July 2, 2024

క్షమించు నాన్నా!

రచన: మంగు కృష్ణకుమారి సదా నవ్వుతూ కూల్ గా ఉండే చక్రపాణి చాలా డల్ గా ఉన్నాడు. అతని దుఃఖం కొడుకులు ముగ్గురూ చూసేరు. చక్రపాణి సెక్రటేరియట్ లో సెక్షన్ ఆఫీసరు. చాలా క్రమశిక్షణ పాటించే వ్యక్తి. అతని దగ్గర ఎలాటి ఆటలూ సాగవనీ, ఇటు స్టాఫ్ కీ అటు కో వర్కర్లకీ‌ కూడా తెలుసు. అతని నిజాయితీని తట్టుకోలేక, అతన్ని ఇంటర్నల్ గా ట్రాన్సఫర్ చేయించేవారు కొందరు పలుకుబడి ఉన్నవాళ్ళు. ఇలాటి వాటికి జడిసే రకం […]

నేస్తం

రచన: మహేశ్వరి కర్రా ఉదయాన్నే రెండు మూడు సార్లు సుప్రభాతం పాడాలి నా నేస్తం లేవాలంటే…కళ్ళు విప్పగానే తను మొదటగా చూసేది నన్నే… నాకోసం చేయి చాపగానే ఆప్యాయంగా వాలిపోతాను ఆచేతిలో… మురిపెంగా చూసి నన్ను తడుముతాడు నా నేస్తం. అంతే ఇక ఆ రోజు నా జీవితం తన చేతుల్లోనే ఆరంభం…నన్ను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేడు నా నేస్తం. తన శరీరంలో ఒక భాగంలా, తన గుండెచప్పుడులా నన్ను కాపాడుకుంటాడు నా ప్రియ […]

సినిమా చూడు మామా!

రచన: శ్రీకాంత్ నండూరి హాల్లోని ఫోన్ ఆగకుండా మ్రోగుతోంది. అసలే విసుగ్గా ఉంది నాకు… విసురుగా వెళ్ళి ఫోనెత్తి, “హలో” అన్నాను. “హలో శ్రీకాంత్, నేనురా, ప్రణయ్ ని…” “ఓ… ప్రణయ్ నువ్వా, చెప్పరా…” అన్నాను శాంతంగా… “ఏం చేస్తున్నావురా?” “ఏముందిరా, టీవీ చూస్తున్నాను. బయటికి వెళ్ళటానికి లేదు… చిన్నా సినిమా రిలీజ్ అయి వారం అయింది. అసలే రెండేళ్ళుగా సరిగ్గా సినిమాలే చూడలేదు, ఈ ఇంటర్ మీడియట్ చదువు వలన. ఇప్పుడు పాసైపోయినా, ఇంజినీరింగ్ సీట్ […]

ప్రత్యేకత

రచన: లావణ్య బుద్ధవరపు నిజమే, ఈ ప్రత్యేకత అనేదే చాలా ప్రత్యేకమైన విషయం అందరి జీవితాలలోనూ. ఏమంటారు? పుట్టినప్పటినుంచీ తుదిశ్వాస విడిచేవరకూ మనం ప్రతి క్షణం ప్రత్యేకత కోసమే పాకులాడతాం. అంతే కాదు, ఆ ప్రత్యేకత మరొకరికి ఉందని ఉడుక్కుంటాం, మనకు దక్కలేదు అని ఓ తెగ బాధ పడిపోతూ ఉంటాం కూడా. ఐతే ఈ ప్రత్యేకత అనే విషయం మీదే ఒక చిన్న కథ చెప్పుకుందాం… “ఇదిగో చూడు కాంతి, నువ్వు మీ క్లాస్ లో […]

నాటి తారలు – శ్రీమతి పసుపులేటి కన్నాంబ

రచన: సుజాత తిమ్మన చలనచిత్ర, రంగస్థల నటి మాత్రమే కాక గాయనిగా కూడా ప్రతిభ కలిగిన కన్నాంబ పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ. కన్నాంబ ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో లోకాంబ మరియు ప్రభుత్వ కాంట్రాక్టర్ అయిన ఎం. వెంకనరసయ్య దంపతులకు 1912 లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించింది. ఆమె వారికి ఏకైక సంతానం అవటం వలన గారంగా పెరిగింది. ఆమె తాత నాదముని నాయుడు గ్రామ వైద్యుడు. ఆమె అమ్మమ్మ గ్రామ నర్సుగా ప్రజలకు […]

శ్రీ లక్ష్మీనర్సింహ దేవాలయం – కోరుకొండ

పురాతన దేవాలయాలు. ఆంధ్రప్రదేశ్ – 1 రచన: సుధా రాజు కోరుకొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ మండలంలోని గ్రామం. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆలయం ఉంది. రెండు దేవాలయాలు ఉన్నాయి. ఒకటి కొండ దిగువన, ఒకటి కొండపైన ఉంటుంది. కొండ దిగువన ఉన్న దేవాలయం పాతది కానీ అది పురాతనమైనదో కాదో తెలియదు. ఆలయ స్తంభాలు దాని వయస్సును సూచిస్తాయి. ప్రాకారంలో మండపం ఉంది. ఈ ప్రాకారం నుండి కొండ […]