July 5, 2024

మాలిక పత్రిక జులై 2024 సంచికకు స్వాగతం

  భార్య.. భర్త తల్లితండ్రులు.. పిల్లలు కొడుకులు.. కోడళ్లు కూతుళ్లు… అల్లుళ్లూ అత్తలు.. మామలు పిన్ని.. బాబాయ్ ఇలా ఎన్నో బంధాలు అనుబంధాలు… అందరి మధ్య రక్తసంబంధంతో కూడిన ప్రేమ, అనురాగం, గౌరవం, మమకారం కనిపిస్తుంది. నీది నాది అని కాకుండా మనది అనే అందమైన ఆప్యాయతతో కూడిన భావన అందరికీ ఉంది. కాని ఇది ఒకప్పటి మాట అని అందరూ ఒప్పుకునే చేదు నిజం. ఈ రోజు ఈ అనుబంధాలన్నింటిలో ఎన్నో పరిమితులు, వలయాలు, పొరలు, […]

స్వప్నాలూ , సంకల్పాలూ – సాకారాలు -11

రచన: డా. లక్ష్మీ సలీం అనువాదం: స్వాతీ శ్రీపాద ఈ కేస్ కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. దానివల్ల మరింత తరచుగా కాలిన కేస్ లు రాడం మొదలయింది. సరైన సమయంలో వస్తే వారిని రక్షించగలిగే దాన్ని. కాని కాలిన గాయాలున్న కేస్ లకు చికిత్స చెయ్యడానికి చాలా సమయం తీసుకోడమే కాక శ్రమ కూడా ఎక్కువే. దానికి తోడు, చాలా మటుకు కాలిన వాళ్ళు క్రింది తరగతి, మధ్యతరగతి కుటుంబాల నుండి కావడం వల్ల వాళ్ళూ బిల్ […]

పట్టుదల

రచన: లావణ్య బుద్ధవరపు తన డైలీ రొటీన్ ఫాలో అవుతూ ఎప్పటిలానే‌ ఉదయం ఐదున్నరకు నిద్ర లేచి, ఫ్రెష్ అయ్యి యోగా, తర్వాత కాసేపు గార్డెనింగ్ చేసి, అది అవగానే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుని పేపర్ తిరగేస్తూ వార్తలు చదువుతున్నాడు జీవన్. ఒక తెలివైన అందమైన చురుకైన మోస్ట్ ఎలిజిబుల్ బేచలర్ ఆఫ్ హిజ్ సర్కిల్. ఒక లీడింగ్ బ్రాండ్ కార్ మేన్యుఫేక్చరింగ్ యూనిట్ లో సీనియర్ రీసెర్చ్ ఇంజనీర్. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, అటు […]

గంతకి తగ్గ బొంత

రచన: గిరిజారాణి కలవల “మర్చిపోయారా? మనల్ని కాదని తక్కువకులం వాడిని కట్టుకున్న మీ చెల్లి ఏ రోజు మన గడప దాటిందో… ఆ రోజే ఆవిడగారికి నీళ్ళొదిలేసాము. ఇప్పుడేమో ఆ మొగుడూ పెళ్ళాం ఏక్సిడెంట్ లో పోయారనీ, మీ మేనకోడలు అనాథ అయిపోయిందని, తెగ జాలి పడిపోయి, ఆ నష్ట జాతకురాలిని తెచ్చి, నా ముఖాన పడేసారు. ఇదేమో తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. ఛస్తున్నాను ఇంటిల్లిపాదికీ చాకిరీ చేయలేక.” భర్త రమణయ్య మీద కయ్యిమంది విజయమ్మ. […]

రైలు ప్రయాణం

రచన: ప్రమీల సూర్యదేవర “చేత వెన్నముద్ద, చెంగల్వపూదండ, బంగారు మొలత్రాడు, పట్టుదట్టి, సందెతాఎత్తులు, సరిమువ్వ గజ్జెలు చిన్ని కృష్ణా నిన్ను చేరికొలుతూ!” ప్రదీప్ ని తాతయ్య ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాకు నేర్పిన మొట్టమొదటి పద్యం వాడికి చెప్తున్నారు. వాడికి అసలే నోరు తిరగదు. అందులో అలవాటులేని తెలుగు, అతికష్టంగా తన యాసలో తను పలుకుతున్న ప్రదీప్ కి, స్కూల్ టీచర్ గా పనిచేసి రిటైర్ అయిన తాతయ్య, వాడి యాస భరించ లేనట్లు ఎలాగైనా వాడితో యాసలేకుండా […]

అమ్మమ్మ – 58

రచన: గిరిజ పీసపాటి ఇదేమో చాలా చిన్న గ్రామం. డాక్టర్ కాదు కదా కనీసం మెడికల్ షాప్ కూడా లేదు. తను ఇంకా ఉంటే తను బాధ పడడంతో పాటు, అందరినీ బాధ పెట్టాలి. పైగా అక్కడ అమ్మ తమ కోసం ఎదరుచుస్తూ ఉంటుంది. అమ్మమ్మ ఇంట్లో ఉంటే పరవాలేదు. ఒకవేళ వంట పనికి వెళ్ళిపోయిందంటే ఒక్కర్తే రాత్రిళ్ళు ఇబ్బంది పడాలి. ఇన్ని ఆలోచనలతో గుండెల్లో విపరీతమైన దడ వస్తోంది. పైకి మాత్రం చాలా మామూలుగా ఉన్నట్లు […]

మమత – మానవత

రచన: సుందరీ నాగమణి అలసటగా కిటికీ ఊచలకు తలాన్చి నిద్రలోకి జారిన కన్నయ్య, ఒక్క కుదుపుతో రైలాగటంతో ఉలిక్కిపడి లేచాడు. క్షణం పాటు తానెక్కడున్నాడో అర్థం కాలేదు. కొన్ని లిప్తల తరువాత, జరిగినదంతా గుర్తు వచ్చింది. కొడుకు ఇంట్లో గొడవ జరగటం, తాను వికలమైన మనస్సుతో స్టేషన్ కి వచ్చి, కదులుతున్న రైలు ఎక్కేయటం… అంతా… బయటకు చూసాడు. ఏదో చిన్న స్టేషన్. సిగ్నల్ కోసమనుకుంటా… ఆగి ఉంది రైలు. కనుచీకటి పడుతోంది… మసక చీకటిలో బోర్డ్ […]

సుందరము సుమధురము ఈ గీతము

రచన: నండూరి సుందరీ నాగమణి ‘సంసారం – ఒక చదరంగం’ ఈ చిత్రంలోని శీర్షికాగీతాన్ని గురించి చర్చించుకోబోతున్నాము. 1987 లో తెలుగులో విడుదలైన ఈ చిత్రానికి మాతృక, 1986లో వచ్చిన తమిళంలో విసు దర్శకత్వం వహించిన, ‘సంసారం – అదు మిన్సారం’ అనే చిత్రం. తమిళంలో అఖండ విజయం సాధించటంతో, తెలుగులో కూడా ఈ చిత్రాన్ని నిర్మించాలని ఎవియం వారు అనుకుని, విసు పాత్రలో శ్రీ గొల్లపూడి మారుతీరావుగారిని పెట్టి, ‘సంసారం – ఒక చదరంగం’ పేరుతో […]

ఇందుకా?

రచన: మంగు కృష్ణకుమారి ఆనందరావు హుషారుగా ఏర్పాట్లు చేస్తున్నాడు. కరోనా కారణంతో ఎవరూ ఎవరినీ కలవటం లేదు. స్నేహితులతో మందు పార్టీలు, విందు భోజనాలు చేస్తూ గడపడం అంటే చాలా ఇష్టపడే అతనికి, ఇన్నాళ్ళకి పార్టీ ఇచ్చే అవకాశం వచ్చింది. ఎవరు ఎక్కడ కలిసినా ఎక్కువ ఖర్చు అతనే భరించడం చేత సహజంగా అందరూ ఆనందరావు చుట్టూ చేరతారు. అతను అన్నీ సద్దేసరికి సుబ్బారావు, గణేశ్, ముకుందం వచ్చేసారు. “ఏరా కాశీ ఏడిరా?” అన్నాడు గణేశ్ సీసాల […]

బాలమాలిక – పాలబువ్వ

రచన: నాగమణి కొడుకును నట్టింట్లో కూర్చోబెట్టి, తాను వెళ్ళి ఒక గ్లాసుడు నీళ్ళు తాగి వచ్చింది మల్లమ్మ. అప్పుడు గమనించింది కొడుకు రాము చేతిలోని ఆ కారు బొమ్మను. “ఇదేందిరా అయ్యా! ఈ బొమ్మ ఎక్కడిది? కొంపదీసి, అమ్మగోరి ఇంట్లో బుల్లిబాబుదా?” కోపంగా కొడుకు వైపు చూస్తూ అడిగింది. “అవునమ్మా!… బాగుందని ఆడుకోవటానికి తెచ్చుకున్నాను…” చేతిలో బొమ్మ వైపు ఆశగా చూసుకుంటూ జవాబు ఇచ్చాడు నాలుగేళ్ళ రాము. “ఇంట్లో ఒక్కడివి ఉన్నావని, జొరపడి లెగిసావని ఒక్కడినీ ఒదిలేయలేక, […]