను బలవంతంగా విప్పి చూసింది. ఎసి సెకెండ్ క్లాసు పెట్టలో నైటు బల్బు నీలంగా వెలుగుతూ కనబడింది. ఓహో కలలో పాములు […]

3. మామ్మగారు

రచన: రాధ వాడపల్లి చల్లగా తెల్లవారింది. చల్లగా తెల్లారటమేమిటి?… అనుకుంటున్నారా? అదేనండీ! సూర్యుడుగారు వస్తూనే ఆకాశాన్నంతా తెల్లగా మార్చేశారు. భూమికి కోపమొచ్చి నీళ్ళని పైకి పంపి, మబ్బులుగా మార్చేసింది. ఆ వానమబ్బుల వల్ల చల్లగా వుందన్నమాట! మీకు అర్థమవుతోందా! (ఇక్కడ రష్మిక మీకు గుర్తొస్తే…నా తప్పు కాదు!) “విందూ! విందా! లేవండర్రా! అసలే ఒంటిపూట బళ్ళు! ఆలస్యం అవుతుందీ!” అంటూ మామ్మగారు మనవడినీ, మనవరాలినీ నిద్ర లేపారు. విందూ అనబడే గోవింద్, విందా అనబడే అరవింద…విసుగ్గా లేచారు. […]

4. హ్యాపీ హార్మోన్స్

రచన: కవిత బేతి కుడిచేత్తో ఫోన్ పట్టుకుని ఎడమచేత్తో బాల్కనీలో ఆరేసిన బట్టలు ఒక్కొక్కటే లాగేస్తూ “హలో భామినీ, గ్రూప్ చూసావా, నేనూ వస్తా అని మెసేజ్ పెట్టు త్వరగా” అని వాయిస్ మెసేజ్ పెట్టింది హాసిని. ఎడమచేత్తో ఫోన్ పట్టుకుని కుడిచేత్తో పొయ్యిమీద కూర కలుపుతున్న భామిని “ఏ గ్రూపులో? ఏం మెసేజ్?” అని రిప్లై వాయిస్ మెసేజ్ పెట్టింది. “యామిని ‘పావని పలకరింపు’ అని గ్రూప్ పెట్టింది నువ్వు దాంట్లో లేవా” అనడిగింది హాసిని. […]